Wife Chops Husband body| ఆస్తి కోసం భర్తతో గొడవపడి అతడిని ఓ మహిళ హత్య చేసింది. ఆ తరువాత భర్త శవాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేసింది. భర్త బ్రతికే ఉన్నట్లు పొరుగువారు, స్నేహితుల ముందు నాటకమాడింది. అయినా చివరికి పోలీసులు చేతికి చెక్కింది. ఈ ఘటన ఆస్ట్రేలియా దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఈజిప్ట్ దేశానికి చెందిన మమదో నౌఫిల్ (62), అతని భార్య నిర్మీన్ నౌఫిల్(53) ఆస్ట్రేలియాలో ఫేమస్ నగరమైన సిడ్నీలో చాలా కాలంగా నివసిస్తున్నారు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సిడ్నీ నగరంలోని గ్రీన్ ఎకర్ ప్రాంతంలో వారికి సొంతంగా ఒక ఇల్లు ఉంది. అయితే మమదో నౌఫిల్ కనిపించడం లేదని 2023లో అతను పనిచేసే ఆఫీసు యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులో కీలక దస్తావేజులు మమదో నౌఫిల్ వద్ద ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు మమదో నౌఫిల్ మిస్సింగ్ కేసుని నమోదు చేశారు. అతని ఇంటికి వెళ్లి విచారణ చేయగా.. అతని భార్య నిర్మీన్ నౌఫిల్ తన భర్త ఇటీవలు ఈజిప్ట్ వెళ్లాడని చెప్పింది. కానీ మమదోని చాలాకాలంగా చూడలేదని అతని స్నేహితులు, ఇరుగుపొరుగు వారు చెప్పారు. వారి ఇంటి సమీపంలో ఉండే ఒక వ్యక్తితో మమదో తరుచూ మాట్లాడేవాడని.. కానీ అతను కూడా మమదోని చాలాకాలంగా చూడలేదు. చాలా రోజులుగా మమదో లేకుండానే అతని భార్య, పిల్లలు కనిపిస్తున్నారని పోలీసులకు చెప్పాడు. ఇదే విషయం మమదో స్నేహితులు కూడా చెప్పారు.
అయితే మమదో సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఇప్పటికీ మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. దీంతో పోలీసులు మమదో బతికే ఉన్నట్లు భావించి అతని కోసం వెతకం ప్రారంభించారు. మమదో సోషల్ మీడియా అకౌంట్ మెసేజ్‌లు అతని ఇంట్లోని కంప్యూటర్ నుంచే వస్తున్నాయని తెలిసి మమదో ఇంటిని తనిఖీ చేశారు. ఇంట్లో అతని కంప్యూటర్ చెక్ చేయగా.. అందులో నుంచే మెసేజ్ లు పంపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు మమదో భార్య నిర్మీన్ పై అనుమానంతో విచారణ చేశారు.
Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్
మమదోని చివరిసారిగా మే 2023లో చూసినట్లు అతని స్నేహితులు చెప్పారు. దీంతో పోలీసులు మమదో ఇంటి సమీపంలోని అన్ని సిసిటీవి వీడియోలలో మే నెల రికార్డ్ వీడియోలు పరిశీలించారు. దీంతో అసలు నిజం బయటపడింది. మమదో భార్య తన కారులో అతి కష్టంగా ఏవో బ్యాగులు తీసుకెళ్లి దూరంగా పడేస్తున్నట్లు కనిపించింది. అంతకు ముందు రోజు ఉదయం వరకు మమదో తన ఇంట్లోనే ఉన్నాడు. ఆ తరువాత ఇంటి నుంచి బయటికి మమదో రాలేదని పోలీసులు కనిపెట్టారు. దీంతో మమదో భార్యను అరెస్ట్ చేసి మమదో ఎక్కడని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు నిర్మీన్ చెప్పింది విని పోలీసులు ఆశ్చర్య పోయారు.
మమదో కొన్ని నెలల క్రితం ఈజిప్ట్ వెళ్లాడు. అక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలిసిపోయింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒక రోజు రాత్రి భార్యాభర్తలిద్దరూ బాగా గొడవపడ్డారు. ఆ తరువాత నిద్రపోతున్న మమదో తలపై నిర్మీన్ దాడి చేసి అతడిని హత్య చేసింది. ఆ తరువాత ఇంట్లోని చైన్ సా (చెక్క కోసే యంత్రం)తో మమదో శవాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి ఆ ముక్కలు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వేర్వేరు ప్రాంతాలలో వాటిని చెత్తలో పడేసింది.
ఆ తరువాత మమదో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అతని స్నేహితులు, ఈజిప్ట్ లో ఉన్న అతని రెండో భార్యను సంప్రదించింది. ఆమె గురించి సమాచారం అంతా సేకరించి ఒకరోజు ఈజిప్ట్ కు కూడా వెళ్లి.. అక్కడ మమదో ఆస్తులన్ని అమ్మేసి 2 లక్షల డాలర్లు తీసుకొని ఆస్ట్రేలియా తిరిగి వచ్చేసింది.
మమదో హత్య కేసులో అక్టోబర్ 2024లో నిర్మీన్ ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో సమర్పించారు. కోర్టులో నిర్మీన్ తరపున లాయర్ వాదిస్తూ.. మమదో చాలా కాలంగా తన భార్యను కొడుతూ హింసించేవాడని.. దీంతో ఒక రోజు నిర్మీన్ తన భర్తను హత్య చేసిందని చెప్పాడు. తన భర్త చిత్రహింసల కారణంగా నిర్మీన్ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపాడు. కోర్టు నిర్మీన్ కు వైద్య పరీక్షులు చేయాలని ఆదేశిస్తూ.. ఆమెకు బెయిల్ నిరాకరించింది. ఈ కేసుని డిసెంబర్ 2024 నెల చివరి వారానికి వాయిదా వేసింది.