Gundeninda GudiGantalu Today episode April 22th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు కారు రైడ్ కోసమని బయటికి వెళ్తాడు. ఈ క్రమంలో ఒక రైడ్ రోహిణి పార్లర్ కు పడుతుంది. నేరుగా అక్కడికి వెళ్లిన బాలు కారు ఎక్కిన ఆవిడా డబ్బులు ఇవ్వకపోవడంతో పార్లర్ లోకి వెళ్తాడు. డబ్బులు ఇవ్వమని అడిగి తీసుకుంటాడు. అయితే అప్పటికే ఆ పార్లర్ లో మాణిక్యం, రోహిణి, స్నేహితురాలు దివ్య ఉంటుంది. మాణిక్యం ను అక్కడ నుంచి మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే బాలు అక్కడకు వచ్చి డబ్బులు ఇవ్వలేదు మేడం అని లోపలికి వెళ్లి అడుగుతాడు. రోహిణిని వాళ్ల ఓనర్ రోహిణిని పిలుస్తూ ఉంటుంది. మరోవైపు పార్లర్లోని అన్ని పనులను చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు సరిగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటుంది. ఇవన్నీ బాలు గమనిస్తూ ఉంటాడు. మరోవైపు పార్లర్లోని అన్ని పనులను చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు సరిగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటుంది. ఇవన్నీ బాలు గమనిస్తూ ఉంటాడు. ఇక పార్లర్ తనది కాదనే నిజం తెలిసిపోవడంతో రోహిణి గుట్టు ఇంట్లో బయట పెట్టాలని ప్రయత్నిస్తాడు. ముందుగా ఈ విషయాన్ని సత్యంతో చెప్పాలని బాలు అక్కడికి వెళ్తాడు. నిజం చెప్పిన మొదట నమ్మడు కానీ బాలు చూపించిన ఆధారాలతో బాలు చెప్పేది నిజమే అని నమ్ముతాడు. సత్యంతో ఆ నిజాన్ని చెప్తుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాత్రి బాలు మీనాని అడిగి దోసలు వేయమని వేయించుకొని తింటుంటాడు. ఎన్ని దోశలు వేయాలని మేము అడిగితే నీ చేత్తో ఎన్ని వేసిన నేను తింటానని బాలు అంటాడు. అయితే దోశలు తింటూ బాలు పూలకొట్టులో పని ఎక్కువైతే పనిమనిషిని పెట్టుకోవచ్చు కదా అని అడుగుతాడు. మనం ఏమి పెద్ద బిజినెస్ చేయట్లేదు కదా అండి వచ్చిన డబ్బులు అంతా పనిమనిషికిస్తే మనకే మిగులుతాయి. మరి ఏం పర్లేదు నేను చూసుకుంటాను లేండి అని మీనా అంటుంది. రోహిణి లాగా పెద్ద పార్లర్ కు ఓనర్ అయితే అలాగే పనిమనిషిని పెట్టుకోవచ్చు మనకంత అవసరం లేదులేండి అని మీనా అంటుంది.
ఓనర్లు పని వాళ్ళ లాగా పని వాళ్లు ఓనర్ లాగా నాటకాలు ఆడుతున్నారు అని బాలు నోరు జారుతాడు. ఓనర్ కాదు అంటున్నారు ఏంటండీ అని నేను అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం అరె బాలు అని కంట్రోల్ చేస్తాడు. ఈ అర్ధరాత్రి తినడమేంట్రా అని బాలుని సత్యం అడుగుతాడు. ఆకలేస్తుంది నాన్న అందుకే దోస తింటున్నాను అని అంటాడు బాలు. అప్పుడే ప్రభావతి అక్కడికి వచ్చి అర్ధరాత్రి పూట దెయ్యాలాగా ఈ తిండి గోల ఏంటి? అని అంటుంది. పద మీనా గండు పిల్లి వచ్చేసింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. సత్యం బాలుని ఆ పార్లర్ నిజాన్ని మర్చిపోరా అనేసి అడుగుతాడు. రాత్రికి అయితే మర్చి పోతున్నానా ఉదయం సంగతి తర్వాత చూసుకుందామని అంటాడు.
