OTT Movie : మలయాళం సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. స్టోరీ సింపుల్ గా ఉన్నా, దానిని ప్రెజెంట్ చేయడంలో ఈ దర్శకులు సక్సెస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వ్యక్తి రెండు సార్లు లవ్ లో పడతాడు. అతను సినిమా రచయిత కావాలని కూడా కలలు కంటాడు. ఈ స్టోరీ చివరివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
వినోద్ అనే యువకుడు ఒక సినీ రచయిత కావాలని కలలు కంటుంటాడు. ఇతను స్కూల్ రోజుల్లో నుంచి దియా జాన్ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రేమలో వినోద్ ఫైల్ అవుతాడు. దీనివల్ల అతని గుండె తీవ్రంగా గాయపడుతుంది. అతని స్నేహితులు అతన్ని ఈ బాధ నుండి బయటపడేయడానికి సహాయం చేస్తారు. ఈ క్రమంలో, వినోద్ నీనా జాకబ్ అనే మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ కొత్త ప్రేమ కథ ఒక అందమైన గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో, బోట్లలో ప్రయాణాలు, వర్షం, లేఖల ద్వారా ప్రేమను తెలియజేయడం వంటి అంశాలతో సాగుతుంది. అయితే ఒక రోజు వినోద్ తన స్కూల్ ప్రేమ దియాను మళ్లీ గుర్తు చేసుకుంటాడు. ఇది అతని కొత్త ప్రేమ కథలో సమస్యలు తెస్తుంది. వినోద్ జీవితంలో ఈ రెండు ప్రేమ కథలు అతన్ని ఒక ఆట ఆడుకుంటాయి. మరో వైపు అతను సినిమా రచయిత కావాలని తపన పడి ఒక స్టోరీ కూడా మొదలు పెడతాడు. చివరికి వినోద్ తన కలను నెరవేర్చుకుంటాడా ? అతని లవ్ స్టోరీలు ఏమౌతాయి ? ఈ సినిమా ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ బీచ్ కెళితే ముసలి వాళ్ళైపోతారు… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని సర్ప్రైజులు
జియో హాట్ స్టార్ (io hotstar) లో
ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘చెంబరతిపూ’ (Chembarathipoo). 2017లో విడుదలైన ఈ మలయాళ మూవీకి అరుణ్ వైగ దర్శకత్వం వహించారు. ఇందులో అస్కర్ అలీ, అడితి రవి, పార్వతి అరుణ్, అజు వర్గీస్, విశాక్ నాయర్, ధర్మజన్ బొల్గట్టి తదితరులు నటించారు. ఈ కథ వినోద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను తన జీవితంలో రెండు లవ్ స్టోరీలతో పీకల్లోతు మునిగిపోతాడు. ఈ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.