Nominee Change Free: దేశంలో కోట్లాది మంది చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వంటి ఖాతాదారులు ఇకపై వారి నామినీ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది.
కొత్త నామినీ యాడ్
ఇప్పటివరకు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ ఖాతాల్లో నామినీ వివరాలను మార్పు చేయడం, కొత్త నామినీ యాడ్ చేయడం వంటి సేవలకు రుసుములు వసూలు చేసేవారు. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో నామినేషన్ మార్పులు ఇకపై పూర్తిగా ఉచితంగా ప్రాసెస్ చేయబడతాయి.
నామినీ మార్పులపై ఫీజులు బంద్
ఏప్రిల్ 2, 2025న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్, 2018లో కీలకమైన మార్పులు చేశారు. ఈ మార్పుల ప్రకారం, నామినీ అప్‌డేట్, సవరింపు, కొత్త నామినీ పేరు యాడ్ చేయడం వంటి ప్రాసెసులను పూర్తిగా ఉచితంగా చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ఖాతాదారులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు. ఇంతకు ముందు, ఖాతాదారులు తమ PPF, NSC లేదా SCSS ఖాతాల్లో నామినీ వివరాలను మార్పు చేసుకోవడానికి లేదా కొత్త నామినీని చేర్చడానికి రూ. 50 నుంచి రూ. 500 వరకు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇకపై అలాంటి ఫీజులు ఉండవు.
అసలు నామినీ వివరాలు ఎందుకు?
ఈ ఖాతాల్లో సేవ్ చేసే చాలా మంది వారి ఖాతా ఓపెన్ చేసినప్పుడు నామినీ వివరాలను ఎంటర్ చేయడం మరిచిపోతుంటారు. అయితే, ఏదైనా అనుకోని పరిస్థితిలో ఖాతాదారు మరణిస్తే, వారి సేవింగ్ మొత్తాన్ని కుటుంబ సభ్యులు పొందడానికి నామినీ వివరాలు చాలా కీలకం. నామినీ వివరాలు లేకపోతే, లీగల్ క్లియరెన్స్, న్యాయపరమైన సమస్యలు రావచ్చు. అందుకే, మీ ఖాతాలో నామినీ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం చాలా అవసరం.
Read Also: QLED TV Launch Offer: రూ.6 వేలకే బ్రాండెడ్ QLED స్మార్ట్ ..
నామినీ వివరాలు ఉచితంగా ఎలా అప్‌డేట్ చేయాలి..
మీరు ఇప్పుడు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి, సంబంధిత ఫారమ్‌ను పూరించి మీ PPF లేదా ఇతర పొదుపు ఖాతాల్లో నామినీ వివరాలను ఉచితంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ వివరాల ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా:
-బ్యాంక్ లేదా పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.
-సంబంధిత సేవింగ్స్ ఖాతా ఎంపిక చేసుకోండి.
-‘నామినీ అప్‌డేట్’ ఎంపికను సెలెక్ట్ చేసి, కొత్త వివరాలను నమోదు చేయండి.
-మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి నిర్ధారించండి.
-ఆ క్రమంలో అప్‌డేట్ నామినీ వివరాలను సేవ్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ ద్వారా:
-మీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌ను సందర్శించండి.
-నామినీ మార్పు కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఫారమ్‌ను పొందండి.
-అవసరమైన వివరాలు పూరించి, ID ప్రూఫ్‌తో సమర్పించండి.
-మీ అభ్యర్థన ప్రాసెస్ అయిన తర్వాత, మీకు SMS లేదా మెయిల్ ద్వారా ధృవీకరణ అందుతుంది.
ఈ మార్పుతో ఎవరికీ లాభం?
-PPF ఖాతాదారులు: నామినీ మార్పులు ఇకపై ఉచితం.
-SCSS, NSC ఖాతాదారులు: ఇకపై వారి నామినీ వివరాలను సులభంగా మార్చుకోవచ్చు
-పోస్టాఫీస్ ఖాతాదారులు: నామినీ మార్పు ఫీజు తీసుకోవడాన్ని ఆపివేశారు.
-సాధారణ ఖాతాదారులు: బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా ఇంటర్నెట్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.