Betting App Case:గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న ప్రతి ఒక్కరిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్న విషయం తెలిసిందే. తులసి వనంలో గంజాయి మొక్కలా.. పంటచేనులో కలుపు మొక్కలా.. ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్న ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తూ పలు కోణాలలో ఈడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పేరిట చాలామంది సెలబ్రిటీలు భారీగా వెనకేసుకున్నారు. కానీ వీరిని అనుసరించి ఎంతో మంది యువత అప్పుల పాలు కావడమే కాకుండా.. ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిని ఐడెంటిఫై చేసి సినీ రంగానికి చెందిన మొత్తం 29 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసును ఈడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అందులో భాగంగానే ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తూ పలు కోణాలలో విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రకాష్ రాజ్ (Prakash Raj), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రానా దగ్గుబాటి (Rana daggubati) వంటి స్టార్ సెలబ్రిటీలను విచారించిన ఈడీ అధికారులు.. నేడు మంచు లక్ష్మి (Manchu Lakshmi) ని విచారించబోతున్నారు. ఈనెల 11వ తేదీన రానా దగ్గుబాటిని విచారించిన ఈడీ అధికారులు.. ఆగస్టు 13న మంచు లక్ష్మి కి నోటీసులు జారీ చేస్తూ విచారణకు రావాలి అని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నేడు మంచు లక్ష్మి ఈడి అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. 11 గంటల సమయంలో వ్యక్తిగతంగా ఈడీ కార్యాలయానికి హాజరయ్యి, అడిగిన వివరాలను తీసుకురావాలని ఈడి నోటీసులలో పేర్కొన్నారు. ఇకపోతే ఈడీ అధికారులు మనీ ల్యాండరింగ్ అంశాలపైనే దర్యాప్తు కొనసాగిస్తూ.. మరొకవైపు వీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిపిన లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను కూడా తీసుకురావాల్సిందిగా నోటీసులలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరి విచారణకు హాజరు కాబోతున్న మంచు లక్ష్మి.. ఈడీ అధికారుల ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెబుతుంది ? అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
19 బెట్టింగ్ యజమానులపై కేసు ఫైల్..
ఇకపోతే సినీ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 29 మంది సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కేసు ఫైల్ అయ్యింది. అలాగే దాదాపు 19 బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా కేస్ ఫైల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కొక్కరిని విచారణకు రావాలి అని నోటీసులు జారీ చేస్తూ మనీ లాండరింగ్ కేసులో కూడా ఈడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక భవిష్యత్తులోనైనా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఆగిపోతుందేమో చూడాలి.
వేలు చూపిస్తూ మీడియాకు మంచు లక్ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్?
ఇకపోతే ఈరోజు ఎట్టకేలకు మంచు లక్ష్మి ఈడి అధికారుల ముందు హాజరు కావడానికి విచ్చేశారు. అయితే ఈమెను పలకరించడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నం చేయగా.. వేలు చూపిస్తూ నా జోలికి వచ్చారో అంతుచూస్తా అన్న రేంజ్ లో వేలు చూపిస్తూ మీడియా వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!