Bigg Boss 10 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం రెండు వారాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి వారంలో భాగంగా చరణ్, చైత్ర ఎలిమినేట్ అయినప్పటికీ చరణ్ తిరిగి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక రెండవ వారం ఈ కార్యక్రమం నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి రెండు వారాలకి బయటకు వచ్చిన ఈయన ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాన్ని తెలియజేశారు. తాను బయట ఉన్నప్పుడు నెలకు ఏడు నుంచి పది కేజీల స్వీట్ తినేవాడిని హౌస్ లోకి వెళ్లడంతో ఒక్కసారిగా స్వీట్స్ మానేయటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని అందుకే బయటకు వచ్చాననే కారణాన్ని తెలిపారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి వారి ఆట తీరు గురించి కూడా కృష్ణుడు మాట్లాడారు. హౌస్ లో ఉన్న సమయంలో రోహిత్ తో తనకు జరిగిన గొడవల గురించి ముచ్చటించారు అదేవిధంగా త్రిగుణ్ ఆట తిరుగు గురించి కూడా ఈయన మాట్లాడారు. బిగ్ బాస్ లాంటి గేమ్‌కి అతను పర్ఫెక్ట్ సూట్ అవుతాడు.ఎలా ఆడాలో,ఏం ఆడాలో క్లారిటీ ఉందనీ తెలిపారు. రోహిత్ ఇద్దరూ కూడా విన్నర్ రేస్ లో ఉంటారని ఈయన తెలిపారు.
ఇక రాంప్రసాద్ గురించి మాట్లాడుతూ పది వారాలలో హౌస్ నుంచి బయటకు వస్తారని కృష్ణుడు తెలిపారు. ఇక నరేష్ గురించి మాట్లాడుతూ చాలా మంచి వ్యక్తిని మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని నరేష్ గురించి కూడా చెప్పుకువచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ ఉండడం సర్వసాధారణం మరి ఈ సీజన్ లో లవ్ ట్రాక్స్ గురించి కూడా కృష్ణుడు మాట్లాడారు. ముఖేష్ చాలా బాగా ఆడతారు కానీ పులిహోర బాగా కలుపుతారని ప్రస్తుతం ముఖేష్ వర్షిణి లవ్ ట్రాక్ లో ఉన్నారని కృష్ణుడు తెలిపారు.
ఈ విధంగా ముఖేష్, వర్షిణి కాకుండా సుధీర్ రెడ్డి సృష్టిల మధ్య కూడా ట్రాక్ ఉంది కానీ.. ఆమె చాలా కాన్ఫిడెన్స్‌గా ఉందనీ, సుధీర్ ఆమెను పడేయాలని భావిస్తున్నప్పటికీ తను మాత్రం అమ్మాయిల్ని ఎలా పడేయాలో ట్రైనింగ్ ఇస్తాను కానీ నేను మాత్రం పడనని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుందని కృష్ణుడు తెలిపారు. ఇలా బిగ్ బాస్ విన్నర్ గురించి అలాగే హౌస్ లో ఉన్న లవ్ ట్రాక్ గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తనకు వైల్డ్ కార్డు అవకాశం వస్తే తిరిగి మళ్ళీ హౌస్ లోకి వెళ్లి ఆడుతానని ధీమా వ్యక్తం చేశారు. మరి కృష్ణుడికి వైల్డ్ కార్డు ఎంట్రీలో ఛాన్స్ ఉంటుందా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ వైల్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జబర్దస్త్ కమెడియన్ .. బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పిన కార్తీక్!