Anchor Suma: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు తో పాటే క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు అదే క్రేజ్ తో ఇండస్ట్రీని ఏలేస్తుంది.. తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం భయపడకుండా తన మాటలతో ఆడియన్స్ఆ ను కట్టుకుంటారు.. స్వతహాగా ఆమె మలయాళీ అయినా కూడా తెలుగింటి కోడలు అవ్వడంతో తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడుతుంది. సినిమాల్లో చిరంజీవి తన డాన్సులతో, నటనతో, తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాదో, టీవీల్లో కూడా సుమ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. సుమ యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదించింది. పెద్ద బంగ్లాలను కొనేసింది. అయితే ఆమె తన ఇంటిని షూటింగ్ లకు అద్దెకు ఇచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి సుమ తన ఇంటిని ఏ సినిమాలకు అద్దెకు ఇచ్చిందో ఒకసారి తెలుసుకుందాం..
యాంకర్ సుమ బాగానే ఆస్తులను బాగానే సంపాదించింది. భారీగా ఆస్తులను కూడబెట్టడతో పాటుగా సినిమాల్లో చూపించే విధంగా పెద్ద ఇంటిని నిర్మించుకుంది. ఆ ఇంటిని సినిమాలకు అరువు ఇస్తుందట. అంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. టాప్ మోస్ట్ తెలుగు సినిమాలు అన్ని ఆ ఇంట్లోనే షూటింగ్ జరుపుకున్నాయని అతి కొద్ది మందికి తెలుసు.. శ్రీను వైట్ల దర్శకత్వం లో ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు ఎవరిదనుకుంటున్నారు? మన సుమక్కదే. అలాగే మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో ఇల్లు కూడా ఆమెదే.. సునీల్ హీరోగా నటించిన పూల రంగడు సినిమాలో కూడా ఆ ఇంటిని వాడారు. అదే విధంగా నాగ చైతన్య, తమన్నా జంటగా నటించిన 100 % లవ్ మూవీలో చైతూ ఇల్లు కూడా సుమదే… ఇలా చాలా సినిమాల్లో ఈమె ఇంటిని అద్దెకు ఇచ్చారని తెలుస్తుంది.
ఇక సుమ క్రేజ్ గురించి అందరికి తెలుసు.. సుమ ఏ షో చేసిన ఆ షో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు అయితే సుమ యాంకరింగ్ కావాలని పట్టుబట్టి మరి ఎంత డబ్బులు అయినా ఇచ్చి ఆమెనే యాంకర్ గా తీసుకొస్తున్నారు.. ఇటీవల సుమ చేసిన ప్రతి ఒక్క షో భారి క్రేజ్ ని సంపాదించుకున్నాయి… సుమ యాంకరింగ్ ఎంత బాగుంటుందో అంతకు మించి పారితోషికాన్ని కూడా అందుకుంటుంది. వరుస షోలతో కోట్లు సంపాదిస్తుంది సుమ.. ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. కానీ సుమ నటనతో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక ప్రస్తుతం బుల్లి తెర పై పలు షోలతో ఆకట్టుకుంటుంది. అటు మూవీ ఈవెంట్స్ లను చేస్తూ బిజీ యాంకర్ అయ్యింది.