Gundeninda GudiGantalu Today episode February 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాకు ఇంట్లో వాళ్ళు పని చెప్పడం సహించలేని బాలు తన కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాడు. అందుకే మీనాకు బిగ్ సర్ ప్రైజ్ ఇస్తాడు. అది చూసిన ప్రభావతి కోలుకోలేని దెబ్బ తగుతుంది.. మొత్తం ప్లాన్ ప్రకారమే మీనా కోసం ఇంటి ముందు పూల కొట్టు ఏర్పాటు చేస్తాడు బాలు. పూల కొట్టుకు తల్లి ప్రభావతి పేరునే పెట్టి ఆశ్చర్యపరుస్తాడు. పైగా చిన్న కోడలు శృతితో రెబ్బన్ కట్ చేయించి.. అందుకు డబ్బులు కూడా ఇచ్చి అవమానిస్తాడు. అసలు పూలకొట్టు పెట్టడానికి కారణమే శృతికి బుద్ధి చెప్పడానికి అని తన మనసులోని మాటను కూడా బయటపెడ్తాడు. దాంతో ఇంట్లో ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది.. శృతి బాలు పై కోపంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అందరి ముందు బాలు చేసిన పనికి శృతి కోపంగా ఉంటుంది రవి పై ఆ కోపాన్ని చూపిస్తుంది. కావాలని నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఏం తక్కువ చేసానని ఇలా అన్నాడు మీ నాన్న సొంత అక్క లాగా భావించాను కాబట్టి నేను డబ్బులు ఇచ్చాను కానీ ఇలా నాకు డబ్బులు ఇవ్వడం ఏమైనా బాగుందా? ఇక ముందరదా అతని సంగతి నేను చూసుకుంటాను అతను ఎలా దారిలోకి పెట్టాలో నాకు బాగా తెలుసు అని శృతి అంటుంది. ఇక తర్వాత మీనా, బాలు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక ఈ జీవితం అంతా వంట రూమ్‌కే పరిమితమా అని భాద పడ్డాను .. నా మీద నాకు నమ్మకం పెరిగింది. దీనంతటి కారణం మీరేనండి.. ఆ పూల కొట్టు పెట్టించడమే కారణం’ అంటుంది మీనా సిగ్గుపడుతూ బాలుతో. ‘అయినా ఇప్పుడు ఏమైంది? ఇది ప్రారంభం మాత్రమే.. మన పూల వ్యాపారాన్ని ఎలా డెవలప్ చెయ్యాలని ఆలోచిస్తుంటాడు బాలు. మన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు కావాలి అప్పుడే మనం లాభం లోకి వస్తాం మన కష్టాలన్నీ తీరిపోతాయి మనల్ని ఎవరు ఏ మాట అనరు కూడా అని బాలు మీ నాకు హితబోధ చేస్తాడు. ఇక మీనా కూడా అవునండి నేను కష్టపడే చేస్తాను మనం ఈ వ్యాపారాన్ని ఇంకాస్త మెరుగ్గా ఎలా చూసుకుంటాను అని మీనా భరోసా ఇస్తుంది.
ఆ తర్వాత నేనెప్పుడూ వంటగదికే అంకితం అని చాలా ఫీలయ్యాను కానీ మీరు నాకు ఆ బాధను పోగొట్టారని మీనా బాలు పై ప్రేమను కురిపిస్తుంది. మీరు నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలను అనిపిస్తోంది.. అంటుంది మీనా నవ్వుతూ. ఇక బాలు కూడా ఆ మాటకు సంబరపడిపోతాడు. వెంటనే మీనా భర్తతో.. అయ్యో అసలు విషయం మరిచిపోయాను.. మీరు కళ్లుమూసుకోండి.. అనడంతో బాలు కళ్లుమూసుకుంటాడు. ఇప్పుడు కళ్లు తెరవండి. నాకు ఇంత మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కదా మీకు కూడా నేను సర్ప్రైజ్ చేయాల్సిందే అని ఒక రోస్తో ప్రపోజ్ చేస్తుంది. ఇది చూసిన బాలు సంతోషంతో పొంగిపోతాడు. మీనా ఎక్కడ తల్లి అవుతుందోనని. ఉన్న ఆర్థిక కష్టాలు చాలక ఇప్పుడు పిల్లల ఖర్చు నేనెక్కడ భరించాలి? అన్నట్లుగా ఆలోచిస్తుంటాడు బాలు. అందుకే గతంలో బాలు ఓ కల కని.. అందరి పొట్టలు చెక్కలు చేశాడు. ఒకే కాన్పులో నలుగురు పిల్లలను మీనా కన్నట్లు.. వీళ్లందరినీ నేనెక్కడ పెంచాలిరా దేవుడా? అని కలలోంచి ఉలిక్కిపడి లేచి, బాలు లబోదిబోమనడం నాటి కథనంలో ఫుల్ కామెడీని పంచింది. అక్కడితో ప్రోమో కట్ అవుతుంది. ఏది ఏమైనా కూడా పని నుంచి బయటపడేసిన బాలు కోసం మీనా పరితపిస్తుంది. తనకోసం రెయిన్బోలు బాలు కష్టపడుతున్నాడు అని భావిస్తున్న మీనా ఆర్థిక కష్టాల నుంచి బయట పడేసేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే బాలు కి డబ్బులు విషయంలో అండగా నిలబడాలని మీనా అనుకుంటుంది. బోతి మాత్రం ఎప్పుడూ మీనా చేస్తున్న పని తప్పు అంటూ కుళ్ళుకుంటుంది. ఇక మీనా పూలకొట్టు దగ్గర ఉంటే ప్రభావితం వంటింటికీ అంకితమయ్యేలా కనిపిస్తుంది.. శృతి కూడా మీనా కి సపోర్ట్ గా నిలుస్తుంది. సత్యం మీనాకు కావలసిన పూలను అందిస్తూ ఉంటాడు. మొత్తానికైతే మీనా కష్టాలు గట్టెక్కినట్లే అని తెలుస్తుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య దూరం దగ్గర అవుతుందేమో చూడాలి.