Gundeninda GudiGantalu Today episode june 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాకు అప్పు ఇవ్వడానికి వచ్చిన మనిషి దురుసుగా ప్రవర్తిస్తాడు. వెటకారంగా సమాధానం చెప్పడంతో ప్రభావతికి కోపం పెరుగుతుంది. ఆ చక్రపాణి మీనా చేత సంతకం పెట్టుకుని డబ్బులు ఇస్తాడు. మీనా ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్తుంది. మనోజ్ రోహిణి కోసం పార్లర్ కి వెళ్తాడు. అక్కడున్న అమ్మాయితో రోహిణి పిలవమని అడుగుతాడు.. రోహిణి వచ్చే లోపల విజ్జి ఇది ప్రభావతి పార్లర్ కాదని తెలిస్తే మీ ఆయన ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాడు అని చెప్పగానే రోహిణి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఏంటి మనోజ్ నువ్వు ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. రోహిణి బయపడినట్లే మనోజ్ ఇంట్లో రోహిణి మ్యాటర్ బయట పెట్టేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ ఇంటికి రాగానే హడావిడిగా అందరిని పిలుస్తాడు. ప్రభావతి సత్యం ఏమైంది అని అడుగుతారు.. మీకో గుడ్ న్యూస్ అంటాడు. అందర్నీ పిలుస్తాడు..బాలు సెటైర్స్ వేస్తుంటాడు. నువ్వు చెప్పురా అంటుంది ప్రభావతి. రోహిణి ఏం చేసిందో తెలుసా అని మనోజ్ అంటే నువ్వు నాన్న డబ్బు కొట్టేసినట్టు పార్లలమ్మ నీ డబ్బు కొట్టేసిందా అని అడుగుతాడు. రోహిణి మన పార్లర్ ని ఫ్రాంచైజీకి ఇచ్చింది , క్వీన్ బ్యూటీ పార్లర్ తో మన పార్లర్ కలిపేసింది. ఆ పార్లర్ కి అమ్మపేరు తీసేశారు ఇప్పుడు అంటాడు. అంతే షాక్ అవుతుంది ప్రభావతి.
ఇంతలోనే రోహిణి ఎంట్రీ ఇస్తుంది. నేనే మీతో చెప్పాలి అనుకున్నా మనోజ్ చెప్పేశాడు అంటుంది రోహిణి. ప్రభావతి ఏమీ అనదు.. పైగా ఇది మంచి విషయమే కదా అని సపోర్ట్ చేస్తుంది.. ప్రభావతిని ఇలా అంటుందేంటి అని అనుకుంటారు.. తుఫాన్ ముందు సైలెంట్ గా ఉంటుంది ఆ తర్వాతే విశ్వరూపం చూపిస్తుంది అని బాలు అంటాడు. మరోవైపు మౌనికాను సంజూ టార్చర్ చేస్తూనే ఉంటాడు. కానీ మౌనికా సంజూను మంచిగా మార్చుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభిస్తుంది. ఇక సంజూ మౌనికా చేస్తున్న పూజలకు ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తాడు. సువర్ణ మాత్రం మౌనికను సపోర్ట్ చేస్తూ కొడుకుపై సీరియస్ అవుతుంది. ఇప్పుడు నా పేరు మీద లేకపోతే ఏంటీ లాభాలు వస్తే అదే చాలు అని ప్రభావతి అంటుంది. థ్యాంక్స్ అంటూ రోహిణి వెళ్లిపోతుంది.
తర్వాత అత్తయ్య ఏం అనలేదేంటండి అని మీనా అంటుంది. మా అమ్మ కోపం గురించి తెలియదు. తుఫాను వచ్చేముందు ఉన్నట్లు చల్లగా ఉంటుంది అని బాలు అంటాడు. అయితే తన పేరు మీద పార్లర్ ఉందని ఇన్నిరోజులు భ్రమ పడింది ప్రభావతి. కానీ ఇప్పుడు లేదని తెలిస్తే విశ్వరూపం చూపిస్తుందేమో అని అందరు అనుకుంటారు. రోహిణి తెలివిగా తప్పించుకున్నాను అని అనుకుంటుంది. కానీ గదిలోకి వెళ్లిన రోహిణి ఏదో చెప్తుంటే ప్రభావతి వినకుండా గట్టిగా అరుస్తుంది. నేను డబ్బులు పెట్టి ఇచ్చిన నా పార్లర్ ను ఎందుకు అమ్మేసావు..? నోరు మూయి ఎంత దైర్యం నీకు. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా నిర్ణయం తీసుకుంటావు అని అరుస్తుంది.
మన పార్లర్ ను మంచి లాభాల్లోకి తీసుకురావాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను.. మీకు చెప్పాలని అనుకున్నాను కానీ ఏదో పని ఉండటం వల్ల చెప్పలేక పోయాను అంటుంది. ప్రభావతి మాత్రం రోహిణి మాట వినకుండా అరుస్తుంది. నా దగ్గర మలేషియా తెలివితేటలు చూపించవద్దు. ఇదే దాచావా ఇంకేదైనా దాచావా అని అరస్తుంది.. రోహిణి షాక్ అవుతుంది. బాలు మాత్రం తిక్క కుదిరింది అని అనుకుంటాడు. రోహిణి ప్రభావతిని అలా చూసి షాక్ లోనే ఉండిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. తర్వాత ఎపిసోడ్ లో ఆసక్తిగా ఉంటుందని తెలుస్తుంది.. సోమవారం ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి… బాలుకు కారు ఇచ్చి సర్ ప్రైజ్ ఇస్తుంది మీనా.. ప్రభావతికి షాక్ ఇస్తుంది.