E-Paper
Advertisement

ఊచకోత కోస్తున్న దందా.. 28 ఏళ్ల కల నెరవేరింది- డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి

ఊచకోత కోస్తున్న దందా.. 28 ఏళ్ల  కల నెరవేరింది- డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి
Advertisement

Danda: ప్రముఖ యూట్యూబ్ దొర సాయి తేజ (Dora Sai Teja) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన మైక్రో డ్రామా సిరీస్ దందా. 26 ఎపిసోడ్లతో వర్టికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా ఛాయ్ షాట్స్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కి విజయ్ కుమార్ (Vijay Kumar) కథ అందించగా.. ఆదిత్య దేవులపల్లి (Adithya devulapalli)దర్శకత్వం వహించారు. ప్రస్తుతం జెన్ జీ ఆడియన్స్ ను మెప్పిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి ఎన్నో విషయాలను పంచుకున్నారు. 28 ఏళ్లకే డైరెక్టర్ అవ్వాలనుకున్న నా కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చారు.

మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

నేను చదువులో టాపర్నే అయినా చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసి.. రాడికల్ డిసిషన్ తీసుకున్నా.. ఇంట్లో కెమెరా మీద ఉన్న ఆసక్తిని చెప్పడంతో ఒక చిన్న కెమెరా కొనిచ్చారు. ఇండస్ట్రీలో నాకంటూ ఎవరూ లేరు. ఫోటోగ్రఫీ నేర్చుకుని ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత సెయింట్ మేరీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చేరి అక్కడ నా ప్రొఫెసర్ అమృత్ సార్ కి కూడా సినిమా అంటే పిచ్చి.. ఆయన వల్లే ఫ్రెంచ్, ఇంగ్లీష్ తో సహా వరల్డ్ సినిమా వైపు నా చూపు మళ్ళింది. ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చి కాంటాక్ట్స్ పెంచుకున్నాను. ఈ క్రమంలోనే చాయ్ బిస్కెట్ అనురాగ్ అన్నకి ఒక వైలెంట్ కథ నరేట్ చేసాను. నేనెప్పుడూ అనుకునేవాడిని.. 28 ఏళ్ల కల్లా నేను డైరెక్టర్ అవ్వాలని ఇప్పుడు అయ్యాను. నాకల నెరవేరింది .

చాయ్ షాట్స్ లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది?

Advertisement

తెలుగులో ఇలాంటి కథను తీసే ధైర్యం ఎవరూ చేయరు అని నేను ఈ కథను అనురాగ్ అన్నకు చెప్పినప్పుడు ఆయన అన్నారు. అప్పటికే నేను జర్నలిజంలో ఉన్నాను. ఆయన కొత్తగా షార్ట్స్ ప్రారంభించి, నన్ను క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అవ్వమన్నారు. అక్కడ కొన్ని షోస్ చేసిన తర్వాత అదంతా నాకు చాలా రొటీన్ గా అనిపించింది. దాంతో నేరుగా అనురాగ్ అన్న దగ్గరికి వెళ్లి.. నేను మీకు ఒక క్రేజీ షో డైరెక్ట్ చేసి చూపిస్తా అని పట్టుబట్టి చెప్పాను. అలా దందా ప్రయాణం మొదలయ్యింది.

విజయ్ కుమార్ తో పాటు దందా కథలో మీ ప్రమేయం ఎంత?

ఈ చిత్రానికి ఒరిజినల్ కథను విజయకుమార్ రాసినా.. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి . నేను మొత్తం రీ-రైట్ చేసి కథకు కంప్లీట్ నెస్ తీసుకొచ్చాను. అరవింద్ , ప్రకాష్ ఠాకూర్, గణేష్ ఠాకూర్ క్యారెక్టర్స్ బ్యాక్ గ్రౌండ్ తో సహా సుమారుగా 40 శాతం మార్పులు చేశాను. ఆ తర్వాతే దొరసాయి తేజ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.

దందా రెస్పాన్స్ మీకు ఎలా అనిపిస్తోంది?

Advertisement

ఈ చిత్రానికి ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాలేదు. ప్రతి ఒక్కరు ఫ్రెష్ మేకింగ్ స్టైల్, స్ట్రాంగ్ కంటెంట్ ని విపరీతంగా పొగుడుతున్నారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. పైగా ఈ సిరీస్ బాలేదని ఒక్కరు కూడా అనలేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అనురాగ్ అన్నకి ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా గర్వంగా ఉంది.

ALSO READ:ఇండస్ట్రీలో నటుడిగా 41 ఏళ్లు.. ఇంత చెండాలం చూడలేదు.. ‘జబర్దస్త్‌’లో బాబు మోహన్ కామెంట్స్!

దందాతోనే ఎందుకు డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు?

