Gundeninda GudiGantalu Today episode march 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ కి ఉద్యోగం లేదని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో అడుగడుక్కి అవమానమే ఎదురవుతుంది. మీనా బాలు ఇద్దరు కలిసి మనోజ్ రోహిణిలపై కారాల మిరియాలు నూరుతుంటారు. రోహిణి వాళ్ళ భర్త జాబ్ లేకుండా ఇన్నాళ్లు పార్కులో పల్లీలు తింటూ బతకాడంటూ మీనా ఎత్తిపొడుస్తుంది.. మనోజ్ మొత్తానికి ఉద్యోగానికి బయటకు వెళ్తాడు. రెండు మూడు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఈ ఉద్యోగం వద్దు ఏమి వద్దు దీనికన్నా ప్రశాంతంగా ఎక్కడ చోటు పడుకోవడం మేలని అనుకుంటాడు. మళ్లీ రోహిణి అన్నమాట గుర్తు చేసుకొని ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తాడు. గతంలో జాబ్ వదిలేసిన ఆఫీస్ కు వెకన్సీ ఉందని వెళ్తాడు.. లోపల లేడి బాస్ తో మాట్లాడుతాడు. ఆమె నీకు చచ్చినా జాబ్ ఇవ్వను అని చెప్పేస్తుంది. మనోజ్ కాళ్ళవెల్లా పడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. భర్త కోసం రోహిణి కంగారుగా ఎదురుచూస్తుంటుంది. రోహిణి టెన్షన్ చూసి ఏమైందని రవి అడుగుతాడు. మనోజ్ ఇంటర్వ్యూకు వెళ్లిన సంగతి చెబుతుంది.. ఇంకా ఇంటికి రాలేదని డోర్ బయటే వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయని అన్నాడని, ఏదో ఒక జాబ్ కన్ఫామ్ అవుతుందని అనుకున్నట్లు రోహిణి చెబుతుంది. ఒక్క రోజులో జాబ్ ఎలా దొరుకుతుందని శృతి అంటుంది.. శృతి ఒక్క మాట అనగానే రోహిణి ఫీల్ అవుతుంది.
నేను వేరేలా అడగలేదని, బాలు మాదిరిగా అస్సలు అడగలేదని అంటుంది.మీనా ఉండటం చూసి మనోజ్‌కు జాబ్ రాకపోతే మమ్మల్ని బతకనిచ్చేలా లేరని కావాలనే రెచ్చగొడుతుంది రోహిణి. అవును అది నిజం.. ఆ బాలు కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ దొరికితే ఖచ్చితంగా మాటలతో చంపేస్తాడని అంటుంది. రోహిణి మాటలతో మీనా కోపం పట్టలేకపోతుంది. మనిషి ఇంట్లో లేనప్పుడు అత్తగారిలా మాట్లాడటం ఎందుకు…దమ్ముంటే…ధైర్యం ఉంటే బాలు ఉన్నప్పుడే మాట్లాడమని రోహిణితో ఛాలెంజ్ చేస్తుంది మీనా. బాలు ఏ తప్పు చేయలేదని మీనా అంటుంది. భార్యను, తండ్రిని మోసం చేయలేదని, అబద్దాలు చెప్పుకుంటూ బతకడం లేదని దులిపేస్తుంది..
మీనా క్లాస్ పీకడం విన్న ప్రభావతి మెల్లగా కిందకు వస్తుంది. ఇక్కడ అందరూ చదువుకున్నవాళ్లే ఉన్నారని, కాస్త సంస్కారంతో మాట్లాడమని అవమానిస్తుంది. రోహిణి, శృతి, ప్రభావతి ఒక్కటైపోతారు. మీనాను టార్గెట్ చేస్తారు. ప్రభావతి మాటలతో మీనా మనసు గాయపడుతుంది.. అటు మనోజ్ కూడా లేడీ బాస్ ను జాబ్ కోసం చాలా సార్లు అడుగుతాడు. ఆమె ముందు జాగ్రత్తతో నీకు చచ్చినా జాబ్ ఇవ్వను అని చెప్పేస్తుంది. మనోజ్ ప్లాన్ రివర్స్ అవుతుంది. మీరు మారారు అంటే నమ్మనని అంటుంది. ఎక్కడ జాబ్ దొరక్కపోవడంతో మీరు డ్రామాలు ఆడుతున్నారని ఎండీ అంటుంది..నీకు జాబ్ ఇవ్వలేనని చెప్పి వెళ్లగొడుతుంది..
బాలును మీనానే రెచ్చగొడుతుందని ప్రభావతి, రోహిణి అనుకుంటారు. మీనాకు వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటారు. అక్కడ సీన్ రివర్స్ అవుతుంది. ప్రభావతి మాటలకు ఏ మాత్రం తగ్గకుండా సమాధానాలు ఇస్తుంది మీనా. మాటకు మాట అంటుంది. నా భర్తను మాత్రం తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది.. ఎలాగైనా మీనా కొబ్బరిని అణిచేయాలని ప్రభావతి కంకణం కట్టుకుంటుంది. తర్వాత ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..