E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 
Advertisement

Ninnu kori serial today Episode: విరాట్‌కు గతం గుర్తుకు వస్తుంది. అద్దంలో తనను తాను చూసుకుని నేనేంటి ఇలా అయిపోయాను అసలు మనం ఎక్కడున్నాం చంద్ర అంటూ అడిగితే చంద్ర జరిగింది మొత్తం చెప్తుంది. యాక్సిడెంట్‌ తర్వాత హాస్పిటల్‌లో జరిగిన ప్లాస్టిక్‌ సర్జరీ విరాట్‌ గతం మర్చిపోవడం. దాక్షాయణి కొడుకుగా వాళ్ల ఇంటికి రావడం దాక్షాయణి ఇంట్లో జరిగిన సంఘటనలు చెప్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని లేకపోతే విరాట్‌కు ప్రాణగండం ఉందని చెప్తుంది. ప్రాణగండం ఎవరి వల్ల మాయ వల్ల ఉందా అని విరాట్‌ అడిగితే.. కాదని దాక్షాయణి వాళ్ల ఇంట్లో తాను చూసిన పరిస్థితులు చూసింది మొత్తం చెప్తుంది.

ఆ దాక్షాయణి వల్లే మీకు ప్రాణహాని ఉందని చెప్పగానే.. విరాట్‌ కోపంగా అసలు అలాంటి తల్లి బతకడం కరెక్ట్‌ కాదు అంటూ కోపంగా బయటకు వెళ్లబోతుంటే.. వద్దని చంద్ర ఆపేస్తుంది. అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ చేయాలి. అంటే సామ్రాట్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా విరాట్‌ను బయట పడేద్దాం అంటాడు డాక్టర్‌. సరేనంటూ చంద్ర బయటకు వెళ్లి అదరినీ పిలుస్తుంది. దాక్షాయణి వచ్చి ఏమైంది అని అడిగితే.. డాక్టర్‌ సామ్రాట్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అని చెప్తాడు. దాక్షాయణి సరే అంటుంది.

Advertisement

తర్వాత విరాట్‌, చంద్ర హగ్‌ చేసుకుని మాట్లాడుకోవడం చాటు నుంచి గిరిజ వింటుంది. అంటే సామ్రాట్‌ చంద్రను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడన్న మాట. ప్లాన్‌ ప్రకారం చంద్ర పెళ్లి చేసుకుని వచ్చిందన్న మాట. అందరి ముందు నర్సులా నటిస్తూ.. చాటుగా భార్యాభర్తల్లా రొమాన్స్‌ చేస్తున్నారా..? చంద్ర చెప్తా నీ పని అనుకుంటూ వెళ్లిపోతుంది. విరాట్‌తో చంద్ర అంతా రెడీగా ఉంది బావ. మనం సైలెంట్‌గా ఇక్కడి నుంచి బయటపడదాం. అప్పటి వరకు నువ్వు ఏమీ అనొద్దు వెళ్దాం పద అంటూ లగేజీ తీసుకుని బయటకు వస్తుంటారు.

అప్పుడే గిరిజ పరుగెత్తుకుంటూ వెళ్లి నీలగిరికి చెప్తుంది. నీలగిరి కోపంగా హాల్లోకి వెళ్లి అందరినీ పిలుస్తాడు. అందరూ వస్తారు. అప్పుడే డాక్టర్‌ కూడా వచ్చి హాస్పిటల్‌లో అంతా రెడీగా ఉంది. మనం వెళ్దామా..? అనగానే.. నీలగిరి కోపంగా డాక్టర్‌ను కోపంగా తిడుతూ.. నువ్వు డాక్టర్‌ వా..? లేక మీడియేటర్‌వా..? అంటూ కోప్పడతాడు. సామ్రాట్‌, చంద్ర పెళ్లి చేసుకున్నారు. నీ కొడుకు ఇప్పుడు నా అల్లుడు కాదు ఆ చంద్రకు మొగుడు అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. శ్రీజ ఏడుస్తూ మొగుడేంటి అని అడిగితే.. మనం మోసపోయాం తల్లి మీ బావ ఈ చంద్ర మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పగానే.. శ్రీజ షాక్ అవుతుంది. నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంటూ నీలగిరిని నిలదీస్తాడు కేశవ. వాడు వాళ్ల అమ్మకు చెప్పకుండా ఏ చిన్న పని కూడా చేయడు అంటాడు. శ్రీజ బాధగా ఏడుస్తూ.. చంద్ర ఇది నిజమా..? అబద్దమని చెప్పు చంద్ర అంటూ అడగ్గానే.. గిరిజ, చంద్రను తిడుతుంది.

Advertisement

సామ్రాట్‌ ఏదో మాట్లాడబోతుంటే.. చంద్ర వద్దని సైగ చేస్తుంది. గిరిజ, నీలగిరి కోపంగా చంద్ర, డాక్టర్‌ను తిడుతుంటారు. విరాట్‌ అడ్డుపడి వీళ్లు నిజం తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు నువ్వేం ఫీలవకు.. అంటే వీళ్లు అంటున్నావు.. మేము వేరా బావ అని శ్రీజ అడిగితే అవునని చెప్తాడు విరాట్‌ అలియాస్‌ సామ్రాట్‌. వీళ్లకు నిజం తెలియాలి అంటూ నేను మీ సామ్రాట్‌ను కాదు చంద్ర భర్త విరాట్‌ను అని చెప్తాడు. ఇది ఇంకో నాటకమా..? విషయం బయటపడుతుందని కొత్త కథ అల్లుతున్నాడు అని నీలగిరి చెప్తే.. సామ్రాట్‌ చచ్చిపోయాడు అంటూ విరాట్‌ చెప్తాడు. ఈయన సామ్రాట్‌ కాదు నా భర్త విరాట్‌ మాది విడదీయలేని బంధం. విధి ఆడుకున్న బంధం. విరాట్‌ బావ నా మేనత్త కొడుకు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అంటూ చంద్ర మొత్తం చెప్తుంది.

డాక్టర్‌ కూడా వీళ్లు చెప్పింది నిజం. సామ్రాట్‌ గారిని కొన ఊపిరితో మా హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆయన మా హాస్పిటల్‌ లోనే చనిపోయారు. పది రోజులు ఆయన కోసం ఎవ్వరూ రాలేదు. పోలీసులు అనాథ శవం కింద మున్సిపాలిటీ వాళ్లకు ఇచ్చేసి కాల్చేయమన్నారు. అదే సమయంలో విరాట్‌ గారు యాక్సిడెంట్‌లో ముఖం మొత్తం పాడైపోయి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. అప్పుడే సామ్రాట్‌ గారి ముఖం విరాట్‌ గారికి ప్లాస్టిక్‌ సర్జరీ చేశాము అంటూ జరిగింది మొత్తం డాక్టర్‌ చెప్తాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Friday Tv Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Big Stories

Advertisement
×