Gundeninda GudiGantalu Today episode 6th: మీనా వంటగదిలో ఒక్కటే కూర్చుని ఆలోచిస్తూ వంట చేస్తూ ఉండగా శృతి వచ్చి నాకు టీ కావాలని ఎంతగా అడుగుతున్నా సరే మీనా మాత్రం పరధ్యానంగా ఉంటుంది. ఏంటి మీ నాన్న నేను అంత అడుగుతున్నా సరే నువ్వు మాత్రం అసలు ఏమి పట్టించుకున్నట్లే కనిపిస్తున్నావు అని శృతి అంటుంది. అత్తయ్య నామీద ఇలా కక్ష కడుతుందని నేను అస్సలు ఇంచలేదు శృతి అని చింతామణితో చేతులు కలిపిన విషయాన్ని శృతితో చెప్తుంది. మీనా నీ దెబ్బ కొట్టాలని చూసిన ఆంటీని నేను మాత్రం అస్సలు వదిలిపెట్టను అని శృతి అంటుంది. ఏది ఏమైనా కూడా మీనా ఎంత చెప్పినా సరే శృతి మాత్రం నేను అసలు వదిలిపెట్టను ఎలాగైనా సరే రివెంజ్ తీయించుకుంటాను అని అంటుంది.. మీ నాకు ఏమైనా జరిగితే నేను సహించలేను ఎలాగైనా సరే ఆంటీ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని శృతి అనుకుంటుంది..
రోహిణి ఎక్కడో నీళ్ల సౌండ్ వినిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది.. మనోజ్ ని నీ పొట్టలో నీళ్ళ సౌండ్ వినిపిస్తుంది ఏంటి అని అడుగుతుంది.. అవును నా పొట్టలో నేను నీళ్ల సౌండ్ వినిపిస్తుంది అని పరిగెత్తుకుంటూ బాత్రూంలో తిరుగుతూ ఉంటాడు.. ఇక మనోజు బాత్ రూమ్ కి తిరుగుతూనే ఉండగా రోహిణి ఏమైంది అని అడుగుతుంది.. ప్రభావతి కడుపులో కూడా నీళ్ల సౌండ్ వినిపిస్తుందని సత్యం నిద్రలేపుతాడు.. అంతే ప్రభావతి కూడా బాత్రూంకి పరుగులు పెడుతుంది.. ఏమైంది అసలు నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అని సత్యం అడుగుతుంటే ప్రభావతి మాత్రం డైట్ ఫుడ్ ఎఫెక్ట్అండి అంటూ మళ్ళీ పరుగులు పెడతారు.. మొత్తానికి శృతి ప్లాను మామూలుగా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రతి ఆముదం దెబ్బతో మనోజ్ ప్రభావతులకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ తగులుతుంది..
బాలు ప్రభావతి మనోజ్లను చూసి ఏంట్రా మీకు ఈ కష్టాలు ఈ వయసులో టైప్ చేసి మీరు ఇంతగా తగ్గిపోవాలా కొంచెం కూడా మీకు బుద్ధి లేదా అని ఒక ఆట ఆడుకుంటాడు. బాలు మీనాలు ఇద్దరు కలిసి వీళ్లిద్దరికీ డైట్ ఫుడ్ వల్లే ఇలా జరిగింది అని అనుకుంటారు.. రాత్రి ఇద్దరు కలిసి బాత్రూములకు తిరుగుతూ పెద్ద రచ్చే చేస్తారు. బాలు అడుగడికి వేసే సెటైర్లకి ప్రభావతి మనోజు మాకు అస్సలు ఓపిక లేదు నీ ఇష్టం వచ్చిన చేసుకోరని వదిలేస్తారు. ఇక నీళ్లు అయిపోయాయి అని చెప్పగానే బాలు చేసిన హంగామా మామూలుగా ఉండదు. అస్సలు ఊహించిన విధంగా బాలు వాళ్ళిద్దర్నీ ఆడుకుంటాడు. ఇక ప్రభావతి, ఇద్దరు కూడా ఒకటే పరుగులు పెడతారు ఇది కాస్త ఎపిసోడ్కి కామెడీగా అనిపించినా కూడా హైలెట్గా నిలుస్తుంది..
