Gundeninda GudiGantalu Today episode December 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం మీనా త్వరగా లేచి.. వంటలన్నీ పూర్తి చేస్తుంది. ప్రభావతి వచ్చి తనకు కాఫీ కావాలని అడుగుతుంది. కాఫీ ఎప్పుడో చేసి అక్కడ పెట్టానని అంటుంది మీనా. వంటలను చూసి తొందరగానే ప్రిపేర్ చేశావ్.. ఈరోజు కూరల్లో ఏం వేసావ్ అంటూ మీనాను ప్రభావతి హేళన చేస్తుంది. దానికి మీనాక్షికి మండుతుంది.. ఇంటిల్లిపాదిని పిలిచి.. తాను చేసిన కూరలను చూపిస్తుంది. ఇంట్లో ఒక మామ తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడుతుంది. నేను బయటకు వెళ్తున్నాను అనేసి అనగానే ప్రభావతి ఎక్కడికి వెళ్తున్నావ్ రోజు ఇదే పనా అని అడుగుతుంది. కార్తీక మాసం కదా గుడికి వెళ్తే పూజారి మంచిదని చెప్పారు.. దానికి ప్రభావతి కౌంటర్ వేస్తుంది. రోజు గుడికి వెళ్తున్నావ్ ఏం కోరుకుంటున్నావు అని రోహిణి ప్రభావతి అడుగుతారు. రోజు గుడికని చెప్పి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుందో అనేసి ప్రభావతి అనగానే సత్యం ఎప్పుడు నీకు అనుమానమేనా అనేసి అంటాడు. ఫైనాన్సియర్ ఇంటికి ఫేషియల్ చేయడానికి రోహిణి వెళుతుంది. ఇంతలోనే మీనా కూడా ఫైనాన్సియర్ ను కలవాలని వెళ్తుంది. తన భర్తకు కారు ఇమ్మని, కారు లేక ఆయన చాలా కష్టపడుతున్నారని, చాలా అనుమానాలు ఎదుర్కొంటున్నాడని మీనా బాధపడుతుంది. రోహిణి ఆ విషయాన్ని ఇంట్లో చెప్తుంది. ప్రస్తుతం మీ బాలుకి ఏ ఉద్యోగం లేదని, డ్రైవర్ పని చేస్తున్నానని ప్రతి రోజు అబద్ధం చెప్తున్నాడు. మీనా దానికి కోపడుతుంది. ఆయన ఏమైనా లక్షలు దోచుకున్నారా.. ఇల్లు తాకట్టు పెట్టారా.. అంటూ మీనా నిలదీస్తుంది. దీంతో సత్యం మాట్లాడుతూ ఇక చాలు అందరూ సైలెంట్ గా వెళ్లిపోండి అని వార్నింగ్ ఇస్తాడు. బాలు రూమ్ లోకి వెళ్లగానే మీనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు ఫైనాన్షియల్ దగ్గరికి ఎందుకు వెళ్లావు? అంటూ నిలదీస్తాడు. అయినా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్లాలని అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక బాలు రూమ్ లో మీనాను తిడతాడు. పెళ్ళాం చేత చెప్పించాడు.. ఎదవ అని వాడు ఊరంతా చెప్పుకుంటాడు. నీకు సంతోషమా అంటాడు. దాన్ని బయట నుంచి బాలు సత్యం వింటాడు. అవును తప్పు చేసేటప్పుడు లేని పౌరుషం ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇక్కడ మీకు మీరే గొప్ప అనుకుంటున్నారు అని మీనా కడిగిపడేస్తుంది.. మీకు ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ లేనంత పౌరుషం ఉంది కాదా.. మీరెందుకు అడుగుతారు.అవసరమైతే పల్లెటూర్లలో చెరువులలో బర్లు తోముతారు. ఎవరేమన్నా వారి కార్లను కడుగుతారు. మీ జీవితంలో మీరు ఎన్నడైనా దొంగతనం చేశారా? అలా పరాయి వాళ్ళు మీపై దొంగతనం నింద వేస్తే మీరు సైలెంట్ గా ఉన్నప్పుడైనా నా మనసు చచ్చిపోయింది.. అప్పుడు నోరు మెదపరు కదా అని అడుగుతుంది. అసలు వాడిని నేను క్షమించమని అడగను.. అసలు వాడు నన్ను ఎమన్నాడో తెలుసా అని నేను డబ్బులు ఇచ్చినా మీ నాన్న చనిపోతే నాకు డబ్బులు ఎవరిస్తారు అని అడిగాడు అందుకే వాని కొట్టాను. ఇప్పుడు చెప్పు నేను వెళ్లి వారిని క్షమాపణలు అడగాలా అనేసి మీనా అని అడుగుతాడు బాలు. మీనా ఈ విషయం నాకు చెప్పలేదు కదా ఇంటి పత్రాలు గురించి పదేపదే నాకు చెప్తుంటారు మరి ఈ విషయాన్ని ఎందుకు నాకు చెప్పలేదు అనేసి అంటుంది. వాడు అలా అన్నప్పుడు నేను మీ పక్కన ఆ టైంలో నేను ఉంటే చెప్పేదాన్ని అని అంటుంది. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు అనవసరంగా నా విషయాలలో జోక్యం చేసుకోకంటూ బాలు సలహా ఇస్తాడు. ఈ విషయాన్ని బయట ఉన్న సత్యం వింటాడు. ఇక ప్రభావతితో ఈ విషయం గురించి మాట్లాడతాడు..
