Illu illaalu Pillalu Srivalli : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇందులో కుటుంబ విలువల గురించి ఒక తండ్రి తన కొడుకులకు ఎలా చెప్తాడు? తన ఫ్యామిలీని ఎలా ముందుకు నడిపిస్తాడు? అనే స్టోరీతో సీరియల్ సాగుతుంది.. ఈ సీరియల్ లో అందరూ ఒకతాటిపై నిలబడితే.. పెత్తనం కోసం పోరాడే పెద్ద కోడలు పాత్రలో శ్రీవల్లి నటిస్తుంది. శ్రీవల్లి అసలు పేరేంటి? గతంలో ఆమె నటించిన సీరియల్స్? ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది? అన్నది వివరంగా తెలుసుకుందాం..
‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి..
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డైలీ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఇందులో వీళ్లకి ఐదుగురు పిల్లలు. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు.. అంతేకాదు మరో ఇద్దరు కోడళ్లు నర్మద, ప్రేమలు ఉన్నారు. ఆమని తమ్ముడు తిరుపతి కూడా అదే ఇంట్లో ఉంటాడు. ఇది హీరోగారి ఫ్యామిలీ కాగా.. విలన్ ఫ్యామిలీ అంటే భద్రవతి ఫ్యామిలీలో చాలామందే ఉన్నారు. భద్రవతి, సేనాపతి, రేవతి, విశ్వ, శారదాంబ ఇలా చాలామందే ఉన్నారు.. వీళ్లకు తోడుగా రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి ఫ్యామిలీ కూడా వచ్చి చేరింది. ఇంట్లో పెత్తనం అంతా తనదే కావాలని చూస్తుంది. అయిందానికి కానీ దానికి ఆమె పుల్లలు పెట్టి అందరికి చివాట్లు తినిపిస్తుంది.. ఇంట్రెస్టింగ్ క్యారక్టర్ ఇదే…
Also Read : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ..
శ్రీవల్లి బ్యాగ్రౌండ్..
ఈ అమ్మడు అసలు పేరు త్రివేణి యాదవ్.. జెమినీ టీవీలో ప్రసారం అయిన సుందరి సీరియల్ హీరోయిన్ త్రివేణి. ఈమె పూర్తి పేరు త్రివేణి యాదవ్ . జీ తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేసింది. సప్తగిరి ఎల్ ఎల్ బీ, మిడిల్ క్లాస్ మెమొరీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ తదితర చిత్రాల్లో నటించారు. జబర్దస్త్, ఢీ షో వంటి షోలలో కూడా మెరిసింది.. ఈమె స్వస్థలం గుంటూరు అయిన సెటిల్ మాత్రం వైజాగ్ లో.. వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. సినిమాలపై ఉణ్న ఆసక్తితో ఇలా బుల్లితెరతో పాటు వెండితెరపైన మెరుస్తోంది.. ఈమెకు ఒక్కరోజుకు 15 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మొత్తానికి సీరియల్ ద్వారా లక్షలు సంపాదిస్తుంది. ఈ మధ్య ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయ్యింది. దాంతో నెక్స్ట్ సీరియల్స్ కు రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పానక్కర్లేదు. లేటెస్ట్ ఫొటోలతో ట్రెండింగ్ లో ఉంటుంది.. సీరియల్లో పద్దతిగా ఉంటున్న ఈమె, బయట మాత్రం చాలా హాట్ గా కనిపిస్తుంది. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువే..