Relationship Tips| భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ముఖ్యంగా ఇంటి పనులు, పిల్లల సంరక్షణ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే మీ భాగస్వామిని ఏదైనా పని చేయమని అడిగితే.. కావాలనే సరిగ్గా చేయకుండా వదిలేస్తున్నారా? మళ్లీ ఆ పని చేయమని అడగకుండా ఉండేలా ప్రవర్తిస్తున్నారా? ఉదాహరణకు బట్టలు మడత పెట్టమంటే సరిగా పెట్టకపోవడం, పిల్లలకు డైపర్ మార్చమంటే తనకు రాదని చెప్పడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తనను నిపుణులు వెపనైజ్డ్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. అసలు దీని అర్థం ఏమిటి? దీని వల్ల మీ దాంపత్య జీవితంలో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం.
ఒక వ్యక్తి తన బాధ్యతలను తప్పించుకోవడానికి కావాలనే పనులను సరిగ్గా చేయకపోవడాన్ని వెపనైజ్డ్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. ఉదాహరణకు ఇంట్లో పాత్రలు కడగమంటే సరిగా కడగకుండా వదిలేయడం, వాషింగ్ మెషీన్ ఉపయోగించడం రాదంటూ బట్టలు ఉతకకుండా వదిలేయడం వంటివి చేస్తారు. ఇలా పదేపదే చేయడం వల్ల మీరు విసిగిపోయి ఆ పనులను మీరే స్వయంగా చేసుకుంటారు. దీంతో మీపై బాధ్యతల భారం పెరుగుతుంది.
1. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది: ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలన్నీ ఒక్కరే చూసుకోవాల్సి వస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
2. భాగస్వామిపై నమ్మకం తగ్గుతుంది: ప్రతిసారీ బాధ్యతల నుంచి తప్పించుకుంటే ఎదుటివారికి నమ్మకం పోతుంది. ఏ పని అప్పగించినా సరిగ్గా చేయరనే భావన ఏర్పడుతుంది.
3. బంధంలో అసంతృప్తి : ఒకరే అన్ని పనులు చేస్తుంటే తమకు గుర్తింపు లేదని, భాగస్వామి సహకరించడం లేదని బాధపడతారు. క్రమంగా ఈ అసంతృప్తి గొడవలకు దారితీయవచ్చు.
Also Read: కొత్త డేటింగ్ ట్రెండ్.. ప్రేమలో అనుబంధం తగ్గితే బ్రేకప్ చేయకుండా మంకీ బ్రాంచింగ్
Also Read: కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు మంచి అవకాశం వచ్చినా సంకోచిస్తారు
మీరు ఏ పనిచేసినా పర్ఫెక్ట్‌గా చేయడం ముఖ్యం కాదు. దాన్ని మీ బాధ్యతగా భావించి చేయాలి. బాధ్యతలను తప్పించుకోకుండా, ఒకరికొకరు సహకరించుకోవడమే మంచి బంధానికి పునాది.