E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి అవమానం.. సుశీల ప్లాన్ అదుర్స్.. రోహిణి, మనోజ్ ను విడగొట్టే ప్లాన్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి అవమానం.. సుశీల ప్లాన్ అదుర్స్.. రోహిణి, మనోజ్ ను విడగొట్టే ప్లాన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 14th : మనోజ్ లోపలికి రాగానే రోహిణి ఏడుస్తూ నన్ను క్షమించు మనోజ్ అని అంటుంది.. కానీ మనోజ్ మాత్రం నువ్వు చెప్పిన వెయ్యి అబద్ధాలు నన్ను బాధ పెట్టేసాయి. ఇక నిన్ను ఎలా నమ్ముతాను అని అంటాడు.. నువ్వు ఎంత చెప్పినా కూడా నేను ఏది వినను అని మనోజ్ అంటాడు. కానీ రోహిణి మాత్రం తనని నమ్ముమని అడుగుతుంది. బాలు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచనలో ఉంటారు.. ఇలాంటి మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని బాలు తో సహా మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మనోజ్ రోహిణి నా దగ్గర ఇంకా ఏదైనా దాచిందేమో అని అనుమానం మొదలవుతుంది. ప్రభావతి మాత్రం రోహిణి కనీసం మనిషిగా కూడా చూడదు.. ప్రభావతికి ఎంతగా సుశీల నచ్చ చెప్పాలని ప్రయత్నించినా సరే తను మాత్రం నేను ఈ విషయాన్ని మర్చిపోలేక పోతున్నాను అత్తయ్య అని అంటుంది. రోహిణి మనోజ్ కి దగ్గర అవ్వాలని చూసిన కూడా మనోజ్ మాత్రం అస్సలు వినకుండా తనకి దూరం అవ్వాలని అనుకుంటాడు..

షీలా ప్లాన్ అదుర్స్..

రోహిణి మనోజులని విడగొట్టేందుకు ప్రభావతి ప్లాన్ మీద ప్లాన్లు చేస్తూ ఉంటుంది.. అయితే రోహిణి మాత్రం ఎలాగైనా సరే.. మనోజ్ కి దగ్గర అవ్వాలి తన మనసులో మళ్లీ తిరిగి తన స్థానాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది.. కానీ ప్రభావతి ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో దూరి విడగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అది గమనించిన సుశీలమ్మ అదిరిపోయే ప్లాన్ చేస్తుంది.. అన్ని జంటలని కలపాలి అని ప్లాన్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇస్తుంది. మీరందరికి బరువు బాధ్యతలను మోసేలా చేస్తాను భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ బాధ్యతల్ని మోయాలి అని సుశీలమ్మ అంటుంది. మనోజు నేను మోయలేను అని అంటే నీ భార్య కూడా ఉంది కదరా మోస్తుందిలే అని అంటుంది.. ఇక తర్వాత సుశీలమ్మ చెప్పిన బరువుని బాలు వాళ్ళు తీసుకుని రావడంతో అందరూ దాన్ని చూసి షాక్ అవుతారు.

ఊయ్యాలను చూసి సిగ్గుపడ్డ ప్రేమ..

Advertisement

లోపలికి బాలురవి వెళ్లి ఊయాలను తీసుకుని రాగానే దాన్ని చూసి అందరూ కూడా కాసేపు సిగ్గుపడతారు.. అందరూ వచ్చి ఏడాదికల్లా బాబునూ లేదా పాపనో ఇవ్వాలి ఈ ఉయ్యాల్లో వేయాలి అని సుశీలమ్మ అంటుంది. ఏంటి ప్రభావతి నువ్వు రెడీనా అని అనగానే ఊరుకోండి అత్తయ్య ఈ వయసులో అని ప్రభావతి సిగ్గుతో మెలికలు తిరుగుతుంది. దేనికి అత్తయ్య గారు అని అడుగుతుంది ప్రభ. నానమ్మ అని పిలిపించుకోవడానికి నువ్వు రెడీనా అని అనగానే నేనెప్పుడో రెడీ అత్తయ్య గారు అని అంటుంది.. ఇక ప్రభావతి సత్యం ఇద్దరూ తాతా నాయనమ్మ అంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటారు.. అందరూ కలిసి ఉయ్యాలని చూసి సిగ్గు పడిపోతూ ఉంటారు. ఇంకా బాలు మనము ఎంత కష్టపడాలో కదా అని అనగానే మీనా ఊరుకోండి అని సిగ్గుపడుతుంది.

ముడుపులు కట్టించిన షీలా..

ఇంట్లో నీ ముగ్గురు జంటలతో ముడుపులు కట్టించాలి అని సుశీలమ్మ అనుకుంటుంది.. అయితే అందులో ఉన్న ఎర్ర జాకెట్టు అలాగే కొబ్బరికాయలతో భార్యాభర్తలిద్దరూ కలిపి ముడి కట్టాలి అని చెప్తుంది. ఆ మాట వినగానే ఇద్దరు కూడా కలిసి ముడి కట్టి ఆ ముడిని సంచిలో పెట్టమని చెప్తుంది.. మనోజ్ నీ పక్కకు పిలిచిన ప్రభావతి ఆ ముడుపు కట్టడానికి వీల్లేదు అని చెప్తుంది.. అని సుశీలము మాత్రం వాళ్ళ అందరి చేత కట్టించాల్సిందే అని అనుకుంటుంది. ఇక తర్వాత అందరూ ముడుపులు కట్టి బామ్మ చేతికి ఇస్తారు. ఆ ముడుపులు తీసుకొని గుడిలో పెడతాను అని సుశీలమ్మ అంటుంది.

ప్రభావతి కు మీనా క్లాస్..

Advertisement

ప్రభావతి మనోజ్ ని పిలుస్తుంది. మనోజు రాగానే ఆ దొంగ మొహం ఏం చేస్తుంది అని అడుగుతుంది. ఇక మీనా పక్కనే ఉండి ప్రభావతికి చురకలు అంటిస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి ఆ దొంగ మొహం తినితో పాటు షో రూమ్ కి రావడానికి వీల్లేదు అని కండిషన్ పెడుతుంది.. మనోజ్ తల్లి మాట కాదనలేక అలాగే అమ్మ అంటాడు.. ఇందులో మీనా భార్యాభర్తల్ని విడగొడుతున్నారా అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రభావతి ఇది నా కొడుకు జీవితం నా ఇష్టం వచ్చినట్లే ఉంటుంది అని అంటుంది. మీనా మాత్రం భార్యాభర్తలను విడగొడితే మహా పాపమని చెప్తుంది. రోహిణికి ఎలాగైనా సరే ఈ విషయాన్ని చెప్పమని ప్రభావతి చెప్పి మనోజ్ ని పిలవమని చెప్తుంది. రోహిణికి షోరూంకే కాదు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.. ఆ మాట వినగానే రోహిణి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : గాయత్రి కోసం తాయారు టెన్షన్.. చక్రికీ మహా షాక్.. హైలెట్ సీన్ ఇదే..

Related News

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Big Stories

Advertisement
×