E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లోకి శర్వానంద్ హీరోయిన్ సీరత్ కపూర్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!

బిగ్ బాస్ 10లోకి శర్వానంద్ హీరోయిన్ సీరత్ కపూర్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!
Advertisement

Bigg Boss 10 Seerat Kapoor:గత తొమ్మిదేళ్లుగా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ప్రేక్షకులను టీవీ స్క్రీన్ లకు కట్టిపడేస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని.. కోట్లాదిమంది అభిమానుల మైండ్ బ్లాక్ చేసిన ఈ షో ఇప్పుడు చాలా గ్రాండ్ గా పదవ సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.. అందులో భాగంగానే ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2 టాస్క్ నడుస్తుండగా.. కొంతమంది కామనర్స్ ను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు జడ్జెస్ నవదీప్(Navdeep ), అభిజిత్ (Abhijeet), బిందు మాధవి(Bindhu madhavi)

బిగ్ బాస్ సీజన్ 10లోకి సీరత్ కపూర్..

మరోవైపు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు వీళ్లే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే నిన్నటికి నిన్న టెంపర్ వంశీ పేరు తెరపైకి రాగా.. ఇప్పుడు శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ‘రన్ రాజా రన్’ సినిమాతో హీరోయిన్గా తనను తాను ప్రూవ్ చేసుకున్న సీరత్ కపూర్ (seerat Kapoor) బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో సందడి చేయబోతోంది అంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. అయితే ఈ ప్రచారం కాస్త పీక్స్ కి చేరడంతో తాజాగా సీరత్ కపూర్ స్వయంగా రంగంలోకి దిగి తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.

పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్..

Advertisement

ఈ మేరకు ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకుంది సీరత్ కపూర్. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్లు ఫేక్ అంటూ ఒక ఫోటోతో పాటు పోస్ట్ పంచుకుంది.” నేను బిగ్ బాస్ తెలుగులో భాగస్వామ్యం కాబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇక దానిపై స్పష్టత కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను. ప్రస్తుతానికి నేను బిగ్ బాస్ తెలుగులో పాల్గొనడం లేదు. ఒకవేళ నేను ఏదైనా విషయాన్ని పంచుకోవాలన్నా లేదా ప్రకటించాలన్నా సరే నేరుగా నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే అందరికీ తెలియజేస్తాను . అప్పటివరకు దయచేసి ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మకండి . అభిమానులు నాపై చూపిస్తున్న అనంతమైన ప్రేమకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను” అంటూ ఒక్క పోస్టుతో బిగ్ బాస్ ఎంట్రీ వార్తలకు ఆమె ముగింపు పలికింది. అయితే అభిమానులు మాత్రం సీరత్ కపూర్ హౌస్ లో చూడలేకపోతున్నందుకు నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనా సీరత్ కపూర్ బిగ్ బాస్ లో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

also read: మళ్లీ మొదలైన స్పిరిట్ వివాదం.. లాభాల్లో వాటాపై దీపిక కౌంటర్!

సీరత్ కపూర్ కెరియర్..

Advertisement

మోడల్ గా, నటిగా , కొరియోగ్రాఫర్ గా , డాన్సర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఎక్కువగా తెలుగు చిత్రాలలో నటించింది. 2014లో వచ్చిన రన్ రాజా రన్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టచ్ చేసి చూడు, ఒక్కక్షణం, రాజు గారి గది 2, కొలంబస్, టైగర్, కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమ ఇలా ఎన్నో తెలుగు చిత్రాలలో నటించింది. ఇక చివరిగా ఉషా పరిణయం సినిమాతో కూడా ఆకట్టుకుంది.

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×