ఉదయం లేవగానే ప్రభావతి రోహిణి కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు బాలు అక్కడికి వచ్చి మీనా వీళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చింది నువ్వేనా రాజమాతకి మహారాణికి కూర్చోబెట్టి కాఫీ ఇస్తున్నావా అని అరుస్తాడు. రాణి ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా అని బాలు అందరిని అడుగుతాడు. రోహిణి క్వీన్ అంటుంది.. బాలు ఎందుకు ప్రతిసారి క్వీన్ అంటున్నాడు కొంపదీసి పార్లర్ ప్రాంచేజికి ఇచ్చిన విషయాన్ని తెలుసుకున్నాడా ఏంటి అని అనుమాన పడుతుంది.
ఇక అప్పుడే అక్కడికి ఇస్త్రీ బట్టలు తీసుకొని ఒక అతను వస్తాడు. ఇస్త్రీ బట్టలు ఎవరు ఇచ్చారు నువ్వు పక్కింటికి వెళ్లాల్సింది ఇక్కడికి వచ్చావేమో అని బాలు అంటాడు. కాదన్నా ఇక్కడే ఇంట్లో వల్లే ఇస్త్రీ బట్టలు ఇచ్చారన్న అని అనగానే బాలు అందరిని అడుగుతాడు. మనోజ్ నేనే ఇంటర్వ్యూ వెళ్లడానికని ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి. అందుకే ఐరన్ కి ఇచ్చాను అని అంటాడు. పని పాట లేకుండా పల్లీలు తినేవాళ్ళకి ఇస్త్రీ బట్టలు ఎందుకు నాన్న అని దారుణంగా మనోజ్ ని అవమానిస్తాడు. కానీ రోహిణి మాత్రం మనోజ్ పై మాట పడనివ్వదు.
ఇస్త్రీ బట్టలు ఖర్చు నేను ఇస్తాను అని రోహిణి అంటుంది. మనోజ్ ఈ బాలు నోరు మూయించాలంటే నువ్వు కచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అని రోహిణి అడుగుతుంది. నాకు జాబ్ చేయాలని ఉంది రోహిణి కానీ నా రేంజ్ కు తగ్గట్లు జాబ్ రాలేదు అని మనోజ్ అంటాడు. నేను ఇప్పుడు రేంజ్ను మర్చిపోయి పార్లర్ లో పనిచేస్తున్నాను. నువ్వు కూడా అంతే రేంజ్ను మర్చిపోయి ఏదో ఒక జాబ్ తెచ్చుకొని వీళ్ళ నోర్లు ముగించాలి అని రోహిణి చెప్తుంది.
పార్లర్ లో పనిచేయడం ఏంటమ్మా అని ప్రభావతి అడుగుతుంది. పార్లర్ పెట్టకముందు కస్టమర్ దగ్గరికి నేనే వెళ్లి అన్ని చేసేదాన్ని. కానీ మీరు పార్లర్ పెట్టించిన తర్వాత కస్టమర్లు అనే దేవుళ్ళుగా భావించి అందరికీ మంచిగానే చేస్తున్నానండి అని అంటుంది. ఇక మీనా బాలుని పైకి తీసుకెళ్తుంది. ఎవర్ని ఏది అనకుండా మీరు పోరు అదే తగ్గించుకుంటే మంచిది అని సలహా ఇస్తుంది. అటు మనోజ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి వెళ్తాడు కానీ అక్కడ సెలెక్ట్ అవ్వడు.
రోహిణి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఏదైనా జాబ్ తెచ్చుకోవాలని ఒక హోటల్ కి వెళ్తాడు. అక్కడ రెస్టారెంట్లో వెయిటర్ గా జాబ్ ని సంపాదించుకుంటాడు. ఇంకా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు మనస్సు స్వీట్లను తీసుకొని ఇంటికి వస్తాడు. అందర్నీ పిలిచి స్వీట్లు ఇవ్వాలని అనుకుంటాడు. బాలు మాత్రం పల్లీలు బదులు స్వీట్లు తెచ్చావా అంటూ కామెంట్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనాకు పుస్తెలతాడు ఇవ్వాలని ప్రభావతితో అంటాడు సత్యం. కానీ మీరే మాత్రం మా ఆయన తెచ్చిన తాడుని నేను వేసుకుంటానని మొండిగా కూర్చుంటుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు చూడాలి..