Pawan Kalyan:గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. అయితే సడన్గా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లో బెడ్ పై పడుకున్న ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కలవరపడుతున్నారు. ఒక హీరో గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా చలామణి అవుతున్న ఆయన ఇలా సడన్గా హాస్పిటల్ బెడ్ పై కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు ఏమైంది? ఎందుకు ఆయన హాస్పిటల్ బెడ్ పై అలా పడుకొని ఉన్నారు? అంటూ పలు రకాల ప్రశ్నలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను జనసేన పార్టీ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. “ఈరోజు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ , తదితర పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత వైద్యులు ఆయన ఆరోగ్య నిమిత్తం సూచనలు కూడా చేశారు.. మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నెలా చివరినా లేదా మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలియజేశారు. ఇక ఆయన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. 24వ తేదీ నుంచి మొదలయ్య బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు” అంటూ అధికారికంగా రాసుకొచ్చారు.
ఆరోగ్యం నిలకడగానే ఉంది..
ఇక మొత్తానికి అయితే అభిమానులు కంగారు పడాల్సిన పని ఏమీ లేదని, సాధారణ ఆరోగ్య పరీక్షల ఆయన నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో ఆరోగ్యం జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై చికిత్స చేయించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Shruti Hassan: ఎట్టకేలకు ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన శృతి.. ఏమన్నదంటే..?
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మరొకవైపు అభిమానులను అలరించడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూడు సినిమాలను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్, OG వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్లను కంప్లీట్ చేసి ఇక శాశ్వతంగా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారట పవన్ కళ్యాణ్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ (Akira Nandan).. పవన్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ (Trivikram ) వారసుడైన రిషి మనోజ్ (Rishi Manoj) దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఏది ఏమైనా అటు త్రివిక్రమ్ వారసుడు ఇటు పవన్ కళ్యాణ్ వారసుడు ఇద్దరు ఒకే టైంలో ఒకే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేయడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆ సందర్భం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.