E-Paper
Advertisement

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!
Advertisement

UdayaBhanu:ప్రముఖ యాంకర్ ఉదయభాను(Udayabhanu )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్నపిల్లలను మొదలుకొని.. పెద్దల వరకు ఎంతోమందికి ఫేవరెట్ యాంకర్ ఈమె. అలా స్టార్ యాంకర్ గా ఒకప్పుడు తెలుగు టెలివిజన్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. ఎన్నో షోలలో తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, తన ప్రతిభతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అంతేకాదు అదే టాలెంట్ తో సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే.. అలాంటి ఈమె ఇన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నిర్మాతగా తన తొలి నిర్మాణంలో ‘పంచనామా’ అనే చిత్రాన్ని నిర్మించింది.

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న పంచనామా మంచి విజయం అందుకోవడంతో.. ఈ సక్సెస్ చూసిన ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా ఒక వీడియో విడుదల చేస్తూ స్పందించిన తీరు ఆడియన్స్ ను సైతం ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన వీడియోలో “కష్టపడ్డ వారికి ఎప్పటికైనా కచ్చితంగా ఫలితం లభిస్తుంది” అంటూ తన మనసులో మాటలను బయటపెట్టింది. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. “ఈరోజు పంచనామా సినిమాకు మీరు ఇస్తున్న అప్రిసియేషన్ చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. అందరికీ కృతజ్ఞతలు. మీరే నా బలం.. మీరే నా సపోర్ట్.. ఉదయభాను ప్రొడక్షన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్లు చేస్తోంది. ముఖ్యంగా కొత్త టాలెంట్ ను మీ ముందుకు తీసుకొచ్చి వారందరినీ ఉదయభాను ప్రొడక్షన్స్ ఎంకరేజ్ చేస్తుంది.

Advertisement

also read:ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

ఆరంభం మాత్రమే..

ఇది కేవలం ప్రారంభం మాత్రమే ముందు ముందు మీకు మంచి మంచి ప్రాజెక్ట్లను అందిస్తాం. పంచనామా మంచి క్వాలిటీ ఉన్న కథ.. ప్రతి ఒక్కరికి చేరువ అవ్వాలి అంటూ.. అభిమానులు తన సినిమా పట్ల, తన పట్ల చూపించిన ఆదరణకు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి అయితే ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో ఈ పంచనామా సినిమా మరింత చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ఏర్పడడం వల్లే అవకాశాలు కోల్పోయాను -ఉదయభాను

Advertisement

ఇకపోతే ఈ పంచనామా ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాకు పరిశ్రమలో ఆఫర్లు తగ్గిపోయాయి. అవకాశాలు లేకుండా పోయాయి..ప్రస్తుతం టాలీవుడ్లో తెలంగాణ నేపథ్యం ఉన్న కథలు, సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కేవలం ప్రాంతీయ నేపథ్యం ఉన్నంత మాత్రాన అవకాశాలు వచ్చేయవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు.. నేను ఎన్నో షోలు, ఎన్నో ఈవెంట్లు చేశాను.. అయితే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్థానిక నటిగా నాకు ఎలాంటి అడ్వాంటేజ్ లభించలేదు. చివరికి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకి కూడా నన్ను హోస్ట్గా పిలవలేదు. తెలంగాణ బిడ్డగా పుట్టడం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు” అంటూ ఆమె తెలిపారు. మొత్తానికి అయితే ఉదయభాను ఇప్పుడు నిర్మాతగా యూటర్న్ తీసుకుంది మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈమె తదుపరి ప్రాజెక్టులతో ఎలాంటి కెరియర్ ను బిల్డ్ చేసుకుంటారో చూడాలి.

Related News

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Big Stories

Advertisement
×