BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలుకు వార్నింగ్ ఇచ్చిన శివ..అద్దె కట్టాలని డిమాండ్ చేసిన ప్రభావతి.. మీనాకు హెచ్చరిక..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు వార్నింగ్ ఇచ్చిన శివ..అద్దె కట్టాలని డిమాండ్ చేసిన ప్రభావతి.. మీనాకు హెచ్చరిక..

Gundeninda GudiGantalu Today episode May 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి మీనా రోహిణి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. తమ భర్తలు తమరికి దూరంగా ఉన్నా సంతోషంగా ఉన్నారని కుళ్లుకుంటారు. వీళ్ళ సంగతి ఏంటో రేపు చెప్పాలి అని శృతి అంటుంది. ఇక ఉదయం లేవగానే సత్యం కాఫీ తాగుతూ ఉంటాడు. మీనా ఎక్కడికెళ్ళింది అని ప్రభావతి లేవగానే అరుస్తూ వస్తుంది. ఎందుకు మీ నాతో ఏం పని అని సత్యం అడుగుతాడు. కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్లింది కనిపించలేదు అని ప్రభావతి అంటుంది.. మీనా కస్టమర్లు వచ్చారని పూల కొట్టు కెళ్ళింది. కాఫీ ఏ కదా కావాల్సింది మిగతా ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళని అడుగు లేదంటే మాత్రం నువ్వే కాఫీ పెట్టుకుని తాగు అని అంటాడు. ఈ పూల కొట్టు పెట్టినప్పటి నుంచి ఇది అసలు ఇంట్లో పనే చేయట్లేదు కొంచెం కూడా దీనికి భయం లేకుండా పోయింది అని ప్రభావతి అంటుంది. మీనా ఏమీ నీకు పనిమనిషి కాదు చెప్పిన పని అంతా చేయడానికి.. కేవలం ఈ ఇంటి కోడలు అని సత్యం అంటాడు. ఇక మనోజ్ పైనుంచి కిందికి రావడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది. ఏదైనా గొడవ జరుగుతుందని అడుగుతుంది. జరగలేదని మనోజ్ అక్కడికి వెళ్తాడు. మొత్తానికి ప్రభావతి మీనా, బాలును బయటకు పంపాలని ఫిక్స్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి మీనాకు ఫోన్ చేసి శివ ఆ గుణ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్తుంది.. వాడి దగ్గరికి వెళ్తే మళ్లీ ఎన్ని సమస్యలు వస్తాయో వీడు చెప్పిన మాట వినట్లేదు అని పార్వతి ఫీల్ అవుతుంది. నువ్వేం బాధపడకు అమ్మ నేను వచ్చి వాడికి చెప్తాను కదా అని మీనా అంటుంది. అల్లుడు గారికి కూడా వాడి దగ్గర పని చేయడం అస్సలు ఇష్టం లేదు కదా వీడు చెప్పిన మాట వినట్లేదు నువ్వు అర్జెంటుగా రావాలి మీ నాని పార్వతి అంటుంది.. ఇక మీనా శివ బయటికి వెళ్తుంటే ఎదురుగా వస్తుంది. ఇప్పుడు చేయాలా ఉంది ఎక్కడికి వెళ్తున్నావ్ అసలు నువ్వు అని అడుగుతుంది. నేను జాబ్ కి వెళ్తున్నాను అక్క మరేం పర్లేదు నాకు అని శివ అంటాడు..

ఆ గుణ దగ్గరికి వెళ్లి ఇలా చేతులు కాళ్లు విరగొట్టుకోవడం అవసరమంటావా అని మీనా గట్టిగా అరుస్తుంది. నన్ను ఆపమని గుణ దగ్గరికి వెళ్లొద్దని మీ ఆయన చెప్పాడా నీకు అని శివ అంటాడు. దానికి కోపంతో రగిలిపోయిన మీనా మా ఆయన ఏంటి బావగారు అని అనలేవా అని అంటుంది. నన్ను కొట్టిన తర్వాత కూడా బావని ఎలా పిలుస్తారు అనుకున్నావా అని శివ అంటాడు. నీవల్ల మా ఇంట్లో నేను మా ఆయన ఒకరి మొహాలు అక్కడ చూసుకోవడమే మానేసామని మీనా అంటుంది. ఏం పర్లేదు నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్ మీ ముగ్గురిని నేనే పోషిస్తాను అని శివ అంటాడు. అది విన్న అందరూ షాక్ అవుతారు.


