Intinti Ramayanam Today Episode September 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ వాళ్ళ బాస్ వస్తుంది. ఆమె రావడంతో ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని చాముండేశ్వరి కూడా అనుకుంటుంది. కానీ అవని మాత్రం మనం కూడా కొన్ని విషయాన్నీ మీ బాస్ కు పరిస్థితిలో తెలియకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నారు… పల్లవి, శ్రీయా ఇద్దరు కూడా ఈ ఫంక్షన్ ను ఎలా ఆపాలని అనుకుంటారు. అయితే ఏదో ఒకటి చేసి ఫంక్షన్ జరగకుండా చేయాలి అని పల్లవి అనుకుంటుంది.. పల్లవి అనుకున్నట్లుగానే ఆల్కహాల్ కలిపిన జ్యూస్ ని అక్షయ్ తాగుతాడు. పంతులుగారు పెళ్లికూతురు తీసుకురండి అని అంటాడు. అవినీని నేను తీసుకొని వస్తా అని ఆరాధ్య వెళుతుంది. ఇద్దరు కలిసి అవనిని కిందకు తీసుకొని వస్తారు. అబ్బాయిని కూడా తీసుకురండి అని పంతులుగారు చెప్తారు. అక్షయ్ ఫుల్లుగా తాగేసినట్లు మాట్లాడుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరని కూడా నాకు తెలుసు. ఈ విషయాలన్నీ నాకు అవని ముందే చెప్పింది. ఏం జరిగినా కూడా అవని మొత్తం నిజాన్ని నాకు చెప్పేసింది. భార్యాభర్తల అన్నాక గొడవలు రాకుండా ఎలా ఉంటాయి. మేము గొడవలు వచ్చినా విడిపోకూడదు అని అనుకున్నాము. కుటుంబాన్ని కలపాలని నేను అనుకుంటున్నాను అని అవని చెప్పిన విషయాన్ని చాముండేశ్వరి బయటపడుతుంది.. అక్షయ్ కు అవని చెప్పింది. అతనికి కొంచెం మజ్జిగ ఇవ్వండని చాముండేశ్వరి అంటుంది.
అక్షయ్ వాళ్ల బాస్ మాటలు విన్న పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది చాముండేశ్వరి. పల్లవి ప్లాను దారుణంగా ఫెయిల్ అవుతుంది. అవనిని యంతగా తొక్కలని చూసినా ఏదో ఒక రకంగా పైకెళ్తుంది అని పల్లవి మనసులో అనుకుంటుంది. ఇలాంటి కోడలు ప్రతి ఒక్క ఇంటికి ఉంటే చాలా మంచిది అని అందరూ అవనిని మెచ్చుకుంటారు. మజ్జిగ తాగిన తర్వాత అక్షయ్ మళ్ళీ స్టడీగా మారిపోతాడు. ఏంటి ఏమైంది అందరూ నన్ను ఎందుకు చూస్తున్నారు అని అడుగుతాడు. ఏం కాలేదు నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావు అని రాజేంద్రప్రసాద్ అబద్ధం చెప్తాడు.
ఇక అందరూ కలిసి అవని అక్షయల ఫంక్షన్ ను గ్రాండ్ చేస్తారు. పల్లవి ప్లాను దారుణంగా ఫెయిల్ అయిందని తన తండ్రితో ఈ విషయాన్ని చెప్తుంది. మనము ఎంతగా ప్లాన్లు చేస్తున్నా సరే అవని ఏదో ఒక విధంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంది. ఈసారి కచ్చితంగా కొడితే దిమ్మ తిరిగిపోయేలా కొట్టాలి అని చక్రధర్ సలహా ఇస్తాడు. రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు.
వదిన వంట తినక ఎన్నో రోజులు అవుతుంది. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ రుచికరమైన వంటలు తినే భాగ్యం కలిగింది అని కమల్ సంతోష పడుతూ ఉంటాడు. అందరూ సరదాగా ఉన్న సమయంలో అవని ముందు ఈ స్వీట్ తీసుకోండి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని అంటుంది. అందరూ సంతోషంగా స్వీట్లు తీసుకుంటారు. ఎందుకమ్మా ఈ స్వీట్లు అని పార్వతి అడుగుతుంది. రేపు నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను అత్తయ్య అని అవని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది.
ఇప్పుడు మీ స్వీట్లు ఎందుకు పంచావు అక్క అని కావాలనే గొడవలు లేపేందుకు మాట్లాడుతుంది.. నువ్వు ఈ స్వీట్ ఇవ్వడానికి కారణం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మాత్రమే కాదు వేరేది కూడా ఉంది కదా అని పల్లవి అంటుంది. వేరే కారణం ఏముంది అని అవని అడుగుతుంది. బావగారికన్నా పెద్ద పొజిషన్లో నువ్వు ఉద్యోగంలో చేరావని అందరికీ తెలియాలి కదా అది చెప్పవేంటి ముందు అని పల్లవి కావాలని ఫిట్టింగ్ పెట్టేస్తుంది. ఇంట్లో ఎలాగో బావగారిని గెలువలేక పోతున్నావు ఆఫీసులో తనకన్నా పై పొజిషన్లో నువ్వు ఉద్యోగం సంపాదించావు అని పుల్లలు పెట్టేస్తుంది. ఆ మాట వినగానే అక్షయ్ నేను ఇక మీద ఉద్యోగమే చేయను అని అంటాడు.
Also Read: మీనా పై అక్కసు కక్కేసిన ప్రభావతి.. శృతి మాటతో రోహిణికి షాక్.. మీనాను గెంటేసిన ప్రభావతి..
అవని ఉద్యోగంకు వెళ్తే నీకేమైంది రా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. నాకన్నా పై పొజిషన్లో ఉండి నన్ను దిగజార్చాలని అనుకుంటే అక్కడ కూడా నాకు అవమానాలు ఎదురవుతాయి అని అక్షయ్ అంటాడు. ఇక ఆ తర్వాత పల్లవి గదిలోకి వెళ్ళిన అవని ఆల్కహాల్ బాటిల్ ని చూపిస్తుంది. ఏంటిది ఎందుకు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటావు నువ్వు మారవా ఇక.. ఇంకా నీ గురించి దాచలేను అందరికీ ఈ విషయం గురించి చెప్పాల్సిందే అని పల్లవి చేయి పట్టుకొని అవని బయటకు వెళ్తుంది. అక్క నేను చెప్పేది వినక్కా అని ఎంత చెప్తున్నా సరే అవని వినకుండా పల్లవిని లాక్కొని వెళ్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో పల్లవి గురించి నిజం తెలిసి పోతుందా చూడాలి…