Gundeninda GudiGantalu Today episode November 26 th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు దీపావళి పండుగను బాగా జరుపుకోవాలని ఇల్లంతా లైట్లతో నింపేస్తాడు. మీనా ఇంటి నిండా దీపాలు పెడుతుంది. సుశీల చూసి మనమరాలి పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇక తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో భాగంగానే అంతా కలిసి టపాసులు కాల్చుతుంటారు. వారంతా టపాసులు కాలుస్తుంటే పరాయి వాడిలా దూరం నుంచి చూస్తూ ఉంటాడు రవి. తన కుటుంబం అంతా కలిసి సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే తాను మాత్రం ఇంటికి దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతాడు రవి.. శృతి ఫీల్ అవ్వకు మనకు మనమే మన మొదటి పండుగను సెలెబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. రవి శృతిలు దీపావళి బాంబులు కాలుస్తుంటే ఈ సంతోషాన్ని ఎలాగైనా దూరం చెయ్యాలని సంజు శృతిని కారుతో గుద్దేస్తాడు. చింటు కూడా టపాసులు కాలుస్తుంటాడు. అది చూసి మనోజ్ తెగ చిరాకుపడతాడు. వాడు ఎవడికి పుట్టాడో తెలియదు. కానీ, చూడు దర్జాగా ఇంటి మనవడిలాగా ఎలా కాలుస్తున్నాడో చూడు అని చింటు కళ్లలో టపాసుల నిప్పు రవ్వు పడుతుంది. దాంతో రోహిణి తెగ కంగారుపడిపోయి చింటూ అని వెళ్తుంది. రోహిణి తల్లి ప్రేమ బయటపడి చింటుని ఎత్తుకుని పక్కకు లాగుతుంది. అదంతా చూసి మనోజ్, ప్రభావతి, బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బయట దీపావళి సంబరాలు ఘనంగా చేసుకుంటారు సత్యం కుటుంబం. ఇక మీనాను ప్రభావతి అంటుంటే వెనకేసుకొని వస్తాడు బాలు.. ఇక తన గురించి సపోర్టుగా మాట్లాడినందుకు బాలుకు థాంక్స్ చెప్తుంది మీనా. కానీ, భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి తిరిగి మళ్లీ పాత విషయాలను తీస్తాడు. తాను ఎన్ని రోజులైనా క్షమించమని, తన తండ్రికి ఇచ్చిన మాట కోసమే తీసుకువచ్చానని మీనాను ఎగతాళి చేస్తాడు. ఈ విషయాన్ని బాలు నానమ్మ సుశీల గమనిస్తుంది. మీనాను ఎందుకు తిడుతున్నాంటూ బాలుని నిలదీస్తుంది. అసలు కారణం ఏంటి? చెప్పాలని బాలుని అడుగుతోంది. ఇంతలోనే సత్యం అక్కడికి చేరుకుంటారు. అసలు ఏం జరిగిందో ? ఇంట్లో విషయాలను పట్టించుకుంటున్నావా? లేదా? అంటూ సత్యంను కూడా నిలదీస్తోంది సుశీల.. దానికి సత్యం అదేం లేదమ్మా నాకు జ్వరం వస్తే మీనా పట్టించుకోలేదని కోపంగా ఉన్నాడు.. అంతే అని సర్ది చెప్తాడు.
