Nindu Noorella Saavasam Serial Today Episode : నిర్మల, శివరాం, రాథోడ్ ముగ్గురు కలిసి మిస్సమ్మను మెచ్చుకుంటారు. నీవల్లే ఈరోజు అమర్ హ్యాపీగా నవ్వుతున్నాడు అంటారు. ఆరు ఉన్నా కూడా ఇలా చేసేది కాదని అనడంతో మిస్సమ్మ ఊరుకోండి అత్తయ్యా అంటూ మీకు కాఫీ తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది. మరోవైపు పిల్లలతో మాట్లాడుతున్న అమర్ వారిని తన దగ్గరే ఉండమని చెప్తాడు. పిల్లలు అందరూ అమర్‌ను హగ్ చేసుకుంటారు. కిటికీలోంచి చూస్తున్న ఆరు ఎమోషనల్‌గా ఏడుస్తూ.. మిమ్మల్ని పిల్లలను ఇలా చూస్తాను అనుకోలేదండి. మీకు సరైన జోడీ మిస్సమ్మే అనుకున్నాను.
నా నమ్మకాన్ని మిస్సమ్మ ఈరోజు నిలబెట్టింది అని ఏడుస్తుంది ఆరు. పిల్లలు అమర్ కు గుడ్‌నైట్ చెప్పి వెళ్లిపోతారు. బయట ఎదురుగా మిస్సమ్మ వచ్చి ఏంటి పిల్లలు చక్కగా మీ డాడీతో ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు అని అడుగుతుంది. పిల్లలందరూ ఏడుస్తుంటారు. అరేయ్ ఏంటది కన్నీళ్లు అని అడుగుతుంది. దీంతో అంజు, మిస్సమ్మను హగ్ చేసుకుంటుంది. హగ్ ఇచ్చాను కదాని అయిపోయింది అనుకోకు కోపం అలాగే ఉంటుంది అని అంజు అనగానే నేను కూడా హగ్ ఇచ్చాను అని గొడవ అయిపోయింది అనుకోకు చిన్న బ్రేక్ ఇచ్చాను అంతే అంటుంది మిస్సమ్మ. దీంతో పిల్లలందరూ మిస్సమ్మను హగ్ చేసుకుంటారు. డాడీతో చాలా కబుర్లు చెప్పాము.. డాడీని చాలా మిస్ అయ్యాము అని చెప్తారు. సరే లేట్ అయింది కదా వెళ్లి పడుకోండి అని పిల్లలను రూంలోకి పంపిచేస్తుంది.
తర్వాత రూంలోకి వెళ్లి ఏవండి రాత్రి ఏ టైంలో అయినా అవసరం ఉంటే నన్ను నిద్రలేపండి మొహమాట పడకుండా అడగండి. అని చెప్తుంది. అమర్, మిస్సమ్మకు థాంక్స్ చెప్తాడు. ఎందుకండి జాగ్రత్తలు చెప్తున్నందుకా అని మిస్సమ్మ అడుగుతుంది. పిల్లలు వచ్చి మాట్లాడారు. ఈ సంతోషానికి, మా నవ్వులకు కారణం నువ్వే అని నాకు తెలుసు మిస్సమ్మ. ఆరు లేదనే బాధపడ్డాను కానీ ఆరును పిల్లల్లో చూసుకోవచ్చని తెలియలేదు అంటాడు అమర్. ఇంత చిన్న విషయానికి థాంక్స్ ఎందుకండి అని మిస్సమ్మ చెప్తుంది. నీకు తెలియదు ఇది నాకు చాలా పెద్ద విషయం.. ఆరు ఏ లోకంలో ఉన్నా నీకు చాలా పెద్ద థాంక్స్ చెప్తుంది. నాకు హెల్త్ సెట్ అయ్యాక వీక్లీ ఒకసారి అందరం కలిసి ఇలాగే కబుర్లు చెప్పుకుందాం మిస్సమ్మ అని అమర్ చెప్పగానే సరే అంటుంది మిస్సమ్మ.
