Gundeninda GudiGantalu Today episode December 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు తినేటప్పుడు ప్రభావతి అనుమానించడంతో తాను కార్లు కడిగే పనికి వెళ్తున్నననీ, ఇంట్లో ఖాళీగా ఉంటే.. తినే ప్రతి మెతుకుకు లెక్క వేయాలని బాలు కొప్పాడుతాడు. ఇంతలో సత్యం వచ్చి త్వరగా అందరిని బయటికి రమ్మని పిలుస్తాడు. దీంతో బాలు కంగారు పడతాడు ఏమైంది నాన్న అని ప్రశ్నిస్తాడు. అంతా తర్వాత చెప్తా గాని మొదలు బయటకు రా అని లాక్కొస్తాడు. అంతలోనే బాలు ఫ్రెండ్ రాజేష్ కనిపిస్తాడు. దీంతో బాలు కంగారుపడి.. ఏమైందిరా అని ప్రశ్నిస్తాడు. బాలు తినడం అవుతుంది. సత్యం కనిపించట్లేదని బాలు మీనాను అడుగుతాడు. ఏమో అండి టిఫిన్ కూడా చేయలేదు బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు అనేసి మీనా అంటుంది. అప్పుడే సత్యం ఇంట్లోకి వస్తాడు అరె తినడం అయిపోయిందా అయితే బయటికి రా అర్జెంటుగా నీకు ఒకటి చూపించాలి అనేసి హడావిడి చేస్తాడు. నువ్వు ఇప్పటివరకు చాలా చేసావు నా ప్రాణాల్ని కోసం వస్తే నా ప్రాణాన్ని కాపాడ్డానికి నీ ప్రాణమైన కారణం ఏశావు అందుకే నీకు ఇదిగో గిఫ్ట్ ఇచ్చాను అనుకో అనేసి అంటాడు. బాలు కారును చూసి ఎమోషనల్ అయిపోతాడు. బాలు సంతోషంలో మునిగిపోతాడు. ఈ కారును నమ్మేసాను కదా నాన్న మీకు ఎలా వచ్చింది ఎవరిచ్చారు అయినా ఒకసారి నడుపుకోమని ఇచ్చారా ఏంటి అనేసి అడుగుతాడు. పక్కనే ఉన్న బాలు ఫ్రెండ్ బాబాయ్ నీకోసం ఈ కారును కొన్నాడు అనేసి చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు ఎమోషనల్ అవుతాడు. అంతేకాదు ఎందుకు నాన్న మళ్లీ ఎందుకు నాన్న నువ్వు ఇంత డబ్బులు పోసి మళ్ళీ కొన్నావు అనేసి అనగానే ప్రభావతి కౌంటర్లు ఇస్తుంది. నాకోసం నువ్వు అమ్మావురా అందుకే నేనే దీని కొన్నాను అనేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక మీనాకిచ్చి ఇదిగో అమ్మ నీ చేత్తో తాళాలు ఇస్తే మంచిది అని బాలుకి ఇవ్వమని చెప్తాడు. మీనా వల్లే కారు పోయింది ఇప్పుడు మీనా వల్లే కారు వచ్చిందని బాలు కూడా అనుకుంటాడు. కారు తీసుకురావడానికి అంత డబ్బులు మీకు ఎలా వచ్చాయి నాన్న అని బాలు అడుగుతాడు. నాకోసం నువ్వు చూసుకున్నావు నీకోసం నేను చూడకపోతే ఎలా తండ్రికి అర్థం వేరే అయిపోతుంది అనేసి సత్యం అంటాడు. కానీ బాలు మాత్రం అంత డబ్బులేసి మళ్లీ తీసుకోకపోతే ఏమైంది నాన్న అనేసి బాధపడతాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్ కాస్త ఎపిసోడ్కి హైలైట్ అవుతుంది. ఇక మీనాన్ని తీసుకొని అలా బయటికి వెళ్ళేసి రా అప్పు అనేసి సత్యం వాళ్ళిద్దర్నీ పంపిస్తాడు. మీనా ను తీసుకొని బయటికి వెళ్లిన బాలు తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తన ఫ్రెండుని మీనాక్షి సారీ చెప్పాలని నువ్వు ఈ మాట చెప్పు అనేసి చెప్తాడు. వాడు నీతో ఏదో చెప్పాలంటమ్మా అనేసి అతను అంటాడు. ఏంటి అన్నయ్య అంటే.. నీవల్లే కారు పోయింది నీవల్లే కార్ వచ్చిందని వాడు సంతోష్ పడిపోతున్నాడనేసి అతను చెప్తాడు. ఇక రవి శృతి ఇద్దరూ తినడానికి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే రవి వంట మనిషి లాగా అవి ఇవి అనేసి చెప్తాడు.. నువ్వు చెప్తే తిన్నట్టే కానీ అనేసి శృతి తన కావాల్సింది తానే ఆర్డర్ చేసుకుంటుంది..
శృతి ఆర్డర్ చేస్తుంది రవిని సరిగా కూర్చోమని చెప్తుంది. అయితే అప్పుడే బాలు మీనా పక్క టేబుల్ లో ఫుడ్ తినడానికి వస్తారు. రవి వాడు ఫుడ్ ఎలా చేస్తాడో ఏంటో అనేసి అనుకుంటున్నా గాని శృతి ఉంది నువ్వు తినడానికి వచ్చావు తినడానికి వచ్చినట్టే ఉండు అనగానే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానని బయటికి వెళ్తాడు. అప్పుడే బాలు కనిపిస్తే అన్నయ్య వదిన బాగున్నారా అనేసి అంటారు. రవి ని చూడగానే బాలు కోపంతో కొట్టడానికి వస్తాడు ఇక శృతి కూడా ఎందుకు కొడుతున్నారనేసి బావ గారు అని కూడా చూడకుండా ఎదురు ఇస్తుంది. అటు రవి కూడా నా భార్య ని ఏమనొద్దనేసి ఒకరి మీద ఒకరు ప్రేమను చూసుకుంటూ బాలుతో అంటాడు. అక్కడ ఉంటే ఫుడ్డు తినడానికి కుదరదు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి రమ్మని మీనాక్షి చెప్తాడు. కానీ కార్లు కూర్చుని మళ్లీ మీనా ను తిడతాడు. అత్త నీకు ఇంటికి రాగానే ప్రభావతి కామాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రవి గురించి ఇంట్లో ఎలాగైనా చెప్పాలి అనేసి అంటాడు. ఇక సత్యం రాగానే రవి గురించి కామాక్షి ప్రభావతి చెప్తారు. అప్పుడే బాలు మీనా కూడా ఇంటికి వస్తారు. రెస్టారెంట్ లో రవి కనిపించారు. వాళ్ళిద్దరు తీరు ఇలా ఉందని బాలు చెప్తాడు. ఇక మీనా రవిని ఇంట్లోకి రానిద్దాం మామయ్య ఏదో తెలియక తప్పు చేశాడు కానీ ఇప్పుడు తనకి ఆ హక్కు ఉంది మీరంటే తనకి ఇష్టం ఉంది అనేసి అంటుంది. కానీ సత్యం మాత్రం నీకు వాడిని క్షమించే అంత మంచి గుణం ఉన్నా కానీ నాకు వారిని క్షమించే అంత మంచి మనసు లేదమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు విన్నారుగా మా నాన్న నిన్న ఏమి ఫైనల్ అనేసి అంటాడు. రవి ఉదయం రెస్టారెంట్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. బాలుని శృతి తిడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మీనా ను శృతి కలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..