E-Paper
Advertisement

రాత్రిపూట అలాంటి శబ్దాలు… అదేంటని అడిగితే డిన్నర్ కి పిలిచి బంపర్ ఆఫర్

రాత్రిపూట అలాంటి శబ్దాలు… అదేంటని అడిగితే డిన్నర్ కి పిలిచి బంపర్ ఆఫర్
Advertisement

Romantic Comedy Drama: పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు రావడం సహజమే. కానీ పక్కింట్లో ఉండే ఓ జంట వల్ల మరో జంట వైవాహిక జీవితమే ఊహించని మలుపు తిరిగితే ఎలా ఉంటుంది ? పైగా ఆ పొరుగింటి వాళ్లు దిమ్మతిరిగే ఆఫర్ ఇస్తే పరిస్థితి ఏంటి ? ఇలాంటి క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘ది ఇన్వైట్’ (The Invite 2026) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జో, ఏంజెలా భార్యాభర్తలు. ఇద్దరి వైవాహిక జీవితంలో అప్పటికే కొన్ని సమస్యలు ఉంటాయి. తమ అపార్ట్‌మెంట్‌లో ఆల్మోస్ట్ విడిపోయే స్టేజ్ లో ఉన్న ఈ జంటకు పైఅంతస్తులో ఉండే పినా, హాక్ అనే మరో జంట వల్ల కొత్త సమస్య మొదలవుతుంది. ప్రతి రాత్రి పై అంతస్తు నుంచి వినిపించే విపరీతమైన శబ్దాలతో జో, ఏంజెలాకు నిద్ర కరువవుతుంది. మొదట్లో దాన్ని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారడంతో చివరకు ఆ పొరుగింటి జంటతో మాట్లాడాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

అలా సమస్యను పరిష్కరించడానికి పినా, హాక్‌లను డిన్నర్‌కు ఆహ్వానిస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. జో, ఏంజెలా తమకు ఎదురవుతున్న సమస్య గురించి మాట్లాడతారని అనుకుంటారు. కానీ పినా, హాక్ మాత్రం ఊహించని విషయాన్ని బయటపెడతారు. తాము సాధారణ దంపతుల్లా ఉండమని, ఓపెన్ రిలేషన్‌షిప్‌ను ఫాలో అవుతామని చెబుతారు. అంతేకాదు, జో, ఏంజెలాలకు కూడా ఒక షాకింగ్ ప్రపోజల్ చేస్తారు. తమ పార్ట్‌నర్స్‌ను మార్చుకునే విధంగా ఒక సంబంధాన్ని ప్రయత్నించమని సూచిస్తారు.

అప్పటివరకు తమ వైవాహిక జీవితంలో ఇలాంటి ఆలోచన గురించి ఊహించని జో, ఏంజెలాకు ఈ సలహా షాక్ ఇస్తుంది. ఆ ఆఫర్‌ను అంగీకరించాలా, తిరస్కరించాలా అనే విషయంలో ఇద్దరి మధ్య గందరగోళం మొదలవుతుంది. ఒకవైపు ఆసక్తి, మరోవైపు తమ సంబంధం గురించి ఉన్న భయం.. ఈ రెండింటి మధ్య వారి నిర్ణయాలు మారుతూ ఉంటాయి.

Advertisement

ఇక ఆ ఒక్క రాత్రి డిన్నర్‌ తర్వాత నాలుగు పాత్రల మధ్య జరిగే సంభాషణలు, అపార్థాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఊహించని పరిణామాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మొదట కేవలం పొరుగింటి శబ్దాల సమస్యగా మొదలైన విషయం… చివరకు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వివాహ బంధం, నమ్మకం వంటి అంశాలను కూడా టచ్ చేస్తూ సాగుతుంది కథ. మరి ఈ జంట పైఅంతస్థులో ఉండే జంట చెప్పినట్టుగా పార్ట్నర్స్ ను మార్చుకుంటారా ? చివరికి జో, ఏంజెలా ఆ విచిత్రమైన ఆఫర్‌ను స్వీకరించారా? ఆ రాత్రి తర్వాత వారి దాంపత్య జీవితం ఏ విధంగా మారింది? పక్కింటి జంటతో ఏర్పడిన ఈ పరిచయం వారి బంధాన్ని బలపరిచిందా.. లేక పూర్తిగా దెబ్బతీసిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎక్కడ చూడాలి ?

ఈ సినిమా 2020లో వచ్చిన ‘ది పీపుల్ అప్‌స్టేర్స్’ అనే స్పానిష్ చిత్రానికి అధికారిక రీమేక్. అయితే కొత్త నటీనటులు, హాలీవుడ్ నేపథ్యంతో కథను మరో విధంగా తెరకెక్కించారు. ‘ది ఇన్వైట్’ ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలో డిజిటల్ రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ భాషలో ఉన్న ఈ అడల్ట్ కామెడీని పెద్దలు మాత్రమే చూడటం మంచిది. రిలేషన్‌షిప్ కామెడీలు, అడల్ట్ హ్యూమర్, విచిత్రమైన కాన్సెప్ట్స్ ఉన్న సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక డిఫరెంట్ ఓటీటీ వాచ్ అవుతుంది. ఒలివియా వైల్డ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సేథ్ రోగన్, ఒలివియా వైల్డ్, పెనెలోప్ క్రజ్, ఎడ్వర్డ్ నార్టన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2026లో విడుదలైన ఈ చిత్రం ఆగస్టు 11 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read Also: చిన్న పిల్లలు చూడకూడని యానిమే సిరీస్… ఈ పిల్లులు చేసే పనులు చూస్తే నవ్వి నవ్వి పోతారు

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×