మీనా వాళ్ళిద్దరికీ ఇలా అవ్వడానికి కారణం ఏంటి నేను అన్ని బాగానే చేశాను కదా అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే లోపలికి వచ్చిన శృతి వాళ్ళిద్దరూ పైకి పోతారా నాకు టెన్షన్ గా ఉంది మీనా అని కంగారు పడుతుంది.. ఏంటి నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని నేను అడుగుతుంది. నేను కంగారు పడడానికి కారణం కూడా ఉంది మీనా వాళ్ళిద్దరూ తినే ఫుడ్ లో నేనే ఆముదం కలిపాను అని శృతి అనగానే మీనా షాక్ అవుతుంది.. ఏంటి ఆముదం కలిపావా? ఎందుకు కలిపావు శృతి అతను ఎందుకు ఇలాంటి పని చేశావు అని మీనా సీరియస్ అవుతుంది.. నిన్ను ఊరికే ఆంటీ ఏదో ఒకటి అంటూ ఉంది కదా.. అందుకే ఇలా ఆముదం కలిపి రివేంజ్ తీర్చుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోతారా మీనా నాకు భయంగా ఉంది ఏమైనా జరుగుతుందా అని శృతి నిజం చెప్పగానే నేను ఒక్కసారిగా షాక్ అవుతుంది.. కానీ మీనా ఇచ్చిన కషాయం వల్ల ప్రభావతి మనోజ్లకు మోషన్స్ ఆగిపోతాయి..
సుమతి ఉన్న గుడికి అరుణ్ తన తల్లిని తీసుకొని వస్తాడు.. అక్కడ సుమతిని చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు.. సుమతి వాళ్ళమ్మని పరిచయం చేస్తుంది. ఇద్దరూ పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు.. పార్వతి వాళ్లకి అర్చన చేయించమని లోపలికి పంపిస్తుంది. అదే గుడికి బాలు మీనా కూడా రావడంతో ట్విస్ట్ అదిరిపోతుంది. అయితే అరుణ్ సుమతి చాలా మంచి అమ్మాయిని తన మనసులో ఇష్టాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు.. పూజ అయిన తర్వాత సుమతీ తో మాట్లాడాలని పక్కకు వెళ్తాడు. ఇప్పుడే మా అమ్మ పెళ్లి చేసుకోమని గోల చేస్తుంది.. అందుకే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అని అతను సుమతికి ప్రపోజ్ చేస్తాడు. సుమతి మాత్రం తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్తుంది.. కానీ అరుణ్ చెప్పిన మాటలకి ఫీదా అవుతుంది..
గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత హలో మీనాలు ఇద్దరు కూడా అర్జెంటుగా పనుంది వెళ్ళిపోవాలని అనుకుంటారు.. అయితే బాలు కారు వెనకాల బండి పెట్టిన అరుణ్ ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అరుణ్ణి చూసిన బాలు నిన్ను చూసి షాక్ అవుతున్నాను. మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యావా..? ఇంకో ఆరు నెలలు ఉద్యోగంలో జాయిన్ అవ్వమని అనుకున్నాను కానీ మళ్ళీ అప్పుడే నీ డ్రెస్ నీకు వచ్చేసిందా అని బాలు అరుణ్ ఇద్దరు మరోసారి గొడవ పడతారు. అరుణ్ నిన్ను ఆరు నెలలైనా జైల్లో ఉంచేలా నేను ఏదైనా చేస్తాను జాగ్రత్తగా ఉండు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. మీనా బాలుని తీసుకుని పదండి వెళ్లిపోదామని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…