Gundeninda GudiGantalu Today episode May 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ఇంటర్వ్యూ కి వెళ్తాడు ఇంటర్వ్యూ కి వెళ్తాడు. అక్కడ ఇంటర్వ్యూకి ఎక్కువ మంది వస్తే వాళ్ళందరితో మాటలు చెప్పి అందరిని బురిడీ కొట్టించి పంపించేస్తాడు. ఇక మనోజ్ ని ఇంటర్వ్యూకు పిలుస్తారు. మనోజ్ క్వాలిఫికేషన్ చూసి అక్కడ ఉన్న ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంప్రెస్ అయిపోతాడు. అయితే కెనడాల ఉద్యోగం వచ్చిందని అతను చెప్తాడు. జీతము లక్షల్లో ఉంటుంది ఈ జాబ్ రావాలంటే ముందుగా మీరు మా కంపెనీకి 14 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్తారు. అది విన్న మనోజ్ షాక్ అవుతాడు. అయితే ప్రభావతి సత్యం అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. అయితే మనోజు ఇంటర్వ్యూ కి వెళ్లి తొందరగా వస్తాడని మీనాను అన్నం చేయమని చెప్తుంది. ఏంటి ఈ రోజు బాక్స్ తీసుకెళ్లలేదమ్మా రోహిణి అని సత్యం అడుగుతాడు. లేదు మామయ్య ఇంటర్వ్యూ కు వెళ్లాడు అని అంటుంది. ఏంటి ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా పోయిందా వీడికి ఇంకా జాబ్ చేస్తే రాతలేదు అని సత్యం అనగానే..బాలు అదే కదా ఇది కూడా పోయింది అంటేనే కదా ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. ఏం సత్యావతి అబద్ధం చెప్తున్నావేంటి అని ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు. అప్పుడే మనోజు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఏమైందిరా ఇంటర్వ్యూ అంటే చెవులో చెప్తాడు. ప్రభావతి జాబ్ వచ్చేసిందని గొప్పలు చెప్పుకుంటూ అందరి మీద అరుస్తూ ఉంటుంది. పోనీలే నీకు తగ్గట్లు మంచి జాబ్ ఇన్నాళ్ళకైనా వచ్చింది కదా అని అందరూ అంటారు. 14 లక్షలు కట్టాలని చెప్పడంతో అందరు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. మనోజ్ జాబ్ వచ్చింది అని చెప్పగానే ప్రభావతి గాల్లో లేసి ఎగిరినట్లు ఫీల్ అయిపోయి ఓవరాక్షన్ చేస్తుంది.. అది చూసిన ఇంట్లోని వాళ్ళందరూ ఏమైంది ఏంటి మీ ఓవరాక్షన్ ఏంటి తట్టుకోలేకపోతున్నామని అంటారు. మనోజ్ అప్పుడే కెనడాకు వెళ్లిపోయినట్లు, ఎలా ఉండాలో అని ఇప్పటినుంచి అని చెప్తూ ఉంటుంది. నాన్న ఈ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. అసలేం జరిగిందో చెప్పమని బాలు అంటాడు. మనోజ్ కి జాబ్ వచ్చేసింది అని చెప్తుంది. ఎప్పుడు జాయినింగ్ ఎక్కడ జాయినింగ్ అని సత్యం అడుగుతాడు. కెనడాలో జాబ్ వచ్చింది నాన్న అని మనోజ్ అంటాడు. అయితే ముందుగా 14 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే కెనడాకు పంపిస్తారు అంట. ముందు ఆ డబ్బులు కట్టాలి నాన్న అని అనగానే అందరూ షాక్ అవుతారు..
ముఖ్యంగా ప్రభావతి నోరు తెరిచి చూస్తుంది.. అమ్మ లక్షావతి నోరెందుకు కప్పలాగా తెరిచావు అని బాలు సెటైర్లు వేస్తాడు.. ప్రభావతి ఆ 14 లక్షలు ఎదో కట్టేస్తే జాబ్ వస్తుంది కదండీ అని సత్యంతో అంటుంది.. అన్ని లక్షలే ఉంటే నేను ఇలా ఎందుకు ఉంటాను అని సత్యం అంటాడు.. ఇక రోహిణి దగ్గరికి వెళ్లిన ప్రభావతి మీ నాన్నగారిని అడిగి 14 లక్షలు తీసుకోవచ్చు కదా అమ్మ వాడు కెనడాకు వెళ్తాడు మంచి జాబ్ అని చెప్తున్నారు కదా అనేసి అంటుంది. అది విన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లో ఏం జరిగినా తిప్పితిప్పి ఈవిడ నా దగ్గరికి వస్తుంది లేని నాన్నను ఎక్కడినుంచి తీసుకురాను… 14 లక్షల అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్ అని ప్రభావతి అడుగుతుంది.. ఏం లేదు ఆంటీ మా నాన్నగారు ఇప్పుడు బిజీగా ఉంటారు తర్వాత మాట్లాడి ఏమన్నారు చెప్తాను అని అంటుంది..
తర్వాత రోజు ఉదయం మీనా పూలు కొనడానికి పూల మార్కెట్ కు వెళ్తుంది. పూలు కొంటుండగా వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడే బాలు ఒక పెద్ద ఆవిడని తీసుకొని ఆటో నుంచి దిగి పూలు కొనిచ్చి మళ్ళీ ఆవిడను ఆటోలో కూర్చోబెడతాడు. ఇదేంటి ఈయన కార్ ఎక్కడ పెట్టారు ఆటోలో వచ్చాడేంటి అని మీనా డౌట్ పడుతుంది. ఇక మీనా ఈ విషయాన్ని ఇంట్లో చెప్తుంది. ఆలు రాగానే అందరూ కడిగి పడేస్తారు. ఇల్లు తాకట్టు పెట్టి కారు కొనిస్తే ఇలా నువ్వు అమ్మేసి నీ ఖర్చులకోసం వాడుకుంటావా ఆ డబ్బులు ఏం చేస్తావో కచ్చితంగా చెప్పాల్సింది అని ప్రభావతి అడుగుతుంది.. అవసరం నాన్న అంత అవసరం కాబట్టి నేను కారుని అమ్మేశాను అని బాలు అంటాడు. కారణమేసుకుని డబ్బులతో ఏదైనా కొనుక్కున్నాడేమో వాళ్ళ ఆవిడకి చెప్పాడేమో అని ప్రభావతి డౌట్ పడుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..