E-Paper
Advertisement

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!
Advertisement

ETV Prabhakar: అప్పట్లో వరుస సీరియల్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా బుల్లితెర మెగాస్టార్ గా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న ఈటీవీ ప్రభాకర్ (ETV Prabhakar) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన. ఈ మధ్య బిగ్ బాస్ రివ్యూయర్ గా కూడా మారారేమో అనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైన తర్వాత.. కొన్ని రోజులుగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా సందడి చేస్తున్న ఒక్కొక్క సెలబ్రిటీ గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న షాలిని పై, ఆమె పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించిన ప్రభాకర్.. ఇప్పుడు ఝాన్సీకి పండగ నిలవడమే కాకుండా.. రైతుబిడ్డ అనే ట్యాగ్ వాడుతోందంటూ ఆమెపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్..

గతంలో కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఎలా అయితే రైతుబిడ్డ అనే ట్యాగ్ ఉపయోగించి, ఆఖరికి టైటిల్ విజేతగా నిలిచారో.. ఇప్పుడు ఝాన్సీ కూడా అదే రైతుబిడ్డ అనే ట్యాగ్ ను ఉపయోగిస్తూ టైటిల్ కొట్టే దిశగా అడుగులు వేస్తోందని, కొంతమంది ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. అంతేకాదు తోటి కంటెస్టెంట్ ఆర్జే చరణ్ (RJ Charan) కూడా ఈమెను ఇదే పాయింట్ చెప్పి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఝాన్సీ పై రోజు రోజుకూ నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ప్రభాకర్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

రైతుబిడ్డ.. రైతు బిడ్డ ట్యాగ్ వాడితే తప్పేంటి?

Advertisement

“ఝాన్సీ రైతుబిడ్డ ట్యాగ్ వాడుతోందని చెబుతున్నారు. అందులో తప్పేంటి? ఆమె నిజంగానే రైతు పని చేయకుండా హౌస్ లోకి వచ్చి ఆ ట్యాగ్ ఉపయోగిస్తోందా? బయట ఉన్న ప్రతిరోజు తాను అదే పనే చేసింది. ఆమె రైతు బిడ్డ కాబట్టి రైతుబిడ్డ అనే ట్యాగ్ వాడితే తప్పేంటి?. యాక్టర్ అనే వాడు యాక్టర్ అనే చెప్పుకుంటాడు.. డాక్టర్ అనేవాడు డాక్టర్ అనే ట్యాగ్ వాడుకుంటాడు.. తప్పేంటి.. ? అసలు ఎందుకు అంతలా ద్వేషిస్తున్నారు..? ముఖ్యంగా షోలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది కూడా ఇదే విషయంపై టార్గెట్ చేయడం నాకు నచ్చడం లేదు. ఆమె రైతు డ్రెస్ వేసుకుందా? కండువా వేసుకుందా? అని చెప్పడానికి మీరెవరు.. తనకు ఇష్టం వచ్చింది వేసుకుంటుంది..

also read:మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది..

Advertisement

నువ్వు చెప్పాల్సిందేంటి.. తనలో ఏ సమస్య ఉంది? ఆమె మాటల్లో ఏ తప్పు ఉంది? ఏది కరెక్ట్ గా ఆడావు? ఏది కరెక్ట్ గా ఆడలేదు ? ఇది కదా మాట్లాడాలి.. ఊరికే అరిచేయడం.. ఏదో పనికిరాని టాపిక్ పెట్టుకోవడంలా నాకు అనిపించింది.. ఎవరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది”. అంటూ ఝాన్సీ రైతుబిడ్డ అనే ట్యాగ్ వాడడం పై హేటర్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ప్రభాకర్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

 

Related News

బిగ్ బాస్ 10 కొత్త కెప్టెన్ గా ముఖేష్.. ఆమెకు స్పెషల్ బెనిఫిట్స్?

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

సీరియల్ నటి ఐశ్వర్య  ప్రేమలో పడిందా..? ఇదేం ట్విస్ట్ మావా..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సపోర్ట్ గా కామాక్షి.. మీనాకు నిజం చెప్పిన సుమతి.. అరుణ్ మాటతో ఫుల్ హ్యాపీ..

Podarillu Today Episode : గోపిక మాటతో చక్రీ షాక్.. మహా మాటతో షాక్.. గోపికను అవైడ్ చేసిన చక్రీ..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×