బాబ్జీ లారీ కోసం వెళ్తాడు. లారీ ఓనరుతో తనకు కిరాయికి కావాలని అడుగుతాడు. రేపు రమ్మని లారీకి కొంచెం రిపేరు ఉందని చెప్తాడు. నాకు అర్జెంట్‌గా కావాలన్నా పక్కనే మా ఫ్రెండ్ షెడ్డు ఉంది. నేను అక్కడ రిపేరు చేయించుకుని లారీ తీసుకెళ్తాను అని చెప్తాడు. ఓనరు సరే అని లారీ కీస్ ఇస్తాడు. లారీ దగ్గరకు వచ్చిన బాబ్జీకి మనోహరి ఫోన్ చేసి రెడీగా ఉన్నావా… అని అడుగుతుంది. అంతా రెడీగా ఉందని స్పాట్‌కు ఆవిడ వస్తుందా..? అని అడగ్గానే వస్తుంది. ఇప్పుడే గుడికి వెళ్లడానికి సింగారించుకుంటుంది అని చెప్పి నువ్వు పని కరెక్టుగా చేయ్ అని చెప్పగానే మీరేం కంగారు పడకండి మేడం మిస్సమ్మ రేపటి నుంచి మీ లైఫ్‌లోంచి మిస్ అవుతుందని ఫోన్ కట్ చేసి లారీ తీసుకుని వెళ్లిపోతాడు బాబ్జి.
అమర్‌ను రెడీ చేసి ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో చెప్తుంది. అలాగే జాగ్రత్తలు చెప్తుంది. మీకు ఏ అవసరం వచ్చినా అత్తయ్యను పిలవండి.. నేను గుడికి వెళ్లగానే మీకు ఫోన్ చేస్తాను అంటూ మిస్సమ్మ వెళ్లిపోతుంటే.. అమర్ చేయి పట్టుకుని కూర్చో అంటాడు. మిస్సమ్మ కూర్చోగానే.. నేను బాగానే ఉంటాను నాకు ఏ అవసరం రాదు. వచ్చినా చూసుకోవడానికి ఇంట్లో చాలా మంది ఉంటారు. నువ్వు ప్రశాంతత కోసం గుడికి వెళ్తున్నావు కదా..? ఈ ఆలోచనలు అన్ని ఇక్కడే పెట్టి ప్రశాంతంగా వెళ్లి రా అని చెప్తాడు అమర్. ఇంతకీ ఎలా వెళ్తున్నావు అని అడగ్గానే నడుచుకుంటూ వెళ్తాను అని మిస్సమ్మ చెప్తుంది. సరే వెళ్లు అని చెప్పి అలాగే మిస్సమ్మ చేయి పట్టుకుంటాడు అమర్. బయలుదేరమని చెప్పి ఇలా చేయి పట్టుకుంటే ఎలా వెళ్లాలి అని అడుగుతుంది మిస్సమ్మ. అమర్ చేయి వదలగానే జాగ్రత్తగా వెల్లి రా అంటాడు అమర్. మిస్సమ్మ వెళ్లిపోతుంది.
కింద మనోహరి, మిస్సమ్మ కోసం వెతుకుతుంటే.. మిస్సమ్మ వచ్చి నా కోసమే ఎదురు చూస్తున్నావా..? అని అడుగుతుంది. దీంతో ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు చావడానికి చాలా తొందరపడుతున్నావు అని మనసులో అనుకుని నీ కోసం నేనెందుకు చూస్తాను అంటుంది. ఇంతలో నిర్మల, శివరాం వచ్చి రాథోడ్ వచ్చాక వెళ్లొచ్చు కదా అని చెప్తారు. వద్దులే అని మిస్సమ్మ వెళ్లిపోతుంది.
గార్డెన్‌లో కూర్చున్న ఆరు ఆనందంతో మిస్సమ్మను మెచ్చుకుంటుంది. తను బంగారం అంటూ పొగడ్తలతో ముంచేస్తుంది. ఇంతలో గుప్త వచ్చి ఆశ్చర్యపోతాడు. నీ సోదరి నీకన్నా గొప్పదని నువ్వే మెచ్చుకుంటున్నావా..? అని అడుగుతాడు. ఇంతలో మిస్సమ్మ బయటకు రావడంతో ఆరు చాటుకు వెళ్తుంటే.. మిస్సమ్మ ఆరును పిలుస్తుంది. మీరు కూడా నాతో పాటు గుడికి రావొచ్చు కదా అని పిలుస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?