E-Paper
Advertisement

కాసాని జ్ఞానేశ్వర్ రీ-ఎంట్రీ.. నెక్ట్స్ పొలిటికల్ ప్లాన్ ఇదేనా?

కాసాని జ్ఞానేశ్వర్ రీ-ఎంట్రీ.. నెక్ట్స్ పొలిటికల్ ప్లాన్ ఇదేనా?
Advertisement

Kasani Gnaneshwar: ఒకప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.. బీసీల గొంతుకగా గట్టిగా వినిపించిన పేరు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌. ముదిరాజ్‌ సామాజికవర్గానికి పెద్ద దిక్కుగా నిలిచిన నాయకుడు. పార్టీ ఏదైనా.. పదవి ఏదైనా బీసీల ప్రాతినిధ్యం, రాజకీయ వాటా అంశాలను బలంగా వినిపించిన వ్యక్తి. ఒక దశలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ఇప్పుడు ఎక్కడ? ఇదే రాజకీయ వర్గాల్లో చర్చ.జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగానూ.. పలు రాజకీయ పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసాడు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో..

బీసీ సామాజికవర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 96 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున చేవెళ్ల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్‌ క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ధీమా వ్యక్తం..

Advertisement

2024 లోక్‌సభ ఎన్నికలు కాసాని రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా మారాయి. బీఆర్‌ఎస్‌ ఆయనను చేవెళ్ల నుంచి బరిలోకి దించింది. బీసీ–ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన తనకు ఈ నియోజకవర్గంలో మంచి ఆదరణ ఉంటుందని, బీసీలంతా ఏకమవుతారని కాసాని అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 8,09,882 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి 6,36,985 ఓట్లు రాగా.. కాసాని జ్ఞానేశ్వర్‌కు 1,78,968 ఓట్లు మాత్రమే వచ్చాయి. 10.68 శాతం ఓట్లతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. అంటే.. ఎన్నికల ప్రచారంలో బీసీ ఓటు బ్యాంకుపై పెట్టుకున్న అంచనాలు ఫలితాల్లో ప్రతిఫలించలేదన్నది స్పష్టమైంది.

బీసీ కార్డు.. రాజకీయ బలం ఎంత?

కాసాని జ్ఞానేశ్వర్‌కు బీసీ నాయకుడిగా ఉన్న గుర్తింపు కొత్తది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు చేపట్టారు.టీడీపీకి రాజీనామా చేసి 2023లో బీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో ముదిరాజ్‌ వర్గానికి రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 2024 చేవెళ్ల ఎన్నికల తర్వాత ఆ రాజకీయ సమీకరణం కాసానికి అనుకున్నంతగా కలిసి రాలేదు.

Advertisement

Also read: సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!

ఇప్పుడు ఎక్కడ?

చేవెళ్ల ఓటమి తర్వాత కాసాని జ్ఞానేశ్వర్‌ రాజకీయంగా ఎంతవరకు యాక్టివ్‌గా ఉన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో ఆయన గతంలో ఉన్నంతగా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ కు సైతం వచ్చిన సందర్భాలు లేవు. బీసీ, ముదిరాజ్‌ సమావేశాల్లోనూ ఆయన రాజకీయ చురుకుదనం తగ్గిందన్న చర్చజరుగుతోంది. ఇటీవలి కాలంలో ముదిరాజ్‌ సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ రాజకీయాల్లో యాక్టివ్‌ రోల్‌ తగ్గినా, ముదిరాజ్ సామాజికవర్గంలో మాత్రం యాక్టీవ్ గానే ఉన్నట్లు అనుచరులు పేర్కొంటున్నాయి.

వారసుడి ఎంట్రీపై చర్చ..

ఇదే సమయంలో కాసాని కుటుంబం నుంచి మరో రాజకీయ ముఖం ముందుకు వస్తుందన్న చర్చ కూడా గతంలో జరిగింది. కాసాని వీరేశ్‌ పేరు 2023లో పరిగి రాజకీయాలతో ముడిపడి వార్తల్లోకి వచ్చింది. పరిగి నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్నట్లు ప్రచారం జరిగింది. చేవెళ్లకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేతలతో జరిగిన సమావేశాల్లోనూ కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ఆయన కుమారుడు వీరేశ్‌ పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల్లోవిస్తృత ప్రచారం నిర్వహించారు.దీంతో కాసాని తర్వాత రాజకీయ వారసత్వాన్ని వీరేశ్ ముందుకు తీసుకెళ్తారని అప్పటి నుంచే చర్చజరుగుతుంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వీరేశ్‌కు పదవి అప్పగించలేదు. కేవలం కార్యకర్తగానే పనిచేస్తున్నారు.

ఎమ్మెల్సీపై కాసాని ఆశలు?

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనుంది. అయితే ఆ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌ తన వారసుడిని బరిలో నిలుపుతారన్న చర్చజరుగుతుంది. పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ నుంచి మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.

మళ్లీ బీసీ రాజకీయాల్లోకి వస్తారా?

కాసాని రాజకీయ ప్రస్థానంలో హెచ్చుతగ్గులు కొత్తేమీ కాదు. టీడీపీలో కీలక బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరడం.. చేవెళ్ల నుంచి లోక్‌సభ బరిలోకి దిగడం.. అక్కడ మూడో స్థానానికి పరిమితం కావడం వరకు ఆయన ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. ఒకప్పుడు బీసీ రాజకీయాల్లో బలమైన స్వరంగా వినిపించిన కాసాని జ్ఞానేశ్వర్‌.. ఇప్పుడు మాత్రం రాజకీయంగా మౌనంగా కనిపిస్తున్నారు. ఈ మౌనం వ్యూహాత్మక విరామమా? లేక రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి ముందు నిశ్శబ్దమా? అన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇప్పుడు మాత్రం ఆయన ముందున్నది మరో రాజకీయ దశ.మళ్లీ బీసీ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటారా?బీఆర్‌ఎస్‌లో క్రియాశీల పాత్ర పోషిస్తారా?ఎమ్మెల్సీ గా తనవారసుడికి టికెట్ ఇప్పించుకోవడంతో పాటు గెలిపించుకొని రాజకీయాల్లోతనదైన ముద్ర వేస్తారా? లేదా? అన్నది ఇప్పడు హాట్ టాఫిక్ అయింది.

Also Read: రొయ్యలు, బిర్యానీలు తిని నీళ్లను రాయలసీమకు అప్పగించారు.. KCRపై జూపల్లి సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

ఖైరతాబాద్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ టికెట్ కోసం ముమ్మర కసరత్తు!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

పులివెందుల రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

దానం నాగేందర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ట్విస్ట్.. రంగంలోకి బీఆర్ఎస్, బీజేపీ!

రాఖీ సినిమా సీన్ రిపీట్.. చెల్లిని చంపిన భర్తను అతి దారుణంగా చంపిన అన్నయ్య!

బీఆర్ఎస్ ఫాంహౌస్‌లపై కాంగ్రెస్ ఫోకస్.. ఫీల్డ్ విజిట్ నివేదికపై ఉత్కంఠ!

ప్రధాని మోదీపై సెటైరికల్ స్కిట్ వివాదం.. రగిలిపోతున్న బీజేపీ నేతలు!

Big Stories

Advertisement
×