పూరీ జగన్నాథ్, రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర లాంటి డైరెక్టర్ల మేకింగ్, వారి ఆటిట్యూడ్ చాలా ఇష్టం. షార్ట్స్ లో ఉన్నప్పుడు ఎన్నో స్క్రిప్స్ విన్నాను. కానీ దందా కథ చదువుతుంటే నన్ను నేనే చూసుకున్నట్లు అనిపించింది. అచ్చం నా రా స్టైల్ ఉన్న కథలా అనిపించింది. విజయ్ అద్భుతంగా రాశాడు. గ్రేట్.. ఈ విషయంలో నాకు కానీ, విజయ్ కి కానీ ఎలాంటి ఇగోలు లేవు. నేను కథను రీ షేప్ చేసేటప్పుడు విజయ్ కూడా హ్యాపీగానే ఉన్నాడు. పొలిటికల్ స్టోరీ టెల్లింగ్ లో నా మార్క్ డైరెక్షన్ ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలనుకున్నాను.చాయ్ షాట్స్ ఆఫీస్ లో నేను ఇచ్చిన డెమోకి అందరూ ఫిదా అయ్యారు. వర్టికల్ లో సరైన స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడంతో దందాతో ఒక ప్రాపర్ సినిమాటిక్ ట్రెండ్ తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను.

కాస్టింగ్ సెలక్షన్ ఎలా జరిగింది?

అరవింద్ పాత్ర కోసం ఎంతోమందిని అనుకున్నాం.. ఫైనల్ గా సాయి తేజను ఓకే చేసాం.. ఆరంభంలో అతని చుట్టూ ఉన్న కాంట్రవర్సీలు చూసి కొన్ని అనుమానాలు ఉండేవి. కానీ కలిసిన తర్వాత తేజ ఎంత గొప్ప వ్యక్తో అర్థమైంది. కథ వినగానే ఆశ్చర్యపోయి వెంటనే మార్కెటింగ్, నంబర్స్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంత క్లియర్ విజన్, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉన్న వ్యక్తి తేజ. చాలామంది లీడ్ యాక్టర్లు ఇవ్వని బ్లైండ్ ట్రస్ట్ నా మీద, దందా మీద ఉంచాడు. అలాగే నితిన్ ప్రసన్న కూడా కథ చెప్పగానే ఆయన వెంటనే ఓకే చెప్పారు.

రాజమౌళి గారు కేమియో చేశారా?

రాజమౌళి సార్ ఒక లెజెండ్.. హి ఈజ్ ది గోట్.. నా డైరెక్షన్లో వచ్చే ప్రాజెక్టులో ఆయన భాగం కావాలనేది నా చిన్న కోరిక. కానీ ఆయనను నేరుగా అప్లోడ్ చేసే స్థాయి నాకు లేదు. అందుకే సైబర్ క్రైమ్ పై ఆయన చేసిన ఒక అవేర్నెస్ వీడియోని ఆయనకిచ్చే ట్రిబ్యూట్ గా ఈ సీరీస్ లో వాడుకున్నాము .

దందా సక్సెస్ పై మీ తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి?

నాలో ఉన్న ఈ ఫైర్ మా అమ్మ నుంచి వచ్చింది. ఆమె తరచూ చెప్పే రాజు కంటే మొండోడే బలవంతుడు అనే డైలాగ్ ని సిరీస్ లో వాడాను. మా నాన్నకి హీస్ట్ సినిమాలు అంటే పిచ్చి. మనీ హీస్ట్ సీరిస్ ను ఎన్నోసార్లు చూశారు. నేను ఈ కథ చెప్పగానే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు.

చివరిగా దందా గురించి ఏం చెప్తారు?

అసలైన జెన్ జీ మాస్ అంటే ఏంటో తెలియాలి అంటే దందా చూడాల్సిందే. ఒక సెకండ్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఫ్రేమ్ పరిగెడుతుంది. సిరీస్ చూశాక మేమందరం మీ మైండ్ లో ఉండిపోతాం.. మైక్రో డ్రామానే కదా అని తక్కువ అంచనా తో చూడడం స్టార్ట్ చేయండి. మా సీరిస్ మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది అంటూ తెలిపారు. మొత్తానికైతే మైక్రో డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు జెన్జీ యువతను ఆకట్టుకుంటూ ఊచకోత కోస్తోంది.

Related News

ఇండస్ట్రీలో నటుడిగా 41 ఏళ్లు.. ఇంత చెండాలం చూడలేదు.. ‘జబర్దస్త్‌’లో బాబు మోహన్ కామెంట్స్!

ఒక్క సీరియల్‌తోనే స్టార్‌లైపోయిన నటులు వీళ్లే!

మెడలో తాళిబొట్టుతో కనిపించిన జబర్దస్త్ ప్రియాంక.. వీడియో వైరల్ !

Gundeninda GudiGantalu Today episode: బాలు పై మీనాకు అనుమానం.. మనోజ్ కు మైండ్ బ్లాక్… దొంగలను పట్టుకున్న బాలు…

Karthika Deepam 2 Serial Today Episode August 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యో పెళ్లి చేయాలన్న సుమిత్ర 

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×