Gundeninda GudiGantalu Today episode july 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి అత్త గండం నుంచి సేఫ్ గా బయట పడుతుంది. ఇక హ్యాపిగా ఉండొచ్చు అని అనుకుంటుంది. కానీరోహిణి దగ్గరికి దినేష్ వెళ్తాడు. నా భార్య పిల్లలు దూరం అవడానికి కారణం నువ్వే.. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక లక్ష రూపాయలు డబ్బులు అవసరం అవుతాయి. నువ్వు ఇస్తే ఓకే లేదంటే నీ గుట్టు మీ ఇంట్లో వాళ్లకి తెలిసేలా చేస్తాను కళ్యాణి అని అంటాడు. అప్పుడే పార్లర్ కి మనోజ్ రావడం చూసి రోహిణి అలాగే ఇస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది. రోహిణి దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి కెనడాకు వెళ్లడానికి అని అడుగుతాడు. మాట వినగానే రోహిణి సీరియస్ అయ్యి మీ అమ్మానాన్న అడుగు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నీకు ఇస్తారు అని సలహా ఇస్తుంది. అనూస్ ఇంటికి రాగానే సత్యం ను ప్రభావతిని ఆ విషయాన్ని అడగడాలని అనుకుంటాడు. బాలు మనోజ్ పై సెటైర్లు వేస్తాడు. నేను కెనడా కి వెళ్లాలంటే 14 లక్షలు కావాలి. అది మీరు ఇస్తానంటే నేను వెళ్ళిన తర్వాత మొత్తం డబ్బుల్ని పంపించేస్తాను ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని మనోజ్ అంటాడు.. ప్రభావతి మాత్రం మనోజ్ కి డబ్బులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నీ చదువుల కోసం ఇప్పటికే చాలా అప్పులు చేశాడు మీ నాన్న.. ఇకమీదట ఒక్క రూపాయి కూడా నీకు ఇచ్చేది లేదు అని ప్రభావతి అనగానే మనోజ్ షాక్ అవుతాడు.. బాలు కూడా ఏంటి మా అమ్మ మనోజ్ కి డబ్బులు ఇవ్వనంటుందా అంటూ షాక్ లో ఉండిపోతాడు. ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అని మీనా అంటే.. మనోజు సీరియస్ గా మీనా పై అరుస్తాడు. ఇక్కడే ఉండి నీలాగా పూలు అమ్ముకోమంటావా అని అంటాడు. నా డిగ్రీ గురించి చెప్తే నీకు నోరు కూడా తిరగదు అని మనోజ్ అంటాడు.
అప్పుడే ఇంటికి వచ్చిన రోహిణి ఏమైంది ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇంటికి తాకట్టు పెట్టి మీ ఆయనకు 14 లక్షలు ఇవ్వాలంట అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. అసలు పంపించింది రోహిణి కాబట్టి రోహిణి సైలెంట్ గా నోరు తెరిచి మీ అబ్బాయి అడుగుతున్నారు కదా అత్తయ్య మీరు ఇవ్వచ్చు కదా అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రభావతి రెచ్చిపోతుంది.. నాన్నగారు తెచ్చిన ఆస్తులు ఏమి ఇక్కడ లేవు కదా అదేదో నువ్వే మీ నాన్నగారిని అడిగి ఇవ్వచ్చు కదా అని అంటుంది. మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలుసు ఎలా ఇవ్వమంటారు అని అంటుంది రోహిణి.
మొత్తానికి అయితే రోహిణి కేర్ రివర్స్ పనిచేస్తుంది ప్రభావతి. బాలు తన కస్టమర్లని టెన్షన్ పడవద్దు అని సలహా ఇస్తూ ఉంటాడు. శృతి డబ్బింగ్ చెప్తున్న స్టూడియోకి వాళ్ళు వెళ్లి శృతిని దొంగ అనడంతో రెచ్చిపోతాడు.. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిని దొంగ అని నిందించకూడదు అని అవతల వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మొత్తానికి అయితే శృతిని గండం నుంచి గట్టి ఎక్కిస్తాడు బాలు. శృతిని నువ్వు వాళ్ళని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. వాళ్ళు నన్ను ఊరికే దొంగ అన్నారు నేను దొంగతనం చెయ్యకపోయినా నేను దొంగ అంటే కోపం రాదా అని అంటుంది.
నువ్వు దొంగతనం చెయ్యకపోవడంతోనే నీకు కోపం వచ్చింది కదా మరి మీనా దొంగతనం చేసే లాగా మీకు కనిపిస్తుందా? మీ నాన్న అంటే నాకు ఎంత కోపం రావాలి. అందుకే ఆవేశంలో కొట్టాను తప్ప కావాలని నేనేమీ మీ నాన్నని కొట్టలేదు అని శృతికి అర్థమయ్యేలా బాలు చెప్పాడు. కావాలనే ఫంక్షన్ అయిపోయేంత వరకు మీ నాన్న మనుషులు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నీకు తెలుసా? ఇదంతా కాదు ఇప్పుడు రవిని ఎందుకు దూరం పెడుతున్నావు అని బాలు అడుగుతాడు. నేనేమీ దూరం పెట్టలేదు రవిని ఎక్కడున్నాడు అని అంటుంది శృతి.
Also Read: ఫిష్ వెంకట్ మృతికి కారణాలు ఇవే..!
బొద్దింకల మధ్య,ఎలకల మధ్య రవి ఎలా ఉన్నాడు తెలుసా అని శృతిని అడుగుతాడు బాలు.. మీ నాన్న నిన్ను రవిని అక్కడే ఉంచేసుకోవాలని ప్లాన్ తోనే ఇలా చేశాడు నువ్వు ఇది అర్థం చేసుకుని ఇంటికి వస్తే మంచిది అని సలహా ఇస్తాడు. నేనెవర్ని కావాలని కొట్టను ఇప్పుడు కూడా కొట్టేవాడినే కానీ నన్ను మళ్ళీ రౌడీ అనుకుంటామని నేను కొట్టలేదు అని బాలు అంటాడు. మొత్తానికైతే శృతి బాలు మాటను విన్నట్లే కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో రవి శృతి ఇద్దరూ ప్రభావతి ఇంటికి వస్తారేమో చూడాలి…