Anasuya:ప్రముఖ స్టార్ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న అనసూయ(Anasuya ) జబర్దస్త్ (Jabardast) ద్వారా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే అనసూయ.. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ముఖ్యంగా తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న ఈమె అటు పర్సనల్, ఇటు ప్రొఫెషనల్ జర్నీలను కూడా గుర్తుచేసుకుంది.
కుటుంబ సభ్యులే మోసం చేశారు – అనసూయ
అందులో భాగంగానే అనసూయ మాట్లాడుతూ.. “జీవితమే ఒక సమస్యల ప్రయాణం. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి. అయితే ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణం. ప్రస్తుతం నేను ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాను. నేను కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయగలుగుతున్నాను. పెద్ద ఇల్లు, సొంత కారు ఇవన్నీ టీం వర్క్ తోనే లభించాయి. అభిమానులు కూడా నా టీంలో భాగమే.. అయితే కుటుంబ సభ్యుల మోసం వల్ల మా నాన్న అప్పట్లో తనకంటూ ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది.. హైదరాబాద్ రేస్ క్లబ్లో మా నాన్న ట్రైనర్ గా పనిచేసేవారు. మాకు దాదాపు 12 గుర్రాలు కూడా ఉండేది.
నాన్న అర్థం చేసుకోలేకపోయారు – అనసూయ
ఈ రేస్ కారణంగా ఆర్థికంగా ఏ రోజు ఎలా ఉండేదో తెలియని పరిస్థితి. జీవితంలో స్థిరత్వం అనేది చాలా ముఖ్యం .కానీ అదే మా నాన్న అర్థం చేసుకోలేకపోయారు. మేము ముగ్గురం కుమార్తెలమే.. అటు అబ్బాయి పుట్టలేదన్న బాధ కూడా మా నాన్నలో ఎక్కువగా ఉండేది. మా నాన్న చాలా అందగా ఉంటారు. ఆయన పోలికలే నాకు వచ్చాయి అనుకుంటూ ఉంటాను. నేను నాన్న నుంచి క్రమశిక్షణ, అమ్మ నుంచి నిబద్ధత నేర్చుకున్నాను. ఇక ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను మీ ముందు ఈ స్థాయిలో నిలబెట్టింది అంటూ తన తండ్రి గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది అనసూయ.
నా జీవితం అక్కడి నుంచే టర్నింగ్ తీసుకుంది -అనసూయ
ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ..” నేను పెళ్లి చేసుకున్న తర్వాతనే నా జీవితంలో అసలైన టర్నింగ్ పాయింట్ మొదలయ్యింది. సాధారణంగా తెలుగు సినిమాలలో బీహార్ వాళ్ళు ఎక్కువగా విలన్ గా కనిపిస్తూ ఉంటారు అంటూ నవ్వుతూ చెప్పిన అనసూయ.. నేను మాత్రం బీహార్ వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రతి విషయంలో కూడా అండగా నిలుస్తున్నారు. పెళ్లయి మా అమ్మ నాన్నలకు దూరం అయ్యాక నాకు వాళ్ళ విలువ తెలిసింది. కానీ నా భర్త నాకు ఎప్పుడూ అండగా ఉంటారు అంటూ తెలిపింది అనసూయ.
అనసూయ ప్రొఫెషనల్ లైఫ్..
నాగ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఎంబీఏ చదువుతున్నప్పుడే ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్ గా ఇంటెన్షిప్ చేసింది. అక్కడే సుకుమార్, త్రివిక్రమ్, మెహర్ రమేష్ లాంటి వారు పరిచయమయ్యారట. ఇక ఆర్య 2 లోనే ఒక పాత్ర కోసం సుకుమార్ సంప్రదించగా.. రంగంపై ఉన్న అపనమ్మకంతో నటించలేదని, జబర్దస్త్ కంటే ముందు పలు షోలు చేశానని, అన్నింటిలో చేసిన తర్వాత నమ్మకం వచ్చాకే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అంటూ తెలిపింది.