BigTV English
Advertisement

OTT Movie : భార్యతో ఆ పని చేస్తూ వీడియో… మిస్ అవ్వడంతో ట్విస్ట్… క్లైమాక్స్ లో కిక్కు పక్కా

OTT Movie : భార్యతో ఆ పని చేస్తూ వీడియో… మిస్ అవ్వడంతో ట్విస్ట్… క్లైమాక్స్ లో కిక్కు పక్కా

OTT Movie : మలయాళం నటుడు బాసిల్ జోసెఫ్ నటిస్తున్న సినిమాలు థియేటర్లతో పాటు, ఓటీటీలో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ డైరక్ట్ చేసిన ఒక సినిమా,  థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, ఓటీటీలో మంచి వ్యూస్ తెచ్చుకుంటోంది.  తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జీ 5 ( ZEE5) లో

ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘Nunakuzhi’. 2024 లో వచ్చిన ఈ సినిమాకి జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాసిల్ జోసెఫ్ (ఎబి జకరియా), గ్రేస్ ఆంటోనీ (రష్మిత), నిఖిలా విమల్ (రిమి), సిద్దీక్ (భామాకృష్ణన్), బైజు సంతోష్ (పోలీసు అధికారి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2024 ఆగస్టు 15న థియేటర్లలో విడుదలై, 2024 సెప్టెంబర్ 13 నుంచి జీ 5 ( ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 6 నిమిషాల రన్‌టైమ్‌ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.8/10 రేటింగ్ ఉంది.


.స్టోరీలోకి వెళితే

ఎబి జకరియా (బాసిల్ జోసెఫ్)అనే వ్యాపారవేత్త సంస్థపై ఆదాయపు పన్ను అధికారులు రైడ్ చేస్తారు. ఈ రైడ్ లో అతని పర్సనల్ ల్యాప్‌టాప్‌ను అధికారులు తీసుకెళ్తారు. ఇందులో అతని భార్య రిమి (నిఖిలా విమల్)తో సన్నిహితంగా ఉన్న ఒక వీడియో ఉంటుంది. ఈ విషయం ఎబీ బార్యకు తెలిసి కంగారుపడి, అతని పై మండిపడుతుంది. వేరే వాళ్లు తన పర్శనల్ వీడియో చూసేస్తారని భయపడుతుంది. ఆ ల్యాప్ టాప్ తీసుకువస్తేనే సంసారం చేస్తానని చెప్తుంది . ఇక ఈ వీడియో బయటపడకుండా ఉండేందుకు, ఆదాయపు పన్ను అధికారి భామాకృష్ణన్ (సిద్దీక్) నుండి ల్యాప్‌టాప్‌ను తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు ఎబి. ఈ క్రమంలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ ఎడ్రస్ తీసుకుని ఆ ప్లాట్ కు దొంగతనంగా వెళ్ళి ల్యాప్ టాప్ ను ఎత్తుకొద్దామని వెళ్తాడు.

అయితే అతను రష్మిత (గ్రేస్ ఆంటోనీ) అనే ఇంటికి పొరపాటున వెళ్తాడు. ఆమె విడాకుల విచారణలో అవమానానికి గురై, విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రష్మిత ఇంట్లోకి అనుకోకుండా వచ్చిన ఎబి ఆ విషాన్ని తాగడంతో, అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఆ తరువాత ఒక డెంటిస్ట్ హత్య వైపు ఈ స్టోరీ నడుస్తుంది. ఒక పోలీసు అధికారి (బైజు సంతోష్) ఈ గందరగోళాన్ని ఛేదించడానికి ఎంట్రీ ఇస్తాడు. చివరికి ఎబి తన ల్యాప్‌టాప్‌ను దక్కించుకుంటాడా ? డెంటిస్ట్ హత్య వెనుక స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కీ ఇస్తే మనుషుల్ని చంపే మంకీ బొమ్మ… నరాలు తెగే సస్పెన్స్… చెమటలు పట్టించే హర్రర్ సీన్స్

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×