Hero Vikram:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ (Vikram Chiyan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో, విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న హీరో విక్రమ్ తాజాగా ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక కోతి తెచ్చిన తంటా.. ఇప్పుడేకంగా విక్రమ్ ను చిక్కుల్లో పడేసినట్లు సమాచారం. మరి అసలు కోతి ఏంటి? కోతి వల్ల విక్రమ్ చిక్కుల్లో పడడం ఏంటి ? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విక్రమ్ తాజాగా ఇంస్టాగ్రామ్ లో చేసిన సరదా పోస్టు ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. హీరో విక్రమ్ చియాన్ తాజాగా చెన్నైలోని తన బంధువు ఇంట్లో సరదాగా తీసుకున్న వీడియోను ఆయన తన ఇంస్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ వేదికగా పంచుకున్నారు. అయితే క్షణాల్లో వైరల్ అయిన ఆ వీడియో అటవీశాఖ అధికారుల వరకు చేరడంతో వెంటనే వారు స్పందించారు. అసలే అంతరించిపోతున్న ఈ అరుదైన ‘లార్ గిబ్బన్’ (Lar gibbon) వన్యప్రాణిని చెన్నైకి ఎలా తీసుకొచ్చారు? దానికి సంబంధించిన తగిన అనుమతులు ఉన్నాయా? లేదా? అనే కోణంలో తమిళనాడు అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇకపోతే ఈ వీడియోపై తమిళనాడు అటవీశాఖ విచారణ చేపట్టడంతో విక్రమ్ ఆ వీడియోని డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇకపోతే ఈ కోతి విక్రమ్ వియ్యంకుడు ప్రముఖ వ్యాపారవేత్త సీ.కే. రంగనాథన్ ది చెందినదిగా అధికారులు గుర్తించి విచారణ జరుపుతున్నారు. వీడియోలో ఉన్న లార్ గిబ్బన్ అనే అరుదైన కోతి అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉంది.వన్యప్రాణి సంరక్షణ చట్టం సీఐటీఈఎస్ నిబంధనల ప్రకారం రక్షిత జాతికి చెందింది. అలాంటి ఈ కోతి ఇప్పుడు సడన్గా విక్రమ్ చేతుల్లో కనిపించేసరికి అధికారులు అలర్ట్ అయ్యారు.
ALSO READ: వారణాసిలో రామ్ చరణ్.. ఏ పాత్రలో అంటే?
ఇకపోతే ఈ అరుదైన జంతువును ఇంట్లో పెంచుకోవడానికి లేదా ఉంచుకోవడానికి ఎటువంటి సరైన క్లియరెన్స్ పత్రాలు లేవని చెన్నై వైల్డ్ లైఫ్ వార్డెన్ గుర్తించారు . అనుమతులు లేకుండానే అడవి జంతువులను కలిగి ఉండడం, అక్రమ రవాణా కేసులో కేసు దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం ఏదిఏమైనా విక్రమ్ తీసుకున్న ఈ సరదా వీడియో ఆయనతో పాటు ఆయన వియ్యంకుడిని కూడా ఇబ్బందుల్లో పడేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.