Gundeninda GudiGantalu Today episode May 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా తన పుట్టింట్లో బాలు చేసిన నిర్వాహకం గురించి బయట పెడుతుంది. అక్కడ ఏం జరిగిందన్న విషయం సత్యంతో చెప్తుంది.. బాలు వచ్చే సరికి అక్కడ ఏం చేశావని ప్రశ్నిస్తాడు. అందుకు బాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది మీ కోడలు మీనా చెప్పే ఉంటుంది కదా అని అంటాడు. ఇలా తిక్క తిక్కగా సమాధానం ఇస్తూన్నావేంటని సత్యం బాs మండి పడుతాడు. నిన్ను నేను ఎందుకు పంపించాను నువ్వు ఎందుకు వెళ్లావు? ఆ పని చూసుకొని రావాలి కానీ అక్కడ ఎవరేం మాట్లాడిన నువ్వు పట్టించుకోకుండా రావాలి అంతేకానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావా ఇదేనా నీకు నేను నేర్పించిన సంస్కారం అని సత్యం బాలుని దారుణంగా తిడతాడు.. వాళ్ల నాన్న పోయిన బాధను దిగమింగుకొని మరోసారి గుర్తు చేసుకోవాలని వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే నువ్వు నాశనం చేసి వస్తావా కొంచమైనా నీకు బుద్ధుండే చేస్తున్నావా..? నాతో మాట్లాడొద్దు అని అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోతాడు.
బాలు మళ్లీ ఎందుకు అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఎంత చెప్పినా మారవా? మీనా ను ఇంతగా ఏడిపిస్తావా? నువ్విక నాతో మాట్లాడల్సిన అవసరం లేదు అని సత్యం తేల్చి చెప్పేస్తాడు.. ప్రభావతి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది ఇదే గొడవలు గనుక కంటిన్యూ అయితే వీళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం అంటూ అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి మీనా రోహిణి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. తమ భర్తలు తమరికి దూరంగా ఉన్నా సంతోషంగా ఉన్నారని కుళ్లుకుంటారు. వీళ్ళ సంగతి ఏంటో రేపు చెప్పాలి అని శృతి అంటుంది. ఇక ఉదయం లేవగానే సత్యం కాఫీ తాగుతూ ఉంటాడు. మీనా ఎక్కడికెళ్ళింది అని ప్రభావతి లేవగానే అరుస్తూ వస్తుంది. ఎందుకు మీ నాతో ఏం పని అని సత్యం అడుగుతాడు. కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్లింది కనిపించలేదు అని ప్రభావతి అంటుంది.. మీనా కస్టమర్లు వచ్చారని పూల కొట్టు కెళ్ళింది. కాఫీ ఏ కదా కావాల్సింది మిగతా ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళని అడుగు లేదంటే మాత్రం నువ్వే కాఫీ పెట్టుకుని తాగు అని అంటాడు.
ఈ పూల కొట్టు పెట్టినప్పటి నుంచి ఇది అసలు ఇంట్లో పనే చేయట్లేదు కొంచెం కూడా దీనికి భయం లేకుండా పోయింది అని ప్రభావతి అంటుంది. మీనా ఏమీ నీకు పనిమనిషి కాదు చెప్పిన పని అంతా చేయడానికి.. కేవలం ఈ ఇంటి కోడలు అని సత్యం అంటాడు. ఇక మనోజ్ పైనుంచి కిందికి రావడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది. ఏదైనా గొడవ జరుగుతుందని అడుగుతుంది. జరగలేదని మనోజ్ అక్కడికి వెళ్తాడు. ప్రభావతి రోహిణి అని పిలిచి మీ మధ్య ఏదైనా గొడవలు జరిగిందా అని అడుగుతుంది. ఇప్పటి వరకైతే ఎటువంటి గొడవలు జరగలేదు ఆంటీ అని రోహిణి చెప్పగానే ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మనోజ్ రోహిణి మీద చిరాకు పడతాడు. నువ్వు జాబ్ చేయడం చేతకాదు కానీ నా మీద అరుస్తావ్ ఏంటి అని రోహిణి అంటుంది. రోహిణి మాట విన్న మనోజు భరించలేక తను చేస్తున్న జాబ్ గురించి బయటకు పెట్టాడు. నా డిగ్రీని పక్కన పెట్టి మరి నీకోసం ఒక వెయిటర్ గా జాబ్ తెచ్చుకున్నాను. అక్కడ వాళ్ళని ఎంతగా అవమానించినా కూడా నీ కోసం నేను జాబ్ చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టే భరించాను.. నన్ను అరుస్తావ్ ఏంటి రోహిణి అని మనోజ్ బాధపడతాడు. ఏది పడితే అది జాబ్ చేయమని చెప్పలేదు నీ డిగ్రీకి తగ్గట్లు జాబ్ చేసుకోమని చెప్పాను దాంతో తప్పేంటి మగాడు అనగా జాబ్ చేయకుండా ఉండాలా అని రోహిణి కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన జాబ్ చేసుకో అసలు జాబ్ ఏ చేయకు నీకు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
బాలు కూడా పైనుంచి కిందకు వస్తాడు. ప్రభావతి మాత్రం ఒక్క మాట కూడా అడగదు. సత్యం నీ కారు ఏమైంది షెడ్ లోని పెట్టి వస్తున్నావ్ ఇంటి దగ్గర కార్ లేదేంటి అని అడుగుతాడు. నాకు ట్రిపుల్ లేనప్పుడు రాజేష్ ఏసుకొని వెళ్తున్నాడు వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు అని అనగానే మొదట సత్యం నమ్మడు. కానీ బాలు నమ్మేలా చేస్తాడు. అక్కడే ఉన్న ప్రభావతి మాత్రం ఈ విషయాన్ని అస్సలు నమ్మదు. రవి కూడా పైనుంచి కిందకి రావడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అనుకుంటుంది. కానీ రవి మాత్రం తెలీదా తప్పించుకుంటాడు. శృతి అక్కడికొచ్చి రవి స్నానం చేస్తాడా నేను స్నానం చేయాలా కనుక్కోండి అని అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియక ప్రభావతి జుట్టు పీక్కుంటుంది.
మీనా గదిలోకి వెళుతుంది.. బాలు ఆ వీడియోని చూసి చిరాకుపడతాడు. బాలు అట్ట వాష్ రూమ్ లోకి వెళ్ళగానే మీనా ఫోన్ ని తీసుకొని చూడబోతుంది. ఇది నా ఫోను నా పర్సనల్ చూడడానికి వీల్లేదు అని బాలు అంటాడు. ఇక తర్వాత పార్వతి మీనాకు ఫోన్ చేసి శివ ఆ గుణ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..