Hero Srikanth:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా పేరు సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ (Srikanth) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా శ్రీకాంత్ డైలీ ఇంట్లో ఇలాగే ఉంటారా? ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ అనుమానాలు రేకెత్తించేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్.. తాజాగా డ్రామా జూనియర్స్ సీజన్ 9కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈయనతో పాటు ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా (Roja) , ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే తాజా లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన స్కిట్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో శ్రీకాంత్ రియల్ లైఫ్ పై చేసిన స్కిట్ బాగా పేలింది. పైగా హీరో శ్రీకాంత్ రియాక్షన్ కూడా అదుర్స్ అనే చెప్పాలి.
also read:కోతి తెచ్చిన తంటా.. చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్?
అసలు విషయంలోకి వెళ్తే.. డ్రామా జూనియర్స్ సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ స్కిట్ ప్రోమో విడుదల చేయగా అందులో.. ఒక చిన్నారి ఊహ (శ్రీకాంత్ భార్య) అంటూ చేతిలో కత్తి పట్టుకొని చాలా సీరియస్ గా స్టేజ్ పైకి వచ్చింది. ఇక ఆమెను చూసిన సుధీర్ ఊహ గారు అంటూ సంబోధిస్తుండగానే.. ఆ చిన్నారి నరికేస్తా అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. ఏమైంది ఊహా గారూ ఎందుకంత కోపంగా ఉన్నారు అంటూ సుధీర్ అడగగా.. నా ఈ కోపానికి కారణం డ్రామా జూనియర్స్ అంటూ అరిచేసింది. అసలేమైందో ముందు అది చెప్పండి అని సుధీర్ అడగగా.. “ఎట్లా ఉండే మా ఆయన ఎట్టా అయిపోయాడయ్యా” అంటూ ఆ చిన్నారి చూపించిన ఎక్స్ప్రెషన్ ఎపిసోడ్ కే హైలెట్గా నిలిచింది. ఇక ఊహ అలా చెబుతుంటే శ్రీకాంత్ తలదించుకొని ఉండిపోయారు. మొన్న మా ఆయన ఇంటి గేటు బయటే నిలబడ్డారు తెలుసా? ఎంట్రీ సాంగ్ వేస్తే కానీ ఇంట్లోకి రానంటూ మారం చేస్తున్నాడయ్యా.. ఆయన ఆస్తులు దాచుకోలేదు.. మాటలు దాచుకున్నాడు.. అలా దాచుకున్న వాటిని దోచుకున్నారు కదరా.. అంటూ ఫైర్ అయిపోయింది చిన్నారి.
అనిల్ గారు.. మా ఆయన మిమ్మల్ని మించిన డాన్సర్ అవ్వాలని, ప్రతి రోజు డాన్స్ క్లాస్ కి వెళ్తున్నాడయ్యా అంటూ అందరినీ నవ్వించేసింది. ఇక శ్రీకాంత్ గెటప్ లో మరో చిన్నారి స్టేజ్ పైకి వస్తూ.. హీరో శ్రీకాంత్ ఇంట్లో ఎలా ఉంటారు అనే విషయాలను కల్పిత రూపంలో స్టేజ్ పై చూపించారు. ఈ లడ్డు తినండి అని ఊహ అడగగా..శ్రీకాంత్ గట్టిగా నవ్వుతూ ఈ లడ్డును చూస్తుంటే డ్రామా జూనియర్స్ లో శ్రీవీయ అనే ఒక పాప రోజా గారిని లడ్డు ఆంటీ అంటూ పిలుస్తుంది అంటూ కౌంటర్ వేశారు. శ్రీకాంత్.. నేను షూటింగ్ కి వెళ్తున్నాను అని ఊహాతో చెబితే.. డ్రామా జూనియర్స్ షూటింగ్ రేపు కదండి అని ఆమె ప్రశ్నిస్తుంది. శ్రీకాంత్ నాకు ఐదు స్కిట్లు ఇచ్చారు ఊహ.. నేను వెళ్లి ప్రాక్టీస్ చేసి వస్తాను అంటూ కామెంట్ చేస్తారు. అలా మొత్తానికైతే స్కిట్ ఎండ్ అవుతుంది. ఇది చూసిన సుధీర్ శ్రీకాంత్ తో మాట్లాడుతూ..” మీ ఇంట్లో ఇలాగే జరుగుతుందా?”అంటూ ప్రశ్నించగా..” అలా జరగదు. దీనిని ప్రూవ్ చేయడానికి నేను తనను ఇక్కడికి పిలుస్తాను గ్యారంటీగా” అంటూ శ్రీకాంత్ చెప్పారు. మొత్తానికి అయితే ఈ చిన్నారులు చేసిన ఈ స్కిట్ ను ఏకంగా ఊహనే ఈ షోకి పిలిపించేంతలా భారీగా పేలిందనే చెప్పాలి.