E-Paper
Advertisement

భర్త చనిపోతే అన్నీ తీసేయాలా.. అనసూయ హాట్ కామెంట్స్ వైరల్!

భర్త చనిపోతే అన్నీ తీసేయాలా.. అనసూయ హాట్ కామెంట్స్ వైరల్!
Advertisement

Anasuya:భారతదేశం హిందూ సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి సాంప్రదాయాలపై ప్రముఖ యాంకర్ అనసూయ (Anasuya) చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనసూయ.. అద్భుతమైన వాక్చాతుర్యంతో, అందంతో, గ్లామర్ తో అందరినీ కట్టిపడేస్తూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటోంది. ఒకవైపు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు సినిమాలలో సందడి చేస్తూ దూసుకుపోతోంది. అలాంటి ఈమె సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పలు కామెంట్లు చేసి అటు ప్రజల ఆగ్రహానికి గురైన అనసూయ .. మరొకసారి హిందూ సంప్రదాయాలపై చేసిన కామెంట్లు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి.

హిందూ సాంప్రదాయాలపై అనసూయ హాట్ కామెంట్స్..

ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ వీడియోలో అనసూయ..” మా నాన్నగారు చనిపోయి మూడు సంవత్సరాలవుతోంది. గతంలో మా అమ్మ చాలా అందంగా ఉండేది. నుదుట బొట్టు, కళ్ళకు కాటుక, తలలో పూలు పెట్టుకొని ఎంతో నిండుగా కనిపించేది. అయితే మా నాన్న మరణించిన తర్వాత మా అమ్మ ఆచారాలన్నింటికీ దూరం అవ్వడం నన్ను తీవ్రంగా కలిచివేసింది.

భర్త మరణిస్తే అవన్నీ తీసేయాల్సిందేనా?

Advertisement

ఆడపిల్ల పుట్టగానే అమ్మ, అమ్మమ్మలు గాజులు, గోరింటాకు, కాటుక వంటి అలంకారాలను అలవాటు చేస్తారు. అలాంటప్పుడు వీటిని పెళ్లితో ముడిపెట్టి భర్త చనిపోయాక ఎందుకు తీసివేయాలని చెబుతున్నారు? అంటూ అనసూయ ప్రశ్నించింది. ఒకవేళ తీసేయాల్సి వస్తే ఆ అలవాట్లను నేర్పించిన అమ్మా లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు తీసేయాలి కానీ మధ్యలో వచ్చే భర్త మరణంతో వీటికి సంబంధం ఏంటి ? అంటూ ఆమె నిలదీశారు. అలా హిందూ సాంప్రదాయాలపై, స్త్రీ అలంకరణలపై అనసూయ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి.

అనసూయపై భారీ ట్రోల్స్..

హిందువై ఉండి అందులోనూ బ్రాహ్మణురాలివైయుండి నువ్వేనా ఇలాంటి మాటలు మాట్లాడేది.. సాంప్రదాయాల గురించి మాట్లాడే హక్కు ఉందా ? ముఖ్యంగా అనసూయ.. నువ్వు భర్త బ్రతికుండగానే బొట్టు లేకుండా వీడియోలు చేస్తున్నావ్.. ఇతరులకు నీతులు చెప్పే ముందు నువ్వు పాటిస్తున్నావా? అయినా ఇంత చిన్న లాజిక్ నువ్వు ఎలా మిస్ అయ్యావు? అంటూ సోషల్ మీడియాలో ఎప్పటిలాగే ఈమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా హిందూ సాంప్రదాయాలు, కట్టుబాట్లపై అనసూయ లేవనెత్తిన ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Advertisement

also read: బిగ్ బాస్ 10లోకి శర్వానంద్ హీరోయిన్ సీరత్ కపూర్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!

అనసూయ స్పందిస్తుందా?

ఇకపోతే ఇదే సమయంలో కొంతమంది అనసూయకు మద్దతుగా కూడా పలుకుతున్నారు.. ముఖ్యంగా సాంప్రదాయం పేరిట మహిళల అలంకరణలను దూరం చేసే హక్కు ఎవరు ఇచ్చారు అంటూ ఈమెకు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా సాంప్రదాయాలపై అనసూయ చేసిన కామెంట్లు నెట్టింట పెద్ద చర్చకు దారితీసాయి ..మరి దీనిపై హిందూ సంఘాలు కూడా మండిపడే అవకాశం ఉందంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి తనపై వస్తున్న ట్రోల్స్ కి అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

?igsi=aXk5ZzgyNTVnaW90

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×