ఆరోగ్యం బాగోలేదని పెళ్ళాం మీద అరిస్తే బాగుపడుతుందా అని సుశీల సత్యం పై అరుస్తుంది. ఇక మీనా ఎప్పుడు తప్పు చేయదు. ఒకవేళ తప్పు చేస్తే.. దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది’ అని సర్దు చెప్తుంది. మరోసారి ఇలాంటి గొడవలు పడ్డట్టు తెలిస్తే బాగోదని హెచ్చరిస్తుంది సుశీల.ఇక పండగ పూర్తి కాగానే తాను ఇంటికి బయలుదేరుతున్నంటూ.. ఊరికి వెళ్తుంది సుశీల. కానీ, మరో నాలుగు రోజులు ఉండి వెళ్లవచ్చు కాదా అని సత్యం రిక్వెస్ట్ చేస్తాడు. సంక్రాంతికి మీరు ఎలాగు అక్కడికి వస్తారు కదా.. ఇప్పడు వెళ్తా.. అంటూ చెబుతోంది. ఈ సమయంలో మీనా గురించి బాలుకి నచ్చదు. నిన్ను నమ్మి మీ ఇంటికి వచ్చిన మీనాను సరిగ్గా చూసుకోమని, తనకి బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా.. నువ్వే తనకు దిక్కు ఏడ్పిస్తే నీకే మంచిది కాదు అని అంటుంది. ఇక సుశీల ప్రభావతికి వరుస కౌంటర్లు వేస్తుంది..
ఇక సుశీల అలా వెళ్లిందో లేదో ప్రభావతి మీనా పై ప్రతాపాన్ని చూపిస్తుంది. పండగ పూట పూలు అమ్ముకోవాలని నువ్వు ఉన్నా కూడా ఇంట్లో లేకుండా పోయారా? పూల కొట్టు దగ్గరనే ఉండిపోయారా? అంటూ హేళనగా మాట్లాడుతుంది. ఇంతకీ మీ అత్తగారు పండుగకి పిలిచి ఏమైనా పెట్టారా? లేదా? అని బాలుని నిలదీస్తుంది. దీంతో బాలుకి ఎక్కడలేని కోపం వస్తుంది. మనోజ్ చూపిస్తూ.. మలేషియా అత్తగారు ఎంత బంగారం పెట్టారు? షిప్ లో పంపించారా? లేదా ఫ్లైట్స్ ల్లో పంపిస్తున్నారా? అంటూ ప్రభావతిని అడుగుతాడు బాలు. తన అత్తగారు పండుగకు పిలిచి బంగారు ఉంగరం పెట్టారని, ఇంట్లో వారందరికీ చూపిస్తారు. దీంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది.. ఆ గొడవ మరింత పెద్దగా అవుతుందని, ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని సత్యం అంటాడు.ఆ తర్వాత సత్యం బాలు తో మాట్లాడుతూ.. సొంత కారుని అమ్మేశావు సరే .. మరి రెంటుకు తీసుకున్న కారు ఏమైంది? అని ప్రశ్నిస్తాడు.
ఇక ఓనర్ కూతురు ఢిల్లీ నుండి వస్తుందని, ఆమెకు కారు కావాలని వారం రోజుల తర్వాత ఇస్తానని ఓనర్ చెప్పాడంటూ కవర్ చేస్తాడు బాలు.. అయితే ఇంట్లో డబ్బులు ఇవ్వవా అని అంటుంది. మరోవైపు రోహిణి వెళ్లి తన శాలరీని తీసుకువచ్చి ప్రభావతికి ఇస్తుంది. మనోజ్ సంగతి అంటే.. వాడు ఎప్పుడో తీసుకవచ్చి.. ఇచ్చాడంటూ కవరింగ్ చేస్తుంది ప్రభావతి. మొగడు పెళ్లాలు ఇద్దరూ ఇంట్లో ఊరికే కూర్చొని తింటే.. వారం రోజులు ఎలా గడుస్తాయని ప్రభావతి అంటుంది.. దాంతో మీనా ఇక ఇంట్లో భోజనం చెయ్యనని చెప్పేసి వెళ్ళిపోతుంది. బాలు కూడా రూమ్ లోకి వెళ్తాడు. ముందుగా బాలుకి మీనా థాంక్స్ చెప్తుంది. కానీ, బాలు మొదటి వస్తాడు.. నీ వల్లనే ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాననీ, తన కారు పోయిందని, తన నాన్న హాస్పిటల్లో పడ్డాడని కారు పోవడానికి కారణం నువ్వే అని చెప్తాడు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..