BigTV English

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్..మీనాకు నిజం చెప్పిన బాలు.. ప్రభావతి పై సత్యం సీరియస్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్..మీనాకు నిజం చెప్పిన బాలు.. ప్రభావతి పై సత్యం సీరియస్..

Gundeninda GudiGantalu Today episode july 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో ఈ గొడవలు ఎలా ఉన్నా సరే రవి నీ భర్త. ఆ విషయం గురించిన ఆలోచించు శృతి అని మీనా చెప్పి వెళ్తుంది. బాలు రవి దగ్గరికి వెళ్తాడు. రెస్టారెంట్ కి వచ్చి ఎక్కడ కొడతాడు అని రవి లోపలికి వెళ్తాడు. బాలు మాత్రం రవి వెనకాల వెళ్లి రవితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు.. అయితే రవి ఫ్రెండ్ రవి ఇక్కడే ఉంటున్నాడు అన్న విషయాన్ని చెప్తాడు. నీ భార్యను తెలివిగా అక్కడ లాక్ చేశారు నువ్వు కూడా అక్కడే ఉండిపోతావు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇల్లరికం అల్లుడు లాగా అక్కడే ఉంటావా నువ్వు అని బాలు రవికి క్లాస్ పీకుతాడు.శృతికి భోజనం వచ్చిందని మేనేజర్ చెప్పడంతో బయటకు వచ్చి భోజనం తినడానికి కూర్చుంటుంది. అదేంటి నువ్వు తీసుకొచ్చావు నేను ఆర్డర్ చేసింది హోటల్ కి కదా అని శృతి రవిని చూసి అంటుంది. నువ్వు ఆర్డర్ చేసింది నాకోసమే అని నాకు తెలుసు అందుకే నేనే స్వయంగా చేసి మరి తీసుకుని వచ్చాను అని అంటాడు. హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే డైరెక్ట్ గా చెఫ్ తీసుకొని వచ్చి వడ్డిస్తాడా అని వెటకారంగా మాట్లాడుతుంది.. మొత్తానికి శృతి, రవి కలిసిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు బిర్యాని తీసుకొని వచ్చి అందరిని తినమని అంటాడు. ప్రభావతి మాత్రం రవి లేకుండా నేను అసలు తినను అని అంటుంది. అయితే బాలు మీకు ఒక నిజం చెప్పాలి ఇది అమ్మానాన్న తినలేదంటే రవిని స్వయంగా వంట వండి తీసుకొని వచ్చాడు. మిగతా హోటల్ ఎవరైనా బకెట్లో పెట్టిస్తారా వాడు కాబట్టి చేసి పంపించాడు అని అంటాడు. మాట వినగానే ప్రభావతి రవి పంపించాడా వాడే తీసుకురావచ్చు కదా అని అంటుంది. వాళ్ళ ఆవిడని తీసుకొని వస్తాడట నేను వెళ్లి మాట్లాడాను అని అంటాడు. అందరూ కలిసి బిర్యానిని ఓ పట్టు పడతారు. బిర్యానీ చాలా బాగుంది రవి గాడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని ప్రభావతి బిర్యానిని ఎప్పుడు తిననట్లు తినేస్తుంది. మనోజ్ కూడా బిర్యానీ చాలా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ తినేస్తాడు. మీనా నువ్వు కూడా తిను అనేసి అంటుంది ప్రభావతి. భోజనం చేసిన తర్వాత రోహిణి దగ్గరికి వెళ్లి మీ నాన్న ఎక్కడ అని అడుగుతుంది. రోహిణిని నాలుగు చెరువుల నీళ్లు తాగిస్తుంది..

అసలు మీ నాన్న ఉన్నాడా లేదా మలేషియా నుంచి ఫ్లైట్లో బయలుదేరాడు అన్నావు గాల్లో అలానే ఎగిరిపోయాడా.. కనీసం కూతురికి పెళ్లి అయింది అని ఆయనకు ఉందా..? బిజినెస్ లు మీటింగులు ఫారిన్ టూర్లు అంటూ నువ్వు ఏదో ఒక సాకు చెప్తున్నావు. అసలు మనోజ్ కి అత్తిళ్ళు ఉందా లేదా నువ్వు నాటకం మొదలు పెడుతున్నావా అని అడుగుతుంది.. నీకు నాన్న ఉన్నాడా ఇది కూడా కొత్త నాటకమా అని ప్రభావతి రోహిణికి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. అసలు కన్న కూతురు పెళ్లి అవుతుంటే ఏ తండ్రి అయినా రాకుండ ఎలా ఉంటాడు. కానీ మీ నాన్న మాత్రం రాలేదు. ఇప్పటికైనా వస్తున్నాడా అంటే అది కూడా లేదు.


