Jio Hot Star: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 40 కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. అంతేకాదు దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే జట్లు… ఖరారు కూడా అయ్యాయి. ఎవరు ఇంటికి వెళ్ళేది కూడా… అంచనా వేయవచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలో…. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ 200025 టోర్నమెంట్ కారణంగా జియో హాట్ స్టార్ ఊహించని ఆదాయం వస్తోందని… చెబుతున్నారు. తాజాగా… జియో హాట్ స్టార్ కు వచ్చిన ఆదాయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read: Rp Singh: వాడికి 23 కోట్ల దండగ.. వెంకటేష్ అయ్యర్ పరువు తీసిన టీమిండియా మాజీ బౌలర్
పదివేల కోట్లు దాటిన ఆదాయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… జియో హాట్ స్టార్ కు పదివేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. ఇప్పటివరకు ఈ జియో హాట్ స్టార్ ను 100 మిలియన్ల పెయిడ్ యూజర్లు… డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో 10,006 కోట్ల ఆదాయం… జియో హాట్ స్టార్ కు వచ్చిందని చెబుతున్నారు. సగం టోర్నమెంట్.. పూర్తికాగానే ఈ మేర ఆదాయం వచ్చింది. మరో సగం టోర్నమెంట్ ఇంకా మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో… ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 20 వేల కోట్లు… దాటే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎండాకాలం కావడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మ్యాచులు సాయంత్రం ప్రారంభం కావడం, క్రికెట్ అంటే అభిమానులు ఇండియాలో ఎక్కువగా ఉండడం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టి20 ఫార్మేట్ కావడంతో… మూడు గంటలు కచ్చితంగా మ్యాచ్ చూస్తున్నారు జనాలు.
జియో సినిమా, హాట్ స్టార్ విలీనం
రిలయన్స్ ఓనర్ అంబానికి సంబంధించిన జియో సినిమా అలాగే హాట్ స్టార్ రెండు కూడా ఇటీవల విలీనమయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు… ఈ విలీన ప్రక్రియ జరిగింది. అంతకుముందు జియో సినిమాలోనే… ఐపీఎల్ మ్యాచ్లు ప్రసారం అయ్యేవి. ఇప్పుడు హాట్స్టార్ కూడా కలిసింది. అయినప్పటికీ జియో కస్టమర్ లందరికీ ఐపిఎల్ 2025 టోర్నమెంట్ను ఉచితంగా అందిస్తోంది జియో యాజమాన్యం.
Also Read: Hardik Pandya’s Mother :హార్దిక్ పాండ్య తల్లి గొప్ప మనసు.. 2100 కేజీల జ్యూస్ తో పాటు
చెన్నై, RCB మ్యాచ్లకు ఎక్కువ వ్యూయర్ షిప్
చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. జట్టకు సంబంధించిన ఏ మ్యాచ్ జరిగిన కూడా జనాలు ఎక్కువగా.. చూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్కు వస్తే అమాంతం రేటింగ్.. పెరిగిపోతుంది. కానీ మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) ఈ టోర్నమెంట్ లో పెద్దగా రాణించిన పరిస్థితిలు లేవు. అయినప్పటికీ ఆయన పైన ఉన్న క్రేజ్ తగ్గడం లేదు.