ప్రభావతిని పిలిచి తాను ఇంటి కాగితాలను తాకట్టు పెట్టాలని భావిస్తున్నానని, బాలుకి మంచి జీవితం ఇవ్వాలని, వాడు తనకోసం కారును అమ్మేసుకున్నాడని, ఇప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నాడు. ఇల్లు కాగితాలను తాకట్టు పెట్టి.. కారు తీసుకోవాలని భావిస్తున్నానని చెప్తాడు.. ఆ మాటకు ప్రభావతి ఒప్పుకోను అంటుంది. వాడికి ఎంత చేసిన ప్రయోజనం లేదని వాదిస్తుంది. దీంతో సత్యంకు కోపం వస్తుంది. ఒక్కసారి మనసుపెట్టి ఒక తల్లిగా ఆలోచించని ప్రభావతికి చెప్తాడు. అయితే తాను కూడా ఆపరేషన్ సమయంలో తాను కూడా నగలను ఇచ్చానని, వాటిని కూడా విడిపించమని చెబుతుంది. దానికి సత్యం ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బాలు చాలా పొద్దెక్కిన లేవడు. దీంతో బాలుని మీనా ఆట పట్టిస్తుంది. బాలు గుంజుకోవడంతో మీనా బాలు పై పడుతుంది. ఇక బాలు నీ ముఖం చూసాను కదా ఇక నా పని అయినట్లే అంటాడు. దానికి మీనా నా మొహం మంచిదే గుళ్లో పెళ్లిళ్లు జరిగితే నాకైతే దండలు విప్పించే వాళ్ళు తెలుసా అంటుంది.
బాలు టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. మీనా అతనికి టిఫిన్ వడ్డిస్తుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి.. మిగతా వాళ్ళకి ఉందో లేదో.. చూసుకుంటూ వడ్డించు.. మొత్తం వాడికే వడ్డించకంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. అందుకే తాను కార్లకున్న దుమ్ము కడగడానికి వెళ్తున్నానని, ఇలాంటి మాటలు తనకు పడడం ఇష్టం లేదని అంటాడు. ఈ సమయంలో ప్రభావతి.. ఏం చేస్తున్నావ్ అంటూ రోహిణి తో మాట్లాడుతుంది. తాను అకౌంట్స్ చూస్తున్నానని, రేపు మేడం వస్తుందంటూ రోహిణి నోరు జారుతుంది. నువ్వే కదా పార్లర్ కు మేడం.. మళ్లీ మేడం అంటున్నావు అని అడుగుతుంది ప్రభావతి. మేడం అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అని, ఆమె వచ్చి ఆడిటింగ్ చేస్తుందంటూ కవర్ చేస్తుంది. దీంతో ప్రభావతి.. నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారు అంటుంది. దీంతో రోహిణి కూడా షాక్ అవుతుంది. అలా అంటున్నారేంటీ.. మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా అని ప్రశ్నిస్తుంది. అవును మనోజ్ కూడా చేస్తున్నాడని ప్రభావతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..