E-Paper
Advertisement

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?
Advertisement

The Paradise:నాని (Nani )హీరోగా, శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్ (The Paradise). ఎన్నో అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. పైగా పలు పాత్రలను వక్రీకరించారు అనే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ చిత్రం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు కేసీఆర్ పాత్రను పోలి ఉన్న ప్రియదర్శి పాత్ర పై విమర్శలు రాగా, ఇప్పుడు సమ్మక్క పాత్ర పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మక్క పాత్రను తప్పుగా చిత్రీకరించారు అంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు ఒక సోషల్ మీడియా నోట్ వైరల్ గా మారింది. మరి అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

సమ్మక్క వారసత్వాన్ని అవహేళన చేశారు..

తాజాగా వైరల్ అవుతున్న ఒక స్టోరీలో సమ్మక్క వారసత్వాన్ని కాసర్ల శ్యామ్ , శ్రీకాంత్ ఓదెల అవహేళన చేశారు అంటూ ఒక సుదీర్ఘ నోట్ వైరల్ గా మారుతోంది ..చరిత్రలో నమోదైన పేర్ల వెనుక ఎన్నో కనిపించని త్యాగాలు ఉంటాయి. ముఖ్యంగా ఆదివాసీ సమూహాల పోరాటాలు, వారి రక్తంతో నిర్మితమైన చరిత్ర తరతరాలుగా మన ముందు నిలిచింది. బిర్సా ముండా , కొమరం భీమ్, పాపన్న , రాంజీ గోండ్ వంటి ఎంతోమంది పోరాట యోధుల వారసత్వమే అందుకు నిదర్శనం. అలాంటి చరిత్రను వెండితెరపై చూపించే ప్రయత్నం చాలా సంతోషకరమే. కానీ ది ప్యారడైజ్ చిత్రంలో ఆదివాసీ జీవితాన్ని , ముఖ్యంగా సవారీ తెగ పోరాట చరిత్రను చూపించిన తీరు తీవ్ర అభ్యంతరాలకు దారితీస్తోంది.

ప్రాణాలు అర్పించిన సవారీలను హంతకులుగా మార్చారు..

Advertisement

సమ్మక్క- సారలమ్మ వారసత్వం కేవలం ఒక కథ మాత్రమే కాదు. అది అణిచివేతకు వ్యతిరేకంగా నిలిచిన పౌరుషానికి, స్వాభిమానానికి ప్రతీక. అలాంటి వారసత్వాన్ని ప్రతిబింబించాల్సిన చోట.. ఆదివాసి సమాజాన్ని హింస , నేరం, మద్యం, వ్యభిచారం వంటి ప్రతికూల కోణాల్లో చూపించడమే కాకుండా చరిత్రకు అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. చరిత్రలో తమ ఉనికి కోసం, హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన సవారీలను ఇక్కడ కేవలం హంతకులుగా చిత్రీకరించడం, వారి త్యాగాల అసలు నేపథ్యాన్ని మరుగున పడేసే ప్రమాదం కూడా ఉంది.

also read:బిగ్ బాస్ 10 కొత్త కెప్టెన్ గా ముఖేష్.. ఆమెకు స్పెషల్ బెనిఫిట్స్?

సమ్మక్క చరిత్రను వక్రీకరించారు..

Advertisement

ప్రేక్షకులను కదిలించే డైలాగులు రాయడం ఒక ఎత్తు అయితే ఆ డైలాగుల వెనుక ఉన్న చరిత్రను అర్థం చేసుకొని తెరపై చూపించడం మరో ఎత్తు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసి జీవితాలు, వారి పోరాటాలు, వారి అస్తిత్వాన్ని కూడా గౌరవంగా తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ చరిత్రను అర్థం చేసుకోకుండా కాసర్ల శ్యామ్, శ్రీకాంత్ ఓదెల మాత్రం సమ్మక్క వారసత్వం మీద నిలిచిన పోరాట చరిత్రను వక్రీకరించారు.

కాసర్ల శ్యామ్ , శ్రీకాంత్ ఓదెల బహిరంగ క్షమాపణలు చెప్పాలి..

ఇలాంటి వాళ్లకు కల్పిత కథలు, హీరోలను సృష్టించడం కాకుండా చరిత్ర చదవడం నేర్చుకోమని చెప్పాలి అనిపిస్తుంది. నిజానికి సమ్మక్క వారసత్వాన్ని అవహేళన చేసిన కాసర్ల శ్యామ్ , శ్రీకాంత్ ఓదెల పోరాట యోధులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి . మీరు రాసిన డైలాగులు థియేటర్లలో తాత్కాలికంగా పూనకాలు రప్పించవచ్చు.. పైగా ఇలాంటి డైలాగులకు నాలుగు కాసులు రాలవచ్చు.. కానీ చరిత్ర మిమ్మల్ని క్షమించదు” అంటూ తెలుగు పరిశోధకులు గుర్రం సీతారాములు పంచుకున్న పోస్ట్ అంటూ ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Related News

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?

ఈ సంక్రాంతి మనదే.. కాకా పై చిరు అప్డేట్!

నాని పై ఇండస్ట్రీలో కుట్ర జరుగుతుందా? సక్సెస్ ను జీర్ణించుకోలేకపోతున్నారా?

నన్ను తొక్కేయాలని చూస్తున్నావా? ఫరియా పై చిరు కామెంట్స్ వైరల్!

సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!

‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!

నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?

Big Stories

Advertisement
×