BigTV English

OTT Movie : ప్రియురాలి కోసం నెత్తుటి యుద్దం చేసే ప్రియుడు … ఈ అరాచకాన్ని చూసి తట్టుకోవడం కష్టం భయ్యా

OTT Movie : ప్రియురాలి కోసం నెత్తుటి యుద్దం చేసే ప్రియుడు … ఈ అరాచకాన్ని చూసి తట్టుకోవడం కష్టం భయ్యా

OTT Movie : రాంచీ నుండి న్యూ ఢిల్లీకి వెళ్లే రాజధానీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్, రాత్రి సమయంలో ప్రయాణికులతో నిండి ఉంటుంది. ఈ ట్రైన్‌లో ప్రేమ, రక్తపాతం కలిసిన ఒక రోమాంచకర కథ జరుగుతుంది. అమృత్ అనే ఒక NSG కమాండో, తన ప్రేమికురాలు తులికా కోసం ఈ ట్రైన్‌లో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఫనీ నేతృత్వంలోని కత్తులు ధరించిన దొంగల గ్యాంగ్ ట్రైన్‌ను ఆక్రమించి, ప్రయాణికులను బెదిరిస్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఒక యుద్ధభూమిగా మారుతుంది. అమృత్ ఒక్కడే ఈ దొంగలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ అతను తన ప్రేమను నిలుపుకుంటాడా ? ఈ రక్తపాతంలో ఎవరు బతుకుతారు?  ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే .


స్టోరీలోకి వెళితే 

అమృత్ రాథోడ్ ఒక NSG కమాండో. తన సహచరుడు విరేష్‌తో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు వస్తాడు. అమృత్ తన ప్రేమికురాలు తులికా సింగ్‌తో చలా రోజుల నుంచి సంబంధంలో ఉన్నాడు. ఆమె ఒక శక్తివంతమైన వ్యాపారవేత్త బల్దేవ్ సింగ్ ఠాకూర్ కుమార్తె. ఒక రోజు బల్దేవ్ తులికాను మరొక వ్యక్తితో నిశ్చితార్థం చేస్తాడు. దీంతో అమృత్, విరేష్ రాంచీకి వెళతారు. అమృత్ తులికాను తనతో పారిపోవాలని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె తన తండ్రికి భయపడి నిరాకరిస్తుంది. మరుసటి రోజు తులికా, ఆమె కుటుంబం రాంచీ నుండి న్యూ ఢిల్లీకి వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తారు. అమృత్ కూడా రహస్యంగా ఆ ట్రైన్‌లో ప్రయాణిస్తాడు. అయితే బెనీ నేతృత్వంలోని దొంగల గ్యాంగ్ దోపిడీ కోసం ట్రైన్‌లో ఎక్కుతారు. ఈ గ్యాంగ్ దశాబ్దాలుగా ట్రైన్ దోపిడీలు చేస్తున్న కుటుంబం. వీళ్ళు ఆయుధాలతో జనాలను బెదిరించి దోపిడీ ప్రారంభిస్తారు.


అయితే అమృత్, విరేష్ కమాండోలుగా వారిని ఎదుర్కొంటారు. ఈ ట్రైన్ లో ఒక రక్తపాత యుద్ధమే జరుగుతుంది. అమృత్ తన ప్రేమను కాపాడటానికి, ప్రయాణికులను రక్షించడానికి ఒక ప్రాణాలకు తెగించి పోరాడతాడు. బెనీ కొడుకు ఫనీ ఈ క్రూరమైన దొంగల గ్యాంగ్‌ను నడిపిస్తాడు. అతని తండ్రి బెనీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటాడు. దొంగలు తులికా కుటుంబం సంపదను లక్ష్యంగా చేసుకుని, వారిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. అమృత్ అందుబాటులో ఉన్న ఆయుధాలతో, దొంగలను ఒక్కొక్కరిని ఎదుర్కొంటాడు. చివరికి తులికా కుటుంబాన్ని అమృత్ కాపాడగలడా? ఇతని లవ్ స్టోరీ ఏమౌతుంది ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవలసిందే.

Read Also : విమానంపై పిడుగు… గాల్లో అలజడి… ఈ ఓటీటీ మూవీ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కిల్’ (Kill). 2024 లో వచ్చిన ఈ సినిమాకి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ , సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ దీనిని నిర్మించాయి. ఇందులో లక్ష్య (అమృత్), రాఘవ్ జుయల్ (ఫనీ), తాన్యా మణిక్తల (తులికా), అశిష్ విద్యార్థి (బెనీ), హర్ష్ ఛాయలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2023 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలో ప్రీమియర్ అయింది. 2024 జూలై 5న థియేటర్లలో విడుదలైంది. ఇది భారతదేశంలో అత్యంత హింసాత్మక సినిమాగా ప్రచారం పొందింది.  దీని యాక్షన్ సన్నివేశాలు ‘ది రైడ్’ ‘ జాన్ విక్’ లాంటి సినిమాలతో పోల్చబడ్డాయి. 2024 లో ఉత్తమ యాక్షన్ చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచింది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

Big Stories

×