Gundeninda GudiGantalu Today episode September 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. మీ ఆవిడ పూలన్నీ లక్ష రూపాయలు సోఫానికి కొంటుందా? అని ప్రభావతి అడుగుతుంది.. మా ఆవిడ పూలమ్మే నాకు కారు కొనిపెట్టింది. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అనుకుంటా అని బాలు అంటారు. సత్యం ఈ గొడవ ని వదిలేయండి అని అంటాడు. ఇక శృతి బాధపడుతుంటే రవి అక్కడికి వెళ్లి బాలు అన్నయ్య కోపంగానే అన్నాడు కానీ మీ అమ్మ ఒక మాట ముందుగానేంటే బాగుండేది కదా అని రవి శృతి తో అంటాడు.. నిజమే మా అమ్మ చెప్పకుండా ఇలాంటి పని చేయడం నాకు కూడా తప్పు అనిపిస్తుంది అని శృతి అంటుంది. బాలు మీనాలను సందు దొరికితే ఎప్పుడు బయటకు పంపిద్దామని ప్రభావతి చూస్తూ ఉంటుంది. సోఫా విషయంలో ప్రభావతి బాలు పై పీకలు దాకా కోపంతో ఉంటుంది. ఎలాగైనా సరే వీడ్ని ఇంట్లో ఉండనిస్తే లేనిపోని గొడవలు పెడుతూ ఉంటాడు ఎలాగైనా బయటికి పంపించేయాలి అని ప్రభావతి అనుకుంటుంది.. సత్యం మీనా బాలుని బయటకు పంపించేద్దామని ప్రభావతి ఎంతగా చెప్పినా సరే ఈ విషయంలో నువ్వు నోరు మూసుకుంటే బాగుండు అని ప్రభావతికి షాక్ ఇస్తాడు.. అక్కతో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. రోహిణి నేను పార్లర్కి వెళ్ళొస్తాను అత్తయ్య అని అంటుంది. ఇలానే వెళ్తావా అమ్మ రోహిణి అని ప్రభావతి అడుగుతుంది. ఏ అత్తయ్య డ్రెస్ బాగాలేదా అని రోహిణి అడుగుతుంది. డ్రెస్ కాదమ్మా మెల్లో పుస్తెలతాడు తోనే వెళ్ళిపోతావా అని ప్రభావతి అడుగుతుంది. ఇక తప్పదు కదా అత్తయ్య ఒకరు చేసిన పనికి నేను బలవ్వాల్సి వచ్చింది అని రోహిణి కావాలని బాలు పై కోపాన్ని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. బాలు వంటగదిలో ఉండడం చూసిన మీనా అక్కడికి వెళుతుంది. నా మీద మా నాన్న కోపంగా ఉన్నాడా అని బాలు అడుగుతాడు. కోపంగా ఉన్నాడా మరి నువ్వు చేసిన పిచ్చి పనికి అని మీనా సమాధానం చెబుతుంది. ప్రతి వాళ్ళ అమ్మ కావాలని గొడవకు పెట్టినట్టు తెలుస్తుంది. పుస్తెలతాడు మార్చినప్పుడు అలానే గొడవ చేసింది. అసలు నిజం తెలుసుకొని ఇంటికి వచ్చేసింది. బాలును ప్రతి విషయాల్లో జోక్యం చేసుకోదు అని మీనా స్వీట్ వార్నింగ్ ఇస్తుంది.
ప్రభావతి రోహిణి పొగిడేస్తూ మీనా తిడుతూ ఉంటుంది.. అది శృతి ఏమంటున్నారు ఆంటీ అని అడుగుతుంది. ప్రభావతి అదేం లేదమ్మా నేను ఇప్పుడు మీనాను అనట్లేదు. ప్రతి చిన్న విషయానికి మీనా ని మధ్యలోకి తీసుకొస్తారు ఏంటి మీరు. ఇంట్లో మీ పెద్ద కోడలు మాత్రమే కాదు మీనా కూడా పసుపు తాడు వేసుకొని ఉన్నింది. రోహిణి ఏమి అంతకుముందు కూడా బంగారు తాడు ఏం వేసుకోలేదు కదా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని శృతి పెద్ద క్లాస్ పీకుతుంది..
నీకు రోహిణి అంటే ఇష్టం ఉంటే రోహిణి పొగడండి అంతేగాని మీనాన్ని తిట్టాల్సిన అవసరం లేదు కదా అని శృతి ప్రభావతి కి నోరు మూసుకునేలా చేస్తుంది. మీకు డబ్బున్న వాళ్ళుంటేనే ఇష్టమని బాగా అర్థమైంది. బాలు చేసిన తప్పుకి మీనాను అంటారేంటి? ప్రతి చిన్న విషయానికి మీ నాన్న అనడం మీకు అలవాటైపోయింది. మనిషి లాగా ఆలోచించండి ఆంటీ అని శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి కూడా అక్కడి నుంచి పార్లర్ కి వెళ్ళిపోతుంది.
ఒంటరిగా కూర్చొని ఉన్న మీన దగ్గరికి బాలు వస్తాడు.. ఏమైంది మీనా అలా ఉన్నావ్ ఏంటి ఏంటి నీరసంగా ఉందండి కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది. టాబ్లెట్ వేసుకున్నావా అని బాలు అడుగుతాడు. లేదండి వేసుకోలేదు ఇంట్లో టాబ్లెట్స్ లేవు అని మీనా అంటుంది. ఇక నేను వెళ్లి టాబ్లెట్లు తీసుకొస్తాను నువ్వు వెళ్లి పడుకో అనేసి అంటాడు. మీనా మనోజ్ వాళ్ళ రూమ్ లో పడుకుంటుంది. అయితే గదిలోకి వచ్చిన మనోజ్ ఆ మీనా మా గదిలో పడుకుంది ఏంటి అని ప్రభావతిని అడుగుతాడు.
Also Read :వేదవతికి కొత్త టెన్షన్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..ఇంట్లో బాంబ్ పేల్చిన కళ్యాణ్..
ఇక ప్రభావతి పదండి దాని సంగతి చూద్దామని అంటుంది. అయితే పడుకుని ఉన్న మీనాని నిద్ర లేపుతుంది. ఏంటే గదిలో నువ్వు నీ మొగుడు రిజర్వేషన్ చేసుకున్నారా లే బయటకి అనేసి ఈడ్చుకుని వస్తుంది. మీనా ఒకవైపు ఆగండి అత్తయ్యని ఎంతగా అడుగుతున్నా బ్రతిమలాడుతున్న సరే ప్రభావతి కరగదు. మీనా ని బయటికి ఈడ్చుకు రావడం బాలు చూస్తాడు. ఇక్కడ వరకు ఏడుస్తావా వీధి వరకే ఈడ్చి అవతల పడేస్తావా అని బాలు అడుగుతాడు. ఏమైందిరా నీ సత్యం అడుగుతాడు. నాన్న మీ నాని ఇలా ఈడ్చుకుని వచ్చింది అని మనోజ్ ని ఈడ్చి మరీ చూపిస్తాడు బాలు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..