కార్ల స్టాండ్ లో ఉన్న తన ఫ్రెండ్స్ ని కలవడానికి బాలు వెళ్తాడు. ఏంట్రా అందరూ ఖాళీగా ఉన్నరు ఈరోజు ఏం ట్రిపుల్ లేవా అని అడుగుతారు. లేవు బాలు అందుకే ఖాళీగా మాట్లాడుకుంటున్నాం నువ్వు ఇలా ఆటోలో తిరుగుతుంటే మాకు చాలా బాధగా ఉంది సెకండ్ హ్యాండ్ లో అయినా కారు కొందామని రాజేష్ అంటాడు. సెకండ్ హ్యాండ్ లో కారు కొన్నాలన్న ఎలా లేదనుకున్న 3 లక్షలు అడుగుతున్నారా ఏం పర్లేదు.. మీరే అన్నారు కదా సార్ కొన్ని ఖాళీగా ఉండటం కంటే ఆటోలో దర్జాగా తిరగడం మేలు కదా అని బాలు అంటాడు. అప్పుడే గుణ శివరావడం అక్కడ బాలు చూస్తాడు. మళ్లీ ఎందుకు వచ్చావు నీ డబ్బులు నీకు ఇచ్చేసాను కదా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ గుణతో అంటారు.

నువ్వు మీ కోసం రాలేదు మీ లీడర్ కోసం వచ్చావని గుణ అంటాడు. అప్పుడే శివ డబ్బులను ఇచ్చి ఈ డబ్బులు కోసమే కదా నా చేయి వేరు కొట్టావు నేను డబ్బులు ఇచ్చాను నా చేయి తీసుకొస్తావా అని అడుగుతాడు. ఇది సరిపోతుందా దీనికి వడ్డీ కూడా ఇవ్వాలా ఇదిగో వడ్డీ అనేసి ఇస్తాడు. దానికి బాలు నాకు వడ్డీ ఏమి అవసరం లేదు ఇది మా నాన్న కష్టార్జితం మా నాన్నకే చెందాల అని అంటాడు. మా అక్కని రాయబారానికి పంపావా.. నేను గుణాతో జాబ్ చేయడం నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పు అంతేకానీ నా గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక మీద నుంచి నా గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని శివ బాలు కి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

ఇంట్లో ఇంకా మీనా వంట చేయకపోవడంతో ప్రభావతి చిందులేస్తుంది. ఈమధ్య పూల కొట్టు పెట్టిన తర్వాత నువ్వు అసలు కరెక్ట్ గా భోజనం చేయట్లేదు నేను తిని ఎన్ని రోజులు అవుతుందో అని అంటుంది. జైలుకెళ్తే టైం కి పెడతారు అని అంటుంది. పెద్దంతరం చిన్నతనం లేకుండా ఏంట మాటలు నేను భోజనం కోసం జైలుకెల్లాలా అని అరుస్తుంది ప్రభావతి. అప్పుడే ఒక ఆవిడొచ్చి పూలు కావాలని ఇంట్లోకి వస్తుంది. పూల కొట్టు బయట కదా ఇంట్లోనే పెట్టేసావ్ ఏంటి పూలు అని అడుగుతుంది. ఫ్రిజ్లో పెడితే పూల వాసన వస్తుంది కదా ఆ మాత్రం కూడా నీకు తెలివి లేదా అనేసి అడగ్గానే సత్యం అక్కడికి వచ్చి పెడితే తప్పేముంది అని ప్రభావతికి రివర్స్ షాక్ ఇస్తాడు.

పూలకు డబ్బులు బాగానే వస్తున్నట్లు ఉన్నాయి అది కూడా కట్టలేదు అని అడుగుతుంది అప్పుడే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఏంటంటే ఏంటి పూల కొట్టుకి అద్దె కట్టాలా ఎలా కట్టాలి ఎందుకు కట్టాలి అని అడుగుతాడు. పైన ఫ్లైట్లు వెళ్తుంటాయి వాటికి కూడా నువ్వు డబ్బులు అడుగుతావా ఏంటి అని బాలు సెటైర్ వేస్తాడు. ఇదేదో పెద్ద ప్యాలెస్ పెట్టినట్లు ఆ తెగ ఫీల్ అయిపోతున్నారు ఏంటి ఇప్పుడు రోహిణి నా పేరు పెట్టుకుంది నెల సంపాదించి నాకు ఇస్తుంది అని ప్రభావతి గొప్పగా చెప్పుకుంటుంది. బాలు మాత్రం రోహిణి గురించి నిజం చెప్పబోతాడు సత్యం ఆపుతాడు. ఇక సత్యం కు డబ్బులు ఇస్తాడు ఇది ఆ సురేంద్ర ని పెన్షన్ ఆపాడు కదా ఆ డబ్బులు అని ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది.. మొత్తానికైతే ఎపిసోడ్ పూర్తి అవుతుంది. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మూడు వెరీ స్పెషల్..

Big Stories

×