E-Paper
Advertisement

బహిరంగంగా తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి.!

బహిరంగంగా తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి.!
Advertisement

Eshwar Sai: ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) ఇటీవల వేములవాడలోని రెడ్డి భవన్లో తన తోటి డాన్సర్ మాధురి రాథోడ్ (Madhuri Rathod) తో గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య (Saranya ) రెడ్ హ్యాండెడ్గా కొంతమందితో కలిసి వీరిని పట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా , పెళ్లయి కొడుకు ఉన్న ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్ తన వైపు తిప్పుకుందని ఆరోపిస్తూ.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది శరణ్య. అక్కడితో ఆగకుండా తన భర్త మంచివాడని, మాధురి రాథోడ్ వల్లే తన భర్త అలా అయ్యారు అంటూ మీడియా ముందు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక దీంతో వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో మాధురి రాథోడ్ కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. తనపై తప్పుడు కథనాలు వల్లిస్తూ తనను దారుణంగా హింసించి కొట్టారు అంటూ మాధురి రాథోడ్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.

తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి..

ఇలా గత మూడు నాలుగు రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా.. తాజాగా ఈ విషయంపై ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి స్పందించారు. తప్పు నాదే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. “భార్య ఉండగా మరొక అమ్మాయితో ఉండడం నిజంగా నేను చేసిన తప్పే. కానీ ఒత్తిడి వల్లే ఇలా జరిగిపోయింది” అంటూ తన తప్పు ఒప్పుకున్నారు ఈశ్వర్ సాయి. ప్రస్తుతం ఈశ్వర్ సాయి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మీడియా ముందుకు వచ్చిన ఈశ్వర్ సాయి భార్య..

Advertisement

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మీ భర్త చేసిన పనికి విడాకులు ఇస్తున్నారా? అని అడగగా.. ఆమె మాట్లాడుతూ “నేను విడాకులు ఎందుకు ఇవ్వాలి? నా భర్తను నేను వదులుకోను.. ఇరువర్గాలు కూర్చొని.. అన్ని సెటిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవు. అనవసరంగా మా గురించి మాట్లాడడం ఆపేయండి. మా పెళ్లి జరిగి ఏడేళ్లు అవుతోంది. మా ఆయన చాలా మంచివారు. అసలు తప్పు ఆయన వైపు లేదు.. మా కాపురం గురించి ఎవరూ కూడా తప్పుడు వార్తలు సృష్టించవద్దు” అంటూ మీడియాని, సోషల్ మీడియా యూజర్లను ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ: భర్త చనిపోతే అన్నీ తీసేయాలా.. అనసూయ హాట్ కామెంట్స్ వైరల్!

పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మాధురి రాథోడ్..

Advertisement

ఇదిలా ఉండగా ప్రముఖ ఫోక్ డాన్సర్ ,బాధితురాలు మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు తనపై దాడి చేసిన కొంతమంది పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తనను దూషించడమే కాకుండా తనపై దాడి చేశారంటూ ఆరోపించింది.

Related News

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Big Stories

Advertisement
×