Gundeninda GudiGantalu Today episode April 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ జంటలుగా బయటకు వచ్చి తమ ప్రేమని బయట పెడుతూ భార్య భర్తలు అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే సుశీల వచ్చి గడ్డి బొమ్మ దగ్గర దొంగలా ఏంటి అని ఆ గట్టిగా అరుస్తుంది అప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరు ఒక్కొక్కరు బయటికి వచ్చేస్తారు. ఈ చీటీ గోల ఏంటి అని అడిగితే.. బాలు నిజం ఒప్పుకుంటాడు. ఆ లెటర్ తన భార్య మీనా కోసం రాశానని చెబుతాడు. కానీ వీళ్లందరికీ ఇలా చేరుతుందని అనుకోలేదంటూ చెప్పి ఆశ్యర్యపడుతాడు. బాలు చేసిన పనికి అంతా ఫూల్ అవుతారు. కానీ కొద్ది క్షణాలైనా సంతోషంగా ఒకరితోమరొకరు సమయం గడుపుతారు. మీనా ప్లాన్ నచ్చి అందరు గొడుగులు పట్టుకొని వస్తారు.. బాలు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు వాళ్ళందరిని బామ్మ వస్తే చంపేస్తుందని పంపించేస్తాడు. బయట ముగ్గు వేయడానికి మీనా వెళ్తే ప్రభావతి హడావిడి చేస్తుంది. మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నాడు సుస్వాగతం అని రాయాలని తెలియదా అని అంటుంది. నేను చెప్పినట్టుగా వంటలన్నీ చేసి పెట్టేసేయ్ అని మీ నాకు ఆర్డర్లు వేస్తుంది. ఈ బకెట్ తీసి ఇంకా పక్కన పెట్టలేదు ఏంటి అని బకెట్ ని తీయబోతుంటే ప్రభావతి కాలు సరి కింద పడిపోతుంది అప్పుడే సత్యం వచ్చి ప్రభావతిని పట్టుకుంటారు అందరూ ఆ సీన్ ను చూసి షాక్ అవుతారు. లోపలికి వెళ్ళగానే ప్రభావతి హడావిడి చేస్తుంది. మలేషియా మావయ్య వస్తున్నాడు కదా ఎలా చూసుకోవాలో ఏంటో అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడంటూ ప్రభావతి ఇంట్లో ఒకటే హడావుడిచేస్తుంది. హాల్లో అటు ఇటు తిరుగుతూ కంగారుపడుతూ ఉంటుంది. మరోవైపు మీనా ను పిలిచి రోహిణి వాళ్ళ మామయ్య వచ్చే సమయం అయ్యిందని హారతి పల్లం రెడీ చేయమని చెబుతుంది. ఇక నేను చెప్పిన స్వీట్స్, ఫుడ్ ఐటమ్స్ అన్ని రెడీ చేసావా లేదా అని మీనాపై అరుస్తుంది. ఇక మీనా చేశానని చెబుతుంది. ఇక ప్రభావతి హడావుడి చూసిన భర్త సత్యం, కొడుకు బాలు, అత్త సుశీలమ్మ చిరాకు పడుతూ ఉంటారు. ఏదో వింత జరగబోతున్నట్టు ఎందుకు అంత హడావుడి ఎందుకు చేస్తున్నావ్ అంటూ కౌంటర్స్ వేస్తాడు.
రోహిణి మాత్రం ఆడు వచ్చేది ఏంటో కానీ ఎవరు మాత్రం నన్ను టెన్షన్ పెట్టి చంపేస్తుంది అని అనుకుంటుంది. మటన్ కొట్టు మాణిక్యం కి ఎక్కడున్నావని ఫోన్ చేసి అడుగుతుంది. అతను నటనలో పరకాయ్ ప్రవేశించాలని శ్లోకం పడతాడు దాంతో కుక్కలు అతని వెంట పడతాయి.
ప్రభావతి రోహిణి వాళ్ళ మేనమామ గురించి మాట్లాడినప్పుడల్లా కొడుకు బాలు తన మాటల తూటాలతో ప్రభావతి నోట మాట రాకుండా చేస్తాడు. మలేషియా నుంచి వస్తున్న రోహిణి వాళ్ళ మేనమామ అసలు వస్తాడో రాడో తెలియదు కానీ ప్రభావం మాత్రం ఓవర్ బిల్డప్ ఇస్తుంది అంటూ అత్త సుశీల మందలిస్తుంది..మీ మామయ్య వస్తున్నాడా లేదా అని అడుగుతుంది సుశీలమ్మ. దగ్గర వరకు వచ్చాడని, కార్ లోనే వస్తున్నాడని బదిలిస్తుంది. దగ్గరికి వచ్చాడని చెప్పడంతో ప్రభావతి ఇంకా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతోంది..
అన్ని చూసుకున్నాను కానీ వాళ్ళ మామయ్య వస్తే ఏ రూమ్ లో ఉంటాడు అని ప్రభావతి మళ్లీ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది.. రూమ్ నుంచి హాల్లోకి వచ్చిన రవి శృతీలు తమ రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇక సుశీలమ్మ రూమును అడుగుతారేమోనని బాలు ముందుగానే తన పంచులతో అడగకుండా చేస్తాడు. చేసేదేం లేక రోహిణి మా రూమ్ ఇస్తాం లే అని, మేమే హాల్లో పడుకుంటామని బదులిస్తుంది. తోటకి వెళ్లి కొబ్బరి బోండాలు తీసుకురా అని ఆదేశిస్తారు. ఇక ఈ లోగా బయట కార్స్ సౌండ్ వినిపిస్తుంది. వచ్చింది మలేషియా మామ అనుకొని ప్రభావతి మనోజ్ హడావుడిగా వచ్చేస్తారు. రోహిణి కూడా ముందుగానే వస్తుంది. మొదట ఒక కారు వచ్చి అడ్రస్ అడిగి వెళ్లిపోతుంది.. ప్రభావతి మాత్రం హడావిడి చేస్తూ ఉంటుంది అంతలోకే ఓ వ్యక్తి కాపాడండి అంటూ వచ్చి ఇంట్లోనే కుప్పు తోటిలో పడిపోతాడు. అతనే మలేషియా మావయ్యని రోహిణి చెప్పగానే అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..