BigTV English
Advertisement

OTT Movie : టార్చర్ చేసే మొగుడిని ఇరికించడానికి పక్కా కిక్కిచ్చే ప్లాన్… ఆ అమ్మాయి అరాచకం చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : టార్చర్ చేసే మొగుడిని ఇరికించడానికి పక్కా కిక్కిచ్చే ప్లాన్… ఆ అమ్మాయి అరాచకం చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్ లతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఊహించని ట్విస్టులతో పిచ్చెక్కిస్తాయి. ఈ సినిమాలను చివరికి వరకూ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు.  అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక భార్య తన భర్తను ఒక మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని ట్విస్టులతో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో  స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


హులు (Hulu) ఓటీటీలో

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గోన్ గర్ల్’ (Gone Girl). 2014 లో వచ్చిన ఈ సినిమాకి డేవిడ్ ఫిన్చర్ దర్శకత్వం వహించారు. ఇది 2012లో గిలియన్ ఫ్లిన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో బెన్ ఆఫ్లెక్ (నిక్ డన్), రోసమండ్ పైక్ (అమీ డన్), నీల్ పాట్రిక్ హారిస్, టైలర్ పెర్రీ నటించారు. ఇది పెళ్లి, మోసం, మానసిక మానిప్యులేషన్ థీమ్స్‌తో తెరకెక్కింది. హులు (Hulu) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే 

నిక్ డన్, అమీ డన్ పైకి ఒక సంతోషవంతమైన దంపతులుగా కనిపిస్తుంటారు. కానీ లోపల అంత సీన్ ఉండదు. వీళ్ళు మిస్సౌరీలోని నార్త్ కార్తేజ్‌లో నివసిస్తుంటారు. వీళ్ళ ఐదవ వివాహ వార్షికోత్సవం రోజు, అమీ ఆకస్మికంగా మిస్సింగ్ అవుతుంది. నిక్ ఇంటికి వచ్చినప్పుడు గదిలో గాజు టేబుల్ పగిలిపోయి ఉండటం, అక్కడ ఏదో పెనుగులాట జరిగినట్లు సంకేతాలు కనిపిస్తాయి. అమీ అదృశ్యం గురించి మీడియా భారీగా కవరేజ్ చేస్తుంది. ఎందుకంటే అమీ తన తల్లిదండ్రులు రచించిన ‘అమేజింగ్ అమీ’ అనే పిల్లల పుస్తకాల ద్వారా ఫేమ్ అవుతుంది.  పోలీసులు ఈ కేసు విచారణ ప్రారంభిస్తారు. నిక్ అనుమానాస్పద ప్రవర్తన, అతని వైఖరి, అమీ డైరీలో వ్రాసిన విషయాలు అనుమానం తెప్పించే విధంగా ఉంటాయి.

నిక్ ఆమెపై గృహ హింస చేశాడని, ఆమె అతనికి భయపడుతోందని ఆమె రాతలు స్పష్టం చేస్తాయి. అందువల్ల అతన్ని ప్రధాన అనుమానితుడిగా చేరుస్తారు.  డైరీలో అమీ తన భర్త నుండి బెదిరింపులు, హింస గురించి వివరిస్తుంది. అయితే అమీ బతికే ఉందని, ఆమె తన మరణాన్ని నకిలీగా చిత్రీకరించి, నిక్‌ను హత్య ఆరోపణలో ఇరికించేలా ఒక ప్లాన్ వేసిందని తెలుస్తుంది. చివరికి అమీ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా ? నిక్ జైలుకి వెళతాడా ? అమీ ప్లాన్ బెడిసి కొడుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఒక్కడితోనే పని కానిచ్చే వదినా మరదళ్ళు… పెళ్లయ్యాక పాడు పనులు… మతి పోగొట్టే క్లైమాక్స్ ట్విస్టు

Related News

OTT Movie : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : అబ్బాయిలకు వలపు వల… పడిపోయారో పరలోకానికే… గ్రిప్పింగ్ లేడీ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : ఒకే రోజు ఓటీటీని షేక్ చేయబోతున్న రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్… ఒక్కోటి ఒక్కో ఓటీటీలో

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ”లోకా చాప్టర్ 1: చంద్ర’… ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసా?

OTT Movie : భర్త ఫ్రెండ్ తోనే ఆ పాడు పని… మైండ్ బెండింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మొగుడి శవంతో పెళ్ళాన్ని కుడా వదలకుండా… ఈ అరాచకాన్ని చూడలేం భయ్యా

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… డోంట్ మిస్

OTT Movie : భర్త లేని టైమ్ లో భార్య గదిలోకి… ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి కన్పిస్తే కథ కంచికే… పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×