శృతి లేచిపోయి పెళ్లి చేసుకుంది. వాళ్ళ అమ్మ నాన్న అన్ని మరిచిపోయి కూతురు సంతోషం కోసం వాళ్ళ అమ్మ నగలు తెచ్చి ఇచ్చింది. వాళ్ల నాన్న ఏమో లక్షలు ఖర్చుపెట్టి ఫంక్షన్ చేశాడు. మీ నాన్న ఏం చేశాడు. పూలు అమ్ముకొనే మీనాకు పుట్టిల్లు ఉంది. వాళ్ళ అమ్మకు తినడానికి గతిలేకపోయినా సరే అల్లుడ్ని పండక్కి పండక్కి పిలిచి బట్టలు పెట్టి ఉంగరం కూడా పెట్టి పంపించింది. నేను పుస్తెలతాడు తీసుకుంటే ఆమె పుస్తెలతాడు చేయించి మరీ తీసుకచ్చి ఇచ్చింది. తిండికి గతిలేని మీనా కూడా పుట్టిల్లుంది ఆమెకు పోరుచుముంది మరి మనోజ్ కి అత్తిల్లు ఉందా లేదా అని గట్టిగా అరుస్తుంది.

ప్రభావతి కోపాన్ని చూసిన రోహిణి మా నాన్న ఎందుకలా చేస్తున్నాడో నాకు తెలియదు అత్తయ్య. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఆయన అలా చేయడానికి కారణం ఏంటో నాకు కూడా తెలియదు అని రోహిణి ప్రాధేయపడుతుంది. నీ నాటకాలు ఆపు ఇకనైనా మీ నాన్న రాకపోతే నీ స్థానం ఎక్కడుంటుందో నువ్వు ఊహించలేవు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ప్రభావతి. బాలు కోసం మీనా జిలకర నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది.

నాకు ఒక నిజం చెప్పండి బిర్యానీ నిజంగానే రవి చేసి పంపించాడా అని అడుగుతుంది. లేదు అమ్మ నాన్న తినలేదు కదా.. నాన్న తినకపోతే నేను కూడా తినలేను అని అబద్ధం చెప్పాను అంటాడు. నాన్నంటే మీకు ఇష్టమే అంతే కాదు మీ అమ్మంటే కూడా మీకు ఇష్టమే అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. చిన్నప్పుడు మా బామ్మ ఎన్ని తిడితే అవన్నీ ఆశీర్వాదాలు అని చెప్పింది అలానే నేను మా అమ్మ తిట్లు ఆశీర్వాదాలుగా ఫీల్ అవుతున్నాను అని అంటాడు. మీ అమ్మంటే మీకు ఎంత ప్రేమ అది మీ మాటల్లో చెప్పలేరు అని మీనా అంటుంది..

రోహిణి ప్రభావతి అన్న మాటలు గురించి విజ్జి దగ్గర చెప్తుంది. మా అత్త ఈసారి సహించేలా లేదు కచ్చితంగా మా నాన్న వస్తేనే ఆ ఇంట్లో నన్ను ఉండనిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. కొత్త మామయ్య వచ్చినట్టు కొత్త నాన్నను కూడా మనం క్రియేట్ చేసి చెబుదామా అని విజ్జి అంటుంది. మా అత్త మా నాన్న కోసం కాదు మా నాన్న తెచ్చే ఆస్తి కోసం ఎదురుచూస్తుంది అని రోహిణి అంటుంది.. కొత్త వాళ్ళది కాదు పాత వాళ్లతోనే ఈ నాటకాన్ని ముగించాలి అని రోహిణి అంటుంది. మాణిక్యాన్ని ఒకసారి పిలువు ఆయనకు మొత్తం చెప్పి నాన్న మేటర్ ని క్లోజ్ చేద్దామని రోహిణి అంటుంది.

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి రియల్ లైఫ్ లో ఏం చేస్తుందో తెలుసా..?

మటన్ మాణిక్యం ఇంటికి రాగానే హడావిడి చేస్తాడు. బాలు ఆయనతో ఒక ఆట ఆడుకుంటాడు. ఏమైందండీ ఎందుకట హడావిడి చేస్తున్నారంటే రోహిణి వాళ్ళ నాన్నను పార్ట్నర్స్ మోసం చేసి కోట్లు దోచుకున్నారు. మేక కూడా హాని కలిగించని ఆయనను తన పార్టనర్స్ డబ్బులు లాగేసుకుని జైలుకు పంపించారు అని చెప్తాడు. ఆ మాట వినగానే రోహిణి కెవ్వుమని అరుస్తుంది. ఆస్తులు కూడా రావు ఆయన వచ్చేంతవరకు అని మాణిక్యం చెప్పడంతో ప్రభావతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.. అయితే సత్యం మనిషి జైల్లో ఉంటే ఆస్తులు అంటావేంటి అని ప్రభావతికి క్లాస్ పీకుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Brahmamudi Serial Today September 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఒకరి గోడు ఒకరికి చెప్పుకున్న అపర్ణ, ధాన్యలక్ష్మీ – నవ్వుకున్న ఇంద్రాదేవి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..

Tv Serial Actress : తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న  హీరోయిన్స్ రియల్ ఏజ్ ఎంతో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..

Big Stories

×