Friday OTT Releases : ప్రతి వారం కొత్త సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూసుకోవాలని అనుకుంటారు. . ఇటీవల కాలంలో జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు రావడంతో థియేటర్లు కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ వారం టాలీవుడ్ క్రేజీ హీరో నాని నటించిన పారడైజ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. నిన్న రిలీజైన సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటు మొదటి రోజు కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాతో పాటుగా ఇవాళ బోలెడు సినిమాలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ మూవీతో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి..
మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే బోలెడు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 14 సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఎపిక్, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, రిపోర్టింగ్ లైవ్ చిత్రాలు ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.. వీటితో పాటుగా హాలీవుడ్ నుంచి వెబ్ సిరీస్ లో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.. వీటితో పాటుగా బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 09
ఎపిక్ (తెలుగు చిత్రం) – అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 09
యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 09
హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 09
డాక్టర్ ఎక్స్(కొరియన్ సిరీస్)- అక్టోబర్ 09
100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 10
పారిస్ కేఫ్(తమిళ సినిమా)- అక్టోబర్ 09
ఖలీఫా(మలయాళ సినిమా)- అక్టోబర్ 09
అంగీకారం ( తమిళ మూవీ ) – సెప్టెంబర్ 25
షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 09
పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) – అక్టోబర్ 10
విజయనగర్ హిరే (బెంగాలీ మూవీ) – అక్టోబర్ 10
ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 11
ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 09
మ్యాచ్ బాక్స్ ద మూవీ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 09
ఆడమ్ అండ్ ఈవ్(హిందీ మూవీ)- అక్టోబర్ 09
ఎబోవ్ అండ్ బిలో(హాలీవుడ్)- అక్టోబర్ 09
గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి.. అటు ఓటిటిలోకి మాత్రమే కాదు థియేటర్లోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. శ్రీవిష్ణు నటించిన కామ్రేట్ కళ్యాణ్ మూవీతో పాటు బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి మీకు నచ్చిన సినిమానే మీరు మెచ్చిన ఓటిటిలో చూసి ఎంజాయ్ చేసేయండి.