OTT Movie : ఇప్పటిదాకా ఎన్నో హారర్ సినిమాలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సినిమాను మాత్రం చూసి ఉండరు భయ్యా. సాధారణంగా హర్రర్ సినిమాలు అనగానే భయం గుర్తొస్తుంది. కానీ ఈ హర్రర్ సినిమాను చూస్తే మాత్రం ఏడుపొస్తుంది. పైగా ఇదొక కొరియన్ డ్రామా. కొరియన్ సినిమాలంటే పిచ్చి పిచ్చిగా చూసే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీతో సాగే ఈ కొరియన్ దెయ్యం సినిమా ఏ ఓటీటీలో ఉందంటే…
స్టోరీలోకి వెళితే
హాన్ జున్ (లీ జూన్) అనే యంగ్ హీరో చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. తన మాజీ ప్రియురాలు జియోంగ్-హీ (మున్ కా-యంగ్)తో బ్రేకప్ కావడంతో అప్పటికే హీరో బాగా హర్ట్ అయ్యి ఉంటాడు. మాజీ లవర్ అతన్ని విడిచి పెట్టినప్పుడు చెప్పిన కఠినమైన మాటలు అతని మనస్సులో లోతుగా గాయం చేస్తాయి. దీనివల్ల అతను అకడమిక్‌గా సూపర్ ట్యాలెంటెడ్ అయినప్పటికీ, ఉద్యోగం సంపాదించడంలో, జీవితంలో ముందుకు సాగడంలో కష్టపడతాడు. ఆమె వల్ల అతని జీవితం పూర్తిగా నిరాశతో నిండిపోతుంది.
ఒక రోజు జియోంగ్-హీ ఊహించని విధంగా హీరో జీవితంలోకి తిరిగి వస్తుంది. కానీ మనిషిగా కాదు ఒక ఆత్మ రూపంలో. ఆమె తన కొత్త ప్రియుడిని కనుగొనడంలో సహాయం చేయమని హాన్ జున్ ను కోరుతుంది. ఈ రిక్వెస్ట్ అతనిలో కోపాన్ని, గందరగోళాన్ని మరింతగా పెంచుతాయి. కానీ ఆమె పట్ల ఉన్న జాలి కారణంగా సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలో జియోంగ్-హీ గతం, ఆమె ఆత్మగా మారడానికి కారణమైన సంఘటనల గురించి షాకింగ్ సీక్రెట్స్ వెల్లడవుతాయి. జియోంగ్-హీ ఆత్మ రాకతో, హీరో మరింతగా బాధ పడతాడు. కథ ఒక భావోద్వేగ క్లైమాక్స్ తో ఎండ్ అవుతుంది. అసలు హీరోయిన్ ఎలా చనిపోయింది ? ఆమె బాయ్ ఫ్రెండ్ ఏం అయ్యాడు? హీరో అతన్ని కనిపెట్టాడా? క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అన్పించే మూవీ. కొరియన్ మూవీ లవర్స్ డోంట్ మిస్.
ఏ ఓటీటీలో ఉందంటే ?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియన్ డ్రామా పేరు What’s the Ghost Up To. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక సింగిల్-ఎపిసోడ్ డ్రామా. ఈ మూవీ సైకలాజికల్, ఎమోషనల్ స్టోరీతో ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇందులో ఒక ఆత్మ కీలక పాత్ర పోషించడం అన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో లీ జూన్, మున్ కా-యంగ్, జో సూ-హ్యాంగ్, యో హోయి-హ్యోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సూపర్ నేచురల్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : సచ్చినోళ్ళు మళ్ళీ బ్రతికొచ్చి ఊరంతా వల్లకాడైతే… వణికించే జాంబీ మూవీ