E-Paper
Advertisement

శేఖర్ – జానీ మాస్టర్ గొడవపై రఘు మాస్టర్ ఊహించని కామెంట్!

శేఖర్ – జానీ మాస్టర్ గొడవపై రఘు మాస్టర్ ఊహించని కామెంట్!
Advertisement

Raghu Master: గత రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్సర్ అసోసియేషన్లో నెలకొన్న వివాదం ఏ రేంజ్ లో భగ్గుమంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డాన్సర్ అసోసియేషన్లో అవకతవకలు జరిగాయని, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (Sumalatha) వాదించడం.. అటు సమస్య జరిగితే ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మిగతా డ్యాన్సర్లు చెప్పడం.. అంతేకాదు ఆమె ఏకపక్ష నిర్ణయాలకు విసిగిపోయిన ఏకంగా 10 మంది సభ్యులు ఒకేసారి రాజీనామా చేయడం అన్నీ జరిగిపోయాయి. దీంతో రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ), బాలకృష్ణ(Balakrishna ) ఫిలిం ఫెడరేషన్ తో పాటు ఫిలిం ఛాంబర్ కూడా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఉప ఎన్నికలు లేకుండా రాజీనామా చేసిన పదిమంది సభ్యులను కలుపుకొని డ్యాన్సర్స్ అసోసియేషన్ ముందుకు వెళ్లాలి అని చెప్పారు.దానికి సుమలత జానీ మాస్టర్ కూడా అంగీకరించారు.

జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య ఏం జరుగుతోంది?

కానీ అదేది జరగలేదు. మళ్లీ రాజీనామా చేసిన పదిమంది సభ్యుల కోసం ఉప ఎన్నికలు జరపడం, వాటి ఫలితాలు వెలువడం అన్ని చకచక జరిగిపోయాయి. దీంతో బాలకృష్ణ, చిరంజీవి మాటలను కూడా పెడచెవిన పెట్టి వీరు వ్యవహరిస్తున్న తీరుకు సోషల్ మీడియాలో టాలీవుడ్లో విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. జానీ మాస్టర్ (Jani master), శేఖర్ మాస్టర్(Sekhar master)అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య గొడవపై రఘు మాస్టర్ (Raghu master) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య గొడవపై రఘు మాస్టర్ రియాక్షన్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ.. కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకి తాజాగా రఘు మాస్టర్ తన భార్య ప్రముఖ సింగర్ ప్రణవి (Pranavi)తో కలిసి వచ్చారు. అందుకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. తన భార్య ప్రణవితో” ఎప్పుడు ఇలా రెడీ అవ్వకు” అంటూ రఘు మాస్టర్ చెబుతారు. బాగుంది కదా అని ప్రణవి అడిగితే.. మనం ఫంక్షన్ కి వెళ్తున్నామా? లేక పెన్షన్ తీసుకోవడానికి వెళ్తున్నామా? అంటూ కౌంటర్ వేస్తారు.

రఘు మాస్టర్ ఏమన్నారంటే?

ఇంకా 90′ స్ లోనే ఉంటావా జెన్ జీ లాగా ఉండడానికి ట్రై చెయ్ అని చెబుతుండగానే.. హైపర్ ఆది (Hyper aadi) ఎంట్రీ ఇచ్చాడు. మాస్టర్ గొడవ ఏంటి? అని అడుగుతుండగానే.. రఘు మాస్టర్ జెన్ జీలా రెడీ అవమని నేను చెబుతుంటే.. ఇంకా 90 లోనే స్ట్రక్ అయిపోయింది అని చెబుతుండగానే.. ఆది మాట్లాడుతూ.. “ఈ గొడవ మీద మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ.. శేఖర్ మాస్టర్ కి జానీ మాస్టర్ కి మధ్య ఏదో గొడవ అంట అని అడిగాడు. అలా అడుగుతుండగానే రఘు మాస్టర్ ఒక్కసారిగా భయపడిపోయి రెండు చేతులతో దండం పెడుతూ..” ఓరి బాబోయ్” అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. రఘు మాస్టర్ టాపిక్ ను ఎంత డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా.. హైపర్ ఆది మాత్రం పదే పదే జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య గొడవ గురించి అడిగే ప్రయత్నం చేశారు.

అసలు విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ రావాల్సిందే..

Advertisement

మీకు దండం పెడతా నన్ను మాత్రం అడగద్దు అనే రేంజ్ లో రఘు మాస్టర్ రియాక్షన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో గట్టిగానే గొడవ జరుగుతోంది. అందుకే రఘు మాస్టర్ చెప్పడానికి భయపడుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఒకవేళ ఇద్దరి మధ్య గొడవ గురించి రఘు మాస్టర్ స్పందించారా? లేదా? అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Related News

బిగ్ బాస్10 లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీస్.. వచ్చి రావడంతోనే గొడవలు!

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

కడుపునిండా తిండి పెట్టి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

జబర్దస్త్ లో ఉన్న ఎవరికి కామెడీ రాదు..కమెడియన్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

Big Stories

Advertisement
×