E-Paper
Advertisement

‘కుకు విత్ జాతిరత్నాలు’ విజేతగా బిగ్ బాస్ బ్యూటీ!

‘కుకు విత్ జాతిరత్నాలు’ విజేతగా బిగ్ బాస్ బ్యూటీ!
Advertisement

Cooku with Jathirathnalu season 2: ఈ మధ్యకాలంలో ఎన్నో షోలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే వినోదంతో పాటు కమ్మని రుచులను పరిచయం చేస్తూ ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్న షో కుక్ విత్ జాతి రత్నాలు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తవగా.. ఇక రెండవ సీజన్ కూడా నేటితో ముగిసింది.మొదటి సీజన్లో సుజిత టైటిల్ గెలుపొందగా.. ఇప్పుడు రెండవ సీజన్లో బిగ్ బాస్ బ్యూటీ తనూజ(Thanuja ) టైటిల్ సొంతం చేసుకోవడం గమనార్హం. మొదటినుంచి తన వంటలతో జడ్జ్ లను మెప్పిస్తూనే వచ్చిన ఈమె.. ఇక ఫినాలే రౌండులో కూడా సత్తా చాటి విజేతగా నిలిచింది.

కుకు విత్ జాతి రత్నాలు సీజన్ 2 విజేతగా బిగ్ బాస్ బ్యూటీ..

నిజానికి కుకు విత్ జాతి రత్నాలు సీజన్ 1 లో కూడా తనూజ పాల్గొనింది. అయితే చివరి క్షణంలో ఆమెకి టైటిల్ మిస్సయింది. దాంతో వదినమ్మ సీరియల్ ఫేమ్ సుజిత విజేతగా నిలిచింది. ఇక ఎలాగైనా సరే టైటిల్ అందుకోవాలనే ఆలోచనతో మళ్ళీ సీజన్ 2 లో కూడా అడుగుపెట్టింది తనూజ. ఇక్కడ తనదైన ఆట, మాటలతో ఆకట్టుకుంటూ తన చేతి వంటలతో జడ్జెస్ ను మెప్పించింది. ఇక 5 టీములు ఫైనల్ కి చేరుకోగా.. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో అద్భుతమైన వంటలను వండి జడ్జెస్ ను మెప్పించారు. చివరిగా తనూజా తాను చేసిన డిష్ ను వడ్డించింది. బాసా చేప విత్ చింతచిగురు, ఖర్గా మసాలా స్టఫ్డ్ స్కిన్ చికెన్, మటన్ బిర్యానీ, క్రిస్పీ అవకాడో, ఇరానీ చాయ్ డెసర్ట్లను ఆమె జడ్జెస్ ముందు ఉంచగా.. వీటిని టేస్ట్ చేసి అద్భుతంగా ఉందన్నారు.

స్కోరింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..

Advertisement

ఛాలెంజింగ్ గా తీసుకొని మళ్ళీ రెండో సీజన్ కి వచ్చావు ఇది ఈరోజు రాయల్ గా ఉంది అని సంజయ్ ఆమెను మెచ్చుకున్నారు. చాలా వెరైటీలు.. మంచి టేస్ట్ తో చేసావు అని శ్రీదేవి అభినందించగా.. ప్రజెంటేషన్ , టేస్ట్ రెండూ బాగున్నాయి అంటూ అలీ , అరుణ ఈమెపై ప్రశంసలు కురిపించారు. ఇక స్కోరింగ్ టైం లో రివర్స్ ఆర్డర్లో స్థానాలను ప్రకటించారు..అలా 88 మార్కులతో రాకేష్ టాప్ 5 స్థానంలో ఉన్నాడని ముందుగా ప్రకటించారు. దీంతో రాకేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 83 మార్కులతో ఆషిక నాలుగవ స్థానానికి పరిమితం కాగా, 90 మార్కులతో నిఖిల్ మూడో స్థానం, 92 మార్కులతో పవన్ రెండవ స్థానంలో నిలువగా, ఏకంగా 93 మార్కులతో తనూజ మొదటి స్థానంలో నిలిచి విజేతగా నిలిచింది.

also read:శేఖర్ – జానీ మాస్టర్ గొడవపై రఘు మాస్టర్ ఊహించని కామెంట్!

ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ..

Advertisement

ఇకపోతే విజేతగా నిలిచిన తనుజాకు ట్రోఫీతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇకపోతే తనకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తనూజ ధన్యవాదాలు తెలిపింది. మొత్తానికైతే బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయినా.. అక్కడ రన్నర్ గా నిలిచింది.కుకు విత్ జాతి రత్నాలు సీజన్ వన్ లోనైనా టైటిల్ అందుకోవాలని చూసింది. అక్కడ నిరాశ మిగిలింది. ఎలాగైనా సరే ట్రోఫీని కొట్టాలి అనే ఆలోచనతో , పట్టుదలతో కసిగా ప్రయత్నించి ఎట్టకేలకు కుకు విత్ జాతి రత్నాలు సీజన్ 2 విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది తనూజ.

Related News

శేఖర్ – జానీ మాస్టర్ గొడవపై రఘు మాస్టర్ ఊహించని కామెంట్!

బిగ్ బాస్ 10లోకి మరో జబర్దస్త్ కమెడియన్.. దశావతారంలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : మాధవ్ కోసం చక్రీ నిర్ణయం..? మాధవ్ జాతకం పై కామెంట్స్.. మొక్కుతో నారాయణ షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. అశ్విన్ దెబ్బకు పల్లవి షాక్.. అవనికి దొరికిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం ప్రభా టెన్షన్.. బాలు కు ఘోర అవమానం.. మనోజ్ జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. నర్మదా ప్లాన్ తో మైండ్ బ్లాక్.. ప్రేమ కోసం విశ్వ ప్లాన్..

Big Stories

Advertisement
×