Gundeninda GudiGantalu Today episode November 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే మీనా వంట గదిలో ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావని మీనా ను ప్రభావతి అడుగుతుంది. మీనా మీరు ఏం చెప్తే అది చేస్తాను అత్తయ్య అని అంటుంది. దోస చేయి అనేసి ప్రభావతి అనగానే, మీరు నిన్న చెప్పిన డే దోశ చేసేదన్న అత్తయ్య పెళ్లి లేదు అనేసి అంటుంది. ఇడ్లీ పెట్టు అని అంటుంది. ఇడ్లీ పెట్టడానికి రవ్వ లేదు అయిపోయింది అని అంటుంది.. పూరి వద్దులే అని అంటుంది. ఇంకేమున్నా ఇంట్లో చేయడానికి అని అంటే సరుకులని అయిపోయాయి అత్తయ్య అని మీనా చెప్తుంది. ముందే చూసుకోవాలి కదా ఇప్పుడు చెప్తే ఎలా అనేసి అంటే నేను లేను కదా అత్తయ్య నాకు తెలియదు ఉప్మా రవ్వ ఉంది ఉప్మా చేయమంటారు అని నేను అడుగుతుంది. ఉప్మా అంటే అందరూ నా మీద పడిపోతారేమో అని అంటుంది. ఇక రోహిణి కొరియర్ వస్తుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ దిలీప్ డబ్బులు కావాలని ఆడుతాడు. అక్కడితే ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నిన్న మనోజ్ ను రోహిణి డబ్బులు కావాలని అడుగుతుంది. ఆ విషయం ప్రభావతి వింటుంది. డబ్బులు నువ్వే ఎలాగైనా సర్దు అని అంటాడు. దానికి నాతో చిల్లి గవ్వ కూడా లేదు అని అంటుంది. ఇక మీనాక్షికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతుంది ప్రభావతి. మీనాక్షి ని డబ్బులు కావాలని అడుగుతుంది. తనకు రూ. 50000 కావాలని, ఎలాగైనా సర్దుబాటు చేయమని బ్రతిమిలాడుతోంది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రభావతి చూసి జాలిపడుతుంది మీనాక్షి. తన దగ్గర అంత మొత్తం లేదని కావాలంటే 25000 ఇస్తానని చెబుతోంది. ఈ సమయంలో ఓ ఉచిత సలహా ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తానంటే వెళ్లగొడుతున్నావని, తలుపులు తెరిచి ఇంట్లోకి ఆహ్వానించని చెబుతుంది మీనాక్షి. ఆ మాటలు ప్రభావతి అర్థం కావు.. లక్ష్మీదేవి ఏంటి? నేను అడ్డుకోవడం ఏంటి? అని కామాక్షిని తిరిగి ప్రశ్నిస్తోంది. ‘అదే మీ చిన్న కోడలు..రవి గాడి పెళ్ళాం.. వాళ్ళు కోట్లకు పడగలెత్తినవాళ్లు. శృతి నాన్న సురేంద్రకు అమరావతిలో ఎన్నో ఎకరాల భూమి ఉన్నాయి. చేపల చెరువులు ఉన్నాయి. నువ్వు ఇంటికి రానివ్వకుండా ఉంటే ఆ లక్ష్మి దేవీ వెళ్ళిపోతుంది అంటుంది. నువ్వు బెట్టు చేస్తే రవిని తన ఇంటికే ఇల్లరికం తీసుకెళ్లిపోతుంది అని చెబుతుంది.
అసలు మీనా మంచి పని చేసిందనీ, కోటిశ్వరాలుతో రవి పెళ్లి చేసిందని, నీకు కోడలుగా తీసుకవచ్చిందని చెబుతోంది. మీనా చేసింది క్షమించరాని తప్పు అని వారిస్తోంది. కానీ, మీనాక్షి మాటలతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది. తనకు రవిని ఇంట్లోకి రమ్మని పిలవాలని ఉన్నా.. బాలు, మనోజ్ లు చాలా సీరియస్ గా ఉన్నారని, బాలు ఎట్టి పరిస్థితుల్లో రవిని ఇంట్లోకి రానివ్వరని చెబుతోంది.ఇలాంటి సమయంలోనే తెలివిగా వ్యవహరించాలని, గుమ్మం వరకు వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలువమని మీనాక్షి చెబుతుంది.. ఇక బాలు ఆకలికి తట్టుకోలేక టీల మీద టీ తాగుతాడు. అందరు ఇంట్లో మీనా మీద కోపం ఉంటే భోజనం మీద చూపించకు అంటారు. అందరు తలా ఒక మాట అంటారు. ఇక అప్పుడే బాలు కోసం భోజనం తీసుకొని వస్తుంది..
బాలుకు మళ్లీ కోపం వస్తోంది. తనకు ఆకలిగా లేదని, టిఫిన్ ఎందుకు తీసుకొచ్చావని ఫైర్ అవుతాడు బాలు. ఎంతో కష్టపడి, నీకు ఇష్టమైన చాపల కూర వండుకొని తీసుకోవచ్చానని మీనా చెబుతోంది. అయినా తనకు ఆకలిగా లేదని మొండిగా చెబుతాడు బాలు. చేపల కూర అనగానే.. బాలు ఫ్రెండ్ అరవింద్ టెమ్ట్ అవుతాడు. వాడు తినకపోతే తినపోనీయమ్మ.. నేను తిని పెడుతాను అంటూ తింటారు. తాను ఇక్కడే ఉంటే బాలు తినడానికి.. అర్థం చేసుకొని మీనా ఇంటికి వెళ్లిపోతుంది. మీనా వెళ్ళగానే.. తన కోపాన్ని, పంతాలను, పట్టింపులన్నింటిని పక్కనపెట్టి వచ్చి బాలు కూడా వచ్చి తింటాడు. ఇక ప్రభావతి మనోజ్ ను ఏదోక జాబ్ ను వెతుక్కోమని చెప్పి డబ్బులు ఇస్తుంది.. ప్రతిసారి ఇలా డబ్బులు అడిగి తనని ఇబ్బందులకు పెట్టవద్దనీ, ఇప్పటికైనా ఎదొక జాబ్ చూసుకోమని మనోజ్ కు సలహా ఇస్తుంది. సరే అంటూ తన తల్లి ఇచ్చిన డబ్బులను తీసుకుని వెళ్లాడు మనోజ్. ఇక మీనా జ్యుస్ ఇస్తానని సత్యంతో అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ బాలు వాళ్ళ బామ్మ దీపావళికి అందర్నీ పిలుస్తుంది. అక్కడే దీపావళి జరుపుకుందాం రమ్మని చెప్తుంది. కొత్తగా పెళ్లైన రవిని కూడా పిలవాలని ప్రభావతి అంటుంది ఆ మాట అనగానే బాలు ఫైర్ అవుతాడు. వారిద్దరి మధ్య వాదన జరుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..