Durga Devi Pandals In AP: దేవీ నవరాత్రుల సమీపిస్తున్న వేళ తీపి కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. దుర్గాదేవి ఉత్సవ కమిటీ నిర్వాహకులకు బిగ్ రిలీఫ్. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు పొందిన దుర్గాదేవి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనుంది. దీనిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.
దసరా పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దుర్గాదేవి నవరాత్రుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన, చేస్తున్న దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు కిలోవాట్లు, అదే పట్టణ ప్రాంతాల్లో ఐదు కిలోవాట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నారు. దసరా పండుగ సమీపిస్తున్న వేళ నవరాత్రుల ఉత్సవాలు అత్యంత ఆనందంగా సాగాలని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మంత్రి లోకేష్ ఎక్స్ లో ప్రస్తావించారు.
దసరా పండుగ వేళ దుర్గమ్మను స్మరించుకుంటూ అందరూ పండుగను జరుపుకుంటున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం అందించడం ఆనందంగా ఉందని మనసులోని మాట బయటపెట్టారు మంత్రి నారా లోకేష్. అలాగే దుర్గాపూజ నిర్వాహకులు, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగను ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల నిర్వాహకులపై వాటి భారం తగ్గుతుందని ఆలోచన. వినాయక మండపాలకు ఇదే విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
ALSO READ: ఆపరేషన్ ఫైర్‌వాల్